News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Updated : 15 May 2022 06:16 IST
1/23
వైశాఖ పౌర్ణమి, బుద్ధ జయంతి సందర్భంగా నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని విద్యుద్దీపాల కాంతులతో అందంగా అలంకరించారు. వైశాఖ పౌర్ణమి, బుద్ధ జయంతి సందర్భంగా నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని విద్యుద్దీపాల కాంతులతో అందంగా అలంకరించారు.
2/23
3/23
4/23
ఆస్ర్టేలియా మాజీ క్రికెటర్‌ ఆండ్రూ సైమండ్స్‌ శనివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రముఖ కళాకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌ ఒడిశాలోని పూరీ తీరంలో ఆయన సైకత శిల్పాన్ని తీర్చిదిద్ది నివాళి అర్పించారు. ప్రపంచ క్రికెట్‌కు ఆయన మరణం తీరని లోటు అని సుదర్శన్‌ పట్నాయక్ తెలిపారు. ఆస్ర్టేలియా మాజీ క్రికెటర్‌ ఆండ్రూ సైమండ్స్‌ శనివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రముఖ కళాకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌ ఒడిశాలోని పూరీ తీరంలో ఆయన సైకత శిల్పాన్ని తీర్చిదిద్ది నివాళి అర్పించారు. ప్రపంచ క్రికెట్‌కు ఆయన మరణం తీరని లోటు అని సుదర్శన్‌ పట్నాయక్ తెలిపారు.
5/23
తిరుచానూరులో పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మధ్యాహ్నం శుక్రవారపుతోటలో అమ్మవారి విగ్రహానికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు. సాయంత్రం అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు జరిగాయి. తిరుచానూరులో పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మధ్యాహ్నం శుక్రవారపుతోటలో అమ్మవారి విగ్రహానికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు. సాయంత్రం అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు జరిగాయి.
6/23
7/23
ఖమ్మంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న భాజపా కార్యకర్త సాయిగణేశ్‌ చిత్రపటానికి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నివాళి అర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన.. రాష్ట్ర, స్థానిక నేతల సహకారంతో కొనుగోలు చేసిన ఇంటికి సంబంధించిన పత్రాలను వారికి అందించారు. ఖమ్మంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న భాజపా కార్యకర్త సాయిగణేశ్‌ చిత్రపటానికి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నివాళి అర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన.. రాష్ట్ర, స్థానిక నేతల సహకారంతో కొనుగోలు చేసిన ఇంటికి సంబంధించిన పత్రాలను వారికి అందించారు.
8/23
9/23
హైదరాబాద్‌లోని మూసాపేట వద్ద కదులుతున్న ఆర్టీసీ బస్సును ఎక్కడానికి ఓ యువకుడు పరుగులు పెట్టాడు. కానీ బస్సు వేగాన్ని అందుకోలేక ఇలా పడిపోయాడు.వెనక ఉన్న ప్రయాణికులు డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో బస్సును నిలిపేశాడు. దీంతో యువకుడికి పెద్ద ప్రమాదమే తప్పింది. అనంతరం రన్నింగ్‌ బస్సును ఎక్కొద్దంటూ కండక్టర్‌ సదరు ప్రయాణికుడిని మందలించాడు. హైదరాబాద్‌లోని మూసాపేట వద్ద కదులుతున్న ఆర్టీసీ బస్సును ఎక్కడానికి ఓ యువకుడు పరుగులు పెట్టాడు. కానీ బస్సు వేగాన్ని అందుకోలేక ఇలా పడిపోయాడు.వెనక ఉన్న ప్రయాణికులు డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో బస్సును నిలిపేశాడు. దీంతో యువకుడికి పెద్ద ప్రమాదమే తప్పింది. అనంతరం రన్నింగ్‌ బస్సును ఎక్కొద్దంటూ కండక్టర్‌ సదరు ప్రయాణికుడిని మందలించాడు.
10/23
11/23
విద్యార్థులకు సెలవులతో పాటు ఆదివారం కావడంతో కాకినాడ సముద్ర తీరం జనసంద్రంగా మారింది. చిన్నా పెద్దా తేడా లేకుండా నగరవాసులు అలల్లో జలకాలాడుతూ వేసవి తాపం నుంచి ఉపశమనం పొందారు. విద్యార్థులకు సెలవులతో పాటు ఆదివారం కావడంతో కాకినాడ సముద్ర తీరం జనసంద్రంగా మారింది. చిన్నా పెద్దా తేడా లేకుండా నగరవాసులు అలల్లో జలకాలాడుతూ వేసవి తాపం నుంచి ఉపశమనం పొందారు.
12/23
13/23
భారత ఎన్నికల ప్రధాన అధికారి(సీఈసీ)గా రాజీవ్‌ కుమార్‌ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. దిల్లీలోని ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయమైన నిర్వాచన్‌ సదన్‌లో ఆయన సీఈసీగా విధుల్లో చేరారు. ఇప్పటి వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సుశీల్‌ చంద్ర.. శనివారం పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. భారత ఎన్నికల ప్రధాన అధికారి(సీఈసీ)గా రాజీవ్‌ కుమార్‌ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. దిల్లీలోని ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయమైన నిర్వాచన్‌ సదన్‌లో ఆయన సీఈసీగా విధుల్లో చేరారు. ఇప్పటి వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సుశీల్‌ చంద్ర.. శనివారం పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే.
14/23
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి వద్ద వెంకటేశ్వరరావు అనే రైతు అర ఎకరం భూమిలో చేపల చెరువును సాగు చేస్తున్నాడు. ఈక్రమంలో పక్షులు చేపలను తింటూ విపరీతంగా నష్టం చేకూర్చాయి. దీంతో తక్కువ ఖర్చుతో నష్టాన్ని అరికట్టాలని భావించాడు. చేపల చెరువు మొత్తం ఇలా రంగురంగుల ప్లాస్టిక్‌ తోరణాలను కట్టాడు. గాలికి రంగుల తోరణాలు కదలడంతో పక్షులు రావడానికి భయపడుతున్నాయని వెంకటేశ్వరరావు ఆనందం వ్యక్తం చేశాడు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి వద్ద వెంకటేశ్వరరావు అనే రైతు అర ఎకరం భూమిలో చేపల చెరువును సాగు చేస్తున్నాడు. ఈక్రమంలో పక్షులు చేపలను తింటూ విపరీతంగా నష్టం చేకూర్చాయి. దీంతో తక్కువ ఖర్చుతో నష్టాన్ని అరికట్టాలని భావించాడు. చేపల చెరువు మొత్తం ఇలా రంగురంగుల ప్లాస్టిక్‌ తోరణాలను కట్టాడు. గాలికి రంగుల తోరణాలు కదలడంతో పక్షులు రావడానికి భయపడుతున్నాయని వెంకటేశ్వరరావు ఆనందం వ్యక్తం చేశాడు.
15/23
యునైటెడ్ అరబ్ 

ఎమిరేట్స్‌(యూఏఈ) అధ్యక్షుడు 

షేక్ ఖలీఫా బిన్‌ జాయెద్ అల్‌ 

నహ్యాన్‌ మృతికి భారత ప్రభుత్వం 

తరఫున సంతాపం తెలిపేందుకు ఉప 

రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు 

అబుదాభి చేరుకున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌(యూఏఈ) అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్‌ జాయెద్ అల్‌ నహ్యాన్‌ మృతికి భారత ప్రభుత్వం తరఫున సంతాపం తెలిపేందుకు ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అబుదాభి చేరుకున్నారు.
16/23
భారత్‌ చరిత్ర సృష్టించింది. చిరస్మరణీయమైన ప్రదర్శనతో థామస్‌కప్‌ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో బలమైన జట్టును ఓడించి బ్యాడ్మింటన్‌లో సువర్ణాధ్యాయాన్ని లిఖించింది. 14సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఇండోనేషియాపై చారిత్రక విజయాన్ని భారత్‌ నమోదు చేసింది. అద్భుత ఆటతీరులో భారత ఆటగాళ్లు తుదిపోరులో ఇండోనేషియాను ఉక్కిరిబిక్కిరి చేశారు. ప్రత్యర్థి జట్టుపై 3-0 తేడాతో విజయ కేతనాన్ని ఎగరవేశారు. భారత్‌ చరిత్ర సృష్టించింది. చిరస్మరణీయమైన ప్రదర్శనతో థామస్‌కప్‌ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో బలమైన జట్టును ఓడించి బ్యాడ్మింటన్‌లో సువర్ణాధ్యాయాన్ని లిఖించింది. 14సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఇండోనేషియాపై చారిత్రక విజయాన్ని భారత్‌ నమోదు చేసింది. అద్భుత ఆటతీరులో భారత ఆటగాళ్లు తుదిపోరులో ఇండోనేషియాను ఉక్కిరిబిక్కిరి చేశారు. ప్రత్యర్థి జట్టుపై 3-0 తేడాతో విజయ కేతనాన్ని ఎగరవేశారు.
17/23
ఇటీవల మృతి చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, జర్నలిస్టు సి.నరసింహారావు చిత్రపటానికి తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నివాళి అర్పించారు. అనంతరం బాధిత కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. ఇటీవల మృతి చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, జర్నలిస్టు సి.నరసింహారావు చిత్రపటానికి తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నివాళి అర్పించారు. అనంతరం బాధిత కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు.
18/23
హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లో ఓ నూతన ఐస్‌ క్రీం పార్లర్‌ను యువ కథానాయిక అనుపమ పరమేశ్వరన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా 

ఫొటోలకు పోజులిస్తూ ఆమె సందడి చేశారు. హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లో ఓ నూతన ఐస్‌ క్రీం పార్లర్‌ను యువ కథానాయిక అనుపమ పరమేశ్వరన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫొటోలకు పోజులిస్తూ ఆమె సందడి చేశారు.
19/23
 తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి
20/23
రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ జూబ్లీహిల్స్‌లోని 

పెద్దమ్మతల్లి దేవాలయాన్ని సందర్శించారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మతల్లి దేవాలయాన్ని సందర్శించారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
21/23
విశాఖ ద్వారకానగర్‌లో ఓ నూతన వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి ‘డీజే టిల్లు’ సినిమా హీరో, హీరోయిన్‌ సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి 

హాజరయ్యారు. వీరిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అభిమానులు భారీగా తరలివచ్చారు. 
విశాఖ ద్వారకానగర్‌లో ఓ నూతన వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి ‘డీజే టిల్లు’ సినిమా హీరో, హీరోయిన్‌ సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి హాజరయ్యారు. వీరిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అభిమానులు భారీగా తరలివచ్చారు.
22/23
ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై రష్యా సేనలు దాడులతో విరుచుకుపడుతూనే ఉన్నాయి. కీవ్ నగరంపై రష్యా సైనికులు బాంబుల వర్షం 

కురిపించగా.. ఓ బహుళ అంతస్తుల భవనం ఇలా మంటల్లో చిక్కుకుంది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై రష్యా సేనలు దాడులతో విరుచుకుపడుతూనే ఉన్నాయి. కీవ్ నగరంపై రష్యా సైనికులు బాంబుల వర్షం కురిపించగా.. ఓ బహుళ అంతస్తుల భవనం ఇలా మంటల్లో చిక్కుకుంది.
23/23
రోజురోజుకీ పెరిగిపోతున్న వంట గ్యాస్‌ ధరలు చూసి సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కేంద్ర 

ప్రభుత్వం వంట గ్యాస్‌ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ బాలాపూర్‌ చౌరస్తాలో ఎంపీ రంజిత్‌రెడ్డితో కలిసి ఆమె వంటావార్పు కార్యక్రమంలో 

పాల్గొ్న్నారు. రోజురోజుకీ పెరిగిపోతున్న వంట గ్యాస్‌ ధరలు చూసి సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్‌ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ బాలాపూర్‌ చౌరస్తాలో ఎంపీ రంజిత్‌రెడ్డితో కలిసి ఆమె వంటావార్పు కార్యక్రమంలో పాల్గొ్న్నారు.

మరిన్ని