News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Updated : 14 May 2022 08:01 IST
1/20
తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి శనివారం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. భువనేశ్వర్‌లో నూతనంగా నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆయన్ను ఆహ్వానించారు. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి శనివారం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. భువనేశ్వర్‌లో నూతనంగా నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆయన్ను ఆహ్వానించారు.
2/20
భాజపా ఆధ్వర్యంలో తుక్కుగూడలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు హాజరయ్యేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా హైదరాబాద్‌ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన రామాంతపూర్‌లోని సీఎఫ్​ఎస్ఎల్​లో నేషనల్‌ సైబర్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ను ప్రారంభించారు. ల్యాబ్​ విశేషాల గురించి అక్కడి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. భాజపా ఆధ్వర్యంలో తుక్కుగూడలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు హాజరయ్యేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా హైదరాబాద్‌ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన రామాంతపూర్‌లోని సీఎఫ్​ఎస్ఎల్​లో నేషనల్‌ సైబర్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ను ప్రారంభించారు. ల్యాబ్​ విశేషాల గురించి అక్కడి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు.
3/20
4/20
ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ శనివారం సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆలయ అధికారులు ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం గవర్నర్‌కు తీర్థప్రసాదాలను అందజేశారు. ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ శనివారం సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆలయ అధికారులు ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం గవర్నర్‌కు తీర్థప్రసాదాలను అందజేశారు.
5/20
6/20
నృసింహ జయంతిని పురస్కరించుకొని తిరుమల వసంత మంటపంలో శనివారం నృసింహ పూజను శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీవారిని నృసింహస్వామి అలంకారంలో సింహవాహనంపై కొలువుదీర్చారు. సుదర్శన చక్రం, నరసింహుని ప్రతిమను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. నృసింహ జయంతిని పురస్కరించుకొని తిరుమల వసంత మంటపంలో శనివారం నృసింహ పూజను శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీవారిని నృసింహస్వామి అలంకారంలో సింహవాహనంపై కొలువుదీర్చారు. సుదర్శన చక్రం, నరసింహుని ప్రతిమను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు.
7/20
‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు శనివారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. సినీ రంగానికి సంబంధించిన వివిధ అంశాలపై వారు చర్చించారు. ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు శనివారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. సినీ రంగానికి సంబంధించిన వివిధ అంశాలపై వారు చర్చించారు.
8/20
మాదాపూర్‌లోని శిల్పకళా వేదిక‌లో స్టాన్లీ క‌ళాశాల స్నాత‌కోత్స‌వ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టాలు అందుకునేందుకు వచ్చిన పలువురు విద్యార్థినులు ఫొటోలకు పోజులిస్తూ, సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. మాదాపూర్‌లోని శిల్పకళా వేదిక‌లో స్టాన్లీ క‌ళాశాల స్నాత‌కోత్స‌వ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టాలు అందుకునేందుకు వచ్చిన పలువురు విద్యార్థినులు ఫొటోలకు పోజులిస్తూ, సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు.
9/20
10/20
కాదేది కళకు అనర్హం అని నిరూపిస్తున్నారు హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ ఫైన్‌ ఆర్ట్స్‌ విద్యార్థులు. నేర్చుకునే దశలోనే అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారు. రంగు రంగుల వైర్లతో ఊసరవెల్లి బొమ్మను తీర్చిదిద్ది యూనివర్సిటీ ప్రాంగణంలోనే చెట్టుపై పెట్టారు. ఇది దూరం నుంచి చూసేవారిని చెట్టుపై నిజంగానే భారీ ఆకారంలో ఊసరవెల్లి ఉందేమో అని భ్రమింపజేస్తోంది. కాదేది కళకు అనర్హం అని నిరూపిస్తున్నారు హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ ఫైన్‌ ఆర్ట్స్‌ విద్యార్థులు. నేర్చుకునే దశలోనే అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారు. రంగు రంగుల వైర్లతో ఊసరవెల్లి బొమ్మను తీర్చిదిద్ది యూనివర్సిటీ ప్రాంగణంలోనే చెట్టుపై పెట్టారు. ఇది దూరం నుంచి చూసేవారిని చెట్టుపై నిజంగానే భారీ ఆకారంలో ఊసరవెల్లి ఉందేమో అని భ్రమింపజేస్తోంది.
11/20
12/20
భానుడి భగభగలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం వేళ అత్యవసరమైతే తప్ప బయటకు రావడంలేదు. హైదరాబాద్‌లో ఎండ ధాటికి తట్టుకోలేక ఓ వ్యక్తి ఇలా సీసాలో నీటిని ముఖంపై చల్లుకుంటూ కనిపించాడు. భానుడి భగభగలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం వేళ అత్యవసరమైతే తప్ప బయటకు రావడంలేదు. హైదరాబాద్‌లో ఎండ ధాటికి తట్టుకోలేక ఓ వ్యక్తి ఇలా సీసాలో నీటిని ముఖంపై చల్లుకుంటూ కనిపించాడు.
13/20
భాజపా ఆధ్వర్యంలో తుక్కుగూడలో నిర్వహించనున్న సభ కోసం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా శనివారం తెలంగాణకు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ నాయకురాలు డీకే అరుణ తదితరులు ఘనస్వాగతం పలికారు. భాజపా ఆధ్వర్యంలో తుక్కుగూడలో నిర్వహించనున్న సభ కోసం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా శనివారం తెలంగాణకు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ నాయకురాలు డీకే అరుణ తదితరులు ఘనస్వాగతం పలికారు.
14/20
శ్రీలంకలోని కొలంబోలో ప్రజలు పెట్రోలు, వంటగ్యాస్‌ను అందుబాటులో ఉంచాలని పోలీసు స్టేషన్‌ ఎదుట ఆందోళన చేస్తున్నారు. వీటితో పాటు ఔషధాలు, నిత్యావసరాలు, ఆహారానికి కొరత ఏర్పడటంతో ఆయా దుకాణాల వద్ద క్యూలైన్లలో గంటల తరబడి వేచి చూస్తున్నారు. శ్రీలంకలోని కొలంబోలో ప్రజలు పెట్రోలు, వంటగ్యాస్‌ను అందుబాటులో ఉంచాలని పోలీసు స్టేషన్‌ ఎదుట ఆందోళన చేస్తున్నారు. వీటితో పాటు ఔషధాలు, నిత్యావసరాలు, ఆహారానికి కొరత ఏర్పడటంతో ఆయా దుకాణాల వద్ద క్యూలైన్లలో గంటల తరబడి వేచి చూస్తున్నారు.
15/20
16/20
నాగార్జునసాగర్‌ వద్ద కృష్ణా నది తీరాన తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన బుద్ధవనాన్ని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, జగదీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాగార్జునసాగర్‌ వద్ద కృష్ణా నది తీరాన తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన బుద్ధవనాన్ని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, జగదీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
17/20
18/20
ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ శనివారం ఆ రాష్ట్రంలోని ఖుషీనగర్‌లో బుద్ధుడు మహాపరినిర్యాణం చెందిన స్థలాన్ని దర్శించుకున్నారు. ప్రపంచంలో శాంతి నెలకొనాలని ఆయన బుద్ధుడిని ప్రార్థించారు. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ శనివారం ఆ రాష్ట్రంలోని ఖుషీనగర్‌లో బుద్ధుడు మహాపరినిర్యాణం చెందిన స్థలాన్ని దర్శించుకున్నారు. ప్రపంచంలో శాంతి నెలకొనాలని ఆయన బుద్ధుడిని ప్రార్థించారు.
19/20
తిరుపతిలోని పాతయ్య గుంట గంగమ్మ జాతర సందర్భంగా మంత్రి రోజా.. అమ్మవారికి సారె సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసి అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. తిరుపతిలోని పాతయ్య గుంట గంగమ్మ జాతర సందర్భంగా మంత్రి రోజా.. అమ్మవారికి సారె సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసి అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు.
20/20
హైదరాబాద్‌లోని నార్మ్‌(నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌)లో శనివారం నాలుగో స్నాతకోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంక్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురికి విద్యార్హత పట్టాలను అందజేశారు. హైదరాబాద్‌లోని నార్మ్‌(నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌)లో శనివారం నాలుగో స్నాతకోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంక్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురికి విద్యార్హత పట్టాలను అందజేశారు.

మరిన్ని