‘సలార్‌’ విలన్‌ ఫిక్స్‌ - madhu guruswamy is the villain in prabhas and prashanth neels salaar
close
Published : 07/02/2021 10:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘సలార్‌’ విలన్‌ ఫిక్స్‌

సోషల్‌మీడియాలో నటుడి పోస్ట్‌

హైదరాబాద్‌: పాన్‌ఇండియన్‌ స్టార్‌ ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సలార్‌’. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూట్‌ గోదావరి ఖనిలోని బొగ్గుగనిలో జరుగుతోంది. అయితే, ఈ సినిమాలో ప్రతినాయకుడిగా ఎవరు నటించనున్నారనే విషయంలో గత కొన్నిరోజులుగా పలువురు నటుల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాను ‘సలార్‌’లో నటిస్తున్నానని పేర్కొంటూ కన్నడ నటుడు మధూ గురుస్వామి సోషల్‌మీడియాలో ఇటీవల పోస్ట్‌ పెట్టారు.

‘నా తదుపరి ప్రాజెక్ట్‌ ‘సలార్‌’. నాకెంతో ఆనందాన్ని అందిస్తున్న ఈ విషయం గురించి మీతో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ‘సలార్‌’ వంటి అద్భుతమైన ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు ఆనందిస్తున్నాను. నాకు ఇలాంటి సువర్ణ అవకాశాన్ని అందించిన దర్శకుడు ప్రశాంత్‌నీల్, నిర్మాత, నిర్మాణ సంస్థలకు ధన్యవాదాలు’ అని ఆయన పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీంతో మధూ గురుస్వామి.. ‘సలార్‌’లో విలన్‌గా కనిపించనున్నారంటూ ప్రచారం జరుగుతోంది.

హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. శ్రుతిహాసన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన షెడ్యూల్‌లో ప్రభాస్‌-శ్రుతిహాసన్‌లకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఇదీ చదవండి

‘ఉప్పెన’ మరో ‘రంగస్థలం’

పదిహేడేళ్ల తర్వాత ఆ నటి వస్తోందా?మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని