News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Updated : 20 May 2022 02:54 IST
1/21
పుట్లూరు మండలంలోని మడ్డిపల్లి గ్రామం నుంచి ఎల్లుట్లకు వెళ్లే రహదారి వర్షానికి బురదతో నిండి చిత్తడిగా మారింది. ఈ మార్గంలో 

రాకపోకలకు ద్విచక్ర వాహనదారులు, ప్రయాణికులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. పుట్లూరు నుంచి నార్పల వరకు ఏడాది కిందట 

తారురోడ్డు నిర్మాణం జరిగినా అక్కడకక్కడ అసంపూర్తిగా వదిలేశారు. ముఖ్యంగా మడ్డిపల్లి నుంచి ఎల్లుట్లకు వెళ్లే దారిలో నాలుగు చోట్ల 

రోడ్డు వేయకపోవడంతో బురద నిండిపోయింది. ద్విచక్ర వాహనదారులు గట్టుపై వెళుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు 

సత్వరమే రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ప్రమాదాలను నివారించాలని ప్రజలు కోరుతున్నారు. పుట్లూరు మండలంలోని మడ్డిపల్లి గ్రామం నుంచి ఎల్లుట్లకు వెళ్లే రహదారి వర్షానికి బురదతో నిండి చిత్తడిగా మారింది. ఈ మార్గంలో రాకపోకలకు ద్విచక్ర వాహనదారులు, ప్రయాణికులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. పుట్లూరు నుంచి నార్పల వరకు ఏడాది కిందట తారురోడ్డు నిర్మాణం జరిగినా అక్కడకక్కడ అసంపూర్తిగా వదిలేశారు. ముఖ్యంగా మడ్డిపల్లి నుంచి ఎల్లుట్లకు వెళ్లే దారిలో నాలుగు చోట్ల రోడ్డు వేయకపోవడంతో బురద నిండిపోయింది. ద్విచక్ర వాహనదారులు గట్టుపై వెళుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు సత్వరమే రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ప్రమాదాలను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.
2/21
తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం వద్ద పశు అంబులెన్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం జరిగింది. ఆ సమయంలో వర్షం 

రావడంతో సీఎం జగన్‌ గొడుగుతో కనిపించారు. అంబులెన్సుల పరిశీలన, కొత్త అంబులెన్సుల ప్రారంభోత్సవం అంతా వానలోనే జరిగింది. 

సీఎం జగన్‌తోపాటుగా.. వైఎస్‌ విగ్రహానికి కూడా పోలీసులు గొడుగుపట్టారు.


తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం వద్ద పశు అంబులెన్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం జరిగింది. ఆ సమయంలో వర్షం రావడంతో సీఎం జగన్‌ గొడుగుతో కనిపించారు. అంబులెన్సుల పరిశీలన, కొత్త అంబులెన్సుల ప్రారంభోత్సవం అంతా వానలోనే జరిగింది. సీఎం జగన్‌తోపాటుగా.. వైఎస్‌ విగ్రహానికి కూడా పోలీసులు గొడుగుపట్టారు.
3/21
4/21
జాతీయ రహదారిపై అతివేగంగా వెళ్లే ద్విచక్రవాహనాలు తరచూ ప్రమాదాలకు గురై జనం ప్రాణాలు కోల్పోతున్నారు. హెల్మెట్‌లేక మరణాలు 

సంభవించినవే ఎక్కువగా ఉంటున్నాయి. అచార్య నాగార్జున యూనివర్సిటీ  సమీపంలో జాతీయ రహదారి పక్కనే శిరస్త్రాణం ధరించిన 

బొమ్మను ఏర్పాటుచేసి వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. జాతీయ రహదారిపై అతివేగంగా వెళ్లే ద్విచక్రవాహనాలు తరచూ ప్రమాదాలకు గురై జనం ప్రాణాలు కోల్పోతున్నారు. హెల్మెట్‌లేక మరణాలు సంభవించినవే ఎక్కువగా ఉంటున్నాయి. అచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలో జాతీయ రహదారి పక్కనే శిరస్త్రాణం ధరించిన బొమ్మను ఏర్పాటుచేసి వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు.
5/21
విశాఖపట్నం సాగర్‌నగర్‌లో ఇస్కాన్‌మందిరం సమీపంలో ఓ నర్సరీ నిర్వాహకులు...తమ ఇంటి చుట్టూ మొక్కలు పెంచేందుకు చూపిన  

ప్రత్యేక శ్రద్ధ ఆకట్టుకుంటోంది.  గోడలకు అరలు...అరలుగా చేసిన ఏర్పాట్లు...వాటిలో పెరుగుతున్న మొక్కల హరిత అందాలు 

అలరిస్తున్నాయి.  విశాఖపట్నం సాగర్‌నగర్‌లో ఇస్కాన్‌మందిరం సమీపంలో ఓ నర్సరీ నిర్వాహకులు...తమ ఇంటి చుట్టూ మొక్కలు పెంచేందుకు చూపిన ప్రత్యేక శ్రద్ధ ఆకట్టుకుంటోంది. గోడలకు అరలు...అరలుగా చేసిన ఏర్పాట్లు...వాటిలో పెరుగుతున్న మొక్కల హరిత అందాలు అలరిస్తున్నాయి.
6/21
ఒంగోలు పోలీసు కవాతు మైదానంలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిబిరంలో శిక్షణ పొందుతున్న చిన్నారుల కోసం... పోలీసులు గురువారం 

ప్రత్యేకంగా ఆయుధ ప్రదర్శన నిర్వహించారు. ఎస్పీ మలికా గార్గ్‌ ఆదేశాల మేరకు ఏఆర్‌ అదనపు ఎస్పీ అశోక్‌బాబు ఆధ్వర్యంలో 

అధికారులు ఈ కార్యక్రమం చేపట్టారు. ఏకే 47, 9 ఎంఎం బ్లాక్‌ పిస్టల్, పాయింట్‌ 22 రైఫిల్, పాయింట్‌ 303 లైట్‌ మెషీన్‌ గన్, 7.62 

ఎం.ఎం ఎస్‌ఎల్‌ఆర్, ఫెడరల్‌ గ్యాస్‌ గన్, పాయింట్‌ 380 రివాల్వర్, గ్రనేడ్‌ హెచ్‌ఈ 36, గ్యాస్‌ గ్రనేడ్, ఎల్‌ఎంజీ 5.56 ఎం.ఎం, 9 ఎం,ఎం, 

కార్బన్, రబ్బర్‌ బుల్లెట్‌లు, రోబో డ్రెస్, ఇతర ఆయుధాలను ప్రదర్శించారు. వాటిని వినియోగించే తీరును పిల్లలకు అర్థమయ్యే రీతిలో 

వివరించారు.  ఒంగోలు పోలీసు కవాతు మైదానంలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిబిరంలో శిక్షణ పొందుతున్న చిన్నారుల కోసం... పోలీసులు గురువారం ప్రత్యేకంగా ఆయుధ ప్రదర్శన నిర్వహించారు. ఎస్పీ మలికా గార్గ్‌ ఆదేశాల మేరకు ఏఆర్‌ అదనపు ఎస్పీ అశోక్‌బాబు ఆధ్వర్యంలో అధికారులు ఈ కార్యక్రమం చేపట్టారు. ఏకే 47, 9 ఎంఎం బ్లాక్‌ పిస్టల్, పాయింట్‌ 22 రైఫిల్, పాయింట్‌ 303 లైట్‌ మెషీన్‌ గన్, 7.62 ఎం.ఎం ఎస్‌ఎల్‌ఆర్, ఫెడరల్‌ గ్యాస్‌ గన్, పాయింట్‌ 380 రివాల్వర్, గ్రనేడ్‌ హెచ్‌ఈ 36, గ్యాస్‌ గ్రనేడ్, ఎల్‌ఎంజీ 5.56 ఎం.ఎం, 9 ఎం,ఎం, కార్బన్, రబ్బర్‌ బుల్లెట్‌లు, రోబో డ్రెస్, ఇతర ఆయుధాలను ప్రదర్శించారు. వాటిని వినియోగించే తీరును పిల్లలకు అర్థమయ్యే రీతిలో వివరించారు.
7/21
పసుపు రంగులోని మొక్కజొన్న చూశాం. కానీ ఇవేంటి తెల్లగా కనిపిస్తున్నాయనుకుంటున్నారా.. ఇవి తెల్లని గింజలున్న మొక్కజొన్న 

కండెలే. విత్తన పంట సాగులో భాగంగా కామవరపుకోట మండలం ఆడమిల్లికి చెందిన శివాజీ నేతృత్వంలో కొంత మంది రైతులు 40 

ఎకరాల్లో పండించారు. మహారాష్ట్రలోని జాల్నా ప్రాంతానికి చెందిన మొక్కజొన్న విత్తన సంస్థ విత్తనోత్పత్తిలో భాగంగా ఎంపిక చేసిన 

ప్రాంతాల్లోని రైతులకు విత్తనాలను సరఫరా చేసింది. వారు సూచించిన నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ సాగు చేశామని, దిగుబడి బాగానే 

వచ్చిందన్నారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం వారే కొనుగోలు చేస్తారని తెలిపారు.  పసుపు రంగులోని మొక్కజొన్న చూశాం. కానీ ఇవేంటి తెల్లగా కనిపిస్తున్నాయనుకుంటున్నారా.. ఇవి తెల్లని గింజలున్న మొక్కజొన్న కండెలే. విత్తన పంట సాగులో భాగంగా కామవరపుకోట మండలం ఆడమిల్లికి చెందిన శివాజీ నేతృత్వంలో కొంత మంది రైతులు 40 ఎకరాల్లో పండించారు. మహారాష్ట్రలోని జాల్నా ప్రాంతానికి చెందిన మొక్కజొన్న విత్తన సంస్థ విత్తనోత్పత్తిలో భాగంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లోని రైతులకు విత్తనాలను సరఫరా చేసింది. వారు సూచించిన నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ సాగు చేశామని, దిగుబడి బాగానే వచ్చిందన్నారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం వారే కొనుగోలు చేస్తారని తెలిపారు.
8/21
పక్షులంటే ఆసక్తి ఉన్న కొందరు వాటి సంరక్షణలోనూ తమ అభిరుచి చాటుకుంటున్నారు. అలా వచ్చిందే ఈ ఆలోచన. విశాఖపట్నం ఆర్‌కే 

బీచ్‌ సమీపంలోని పాండురంగాపురంలో పక్షులకు ఆహారంగా వడ్లు అందుబాటులో ఉంచే క్రమంలో...వరికంకులనే వడ్డాణంలా తయారు 

చేయించి చూడముచ్చటగా ఇంటి ముందు వేలాడదీశారు. పక్షులంటే ఆసక్తి ఉన్న కొందరు వాటి సంరక్షణలోనూ తమ అభిరుచి చాటుకుంటున్నారు. అలా వచ్చిందే ఈ ఆలోచన. విశాఖపట్నం ఆర్‌కే బీచ్‌ సమీపంలోని పాండురంగాపురంలో పక్షులకు ఆహారంగా వడ్లు అందుబాటులో ఉంచే క్రమంలో...వరికంకులనే వడ్డాణంలా తయారు చేయించి చూడముచ్చటగా ఇంటి ముందు వేలాడదీశారు.
9/21
హనుమకొండ పెద్దమ్మగడ్డలోని ఓ వేడుకల మందిరంలో గురువారం రాత్రి ఓ స్టూడియో సంస్థ నిర్వహించిన ఫ్యాషన్‌ షో కార్యక్రమానికి సినీ 

నటి, ఆర్‌ఎక్స్‌100 ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ హాజరయ్యారు. మోడల్స్‌తో కలిసి సందడి చేశారు. చిన్నారులతో నృత్యం చేస్తూ అలరించారు. 

వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మోడల్స్‌ ర్యాంప్‌వాక్‌ చేశారు. ఈ కార్యక్రమానికి సుమారు 12 రాష్ట్రాల నుంచి 250 మంది మోడల్స్‌ 

పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. హనుమకొండ పెద్దమ్మగడ్డలోని ఓ వేడుకల మందిరంలో గురువారం రాత్రి ఓ స్టూడియో సంస్థ నిర్వహించిన ఫ్యాషన్‌ షో కార్యక్రమానికి సినీ నటి, ఆర్‌ఎక్స్‌100 ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ హాజరయ్యారు. మోడల్స్‌తో కలిసి సందడి చేశారు. చిన్నారులతో నృత్యం చేస్తూ అలరించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మోడల్స్‌ ర్యాంప్‌వాక్‌ చేశారు. ఈ కార్యక్రమానికి సుమారు 12 రాష్ట్రాల నుంచి 250 మంది మోడల్స్‌ పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.
10/21
అకాల వర్షాలు.. కర్షకుల కంట కన్నీరు తెప్పిస్తున్నాయి. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడిసి మొలకలు వస్తుండటంతో ఆందోళన 

వ్యక్తం చేస్తున్నారు. నార్సింగి మండలం భీంరావుపల్లి పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసిన వడ్లు మొలకెత్తడంతో రైతులు వాటిని 

వేరు చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. నిర్వాహకులు తగినన్ని టార్పాలిన్లు ఇవ్వటం లేదని.. దీంతో అద్దెకు తెచ్చుకోవాల్సి 

వస్తోందని అన్నదాతలు వాపోతున్నారు. చాలా రోజుల క్రితం ధాన్యం తెచ్చినా తూకం వేయడం లేదని వారు అంటున్నారు. మరోవైపు 

నార్సింగిలోని న్యూ తిరుమల రైస్‌మిల్లులో నిల్వ చేసిన ధాన్యం బస్తాల వద్ద వడ్లు మొలకెత్తి నారుమడిని తలపిస్తున్నాయి.  అకాల వర్షాలు.. కర్షకుల కంట కన్నీరు తెప్పిస్తున్నాయి. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడిసి మొలకలు వస్తుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నార్సింగి మండలం భీంరావుపల్లి పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసిన వడ్లు మొలకెత్తడంతో రైతులు వాటిని వేరు చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. నిర్వాహకులు తగినన్ని టార్పాలిన్లు ఇవ్వటం లేదని.. దీంతో అద్దెకు తెచ్చుకోవాల్సి వస్తోందని అన్నదాతలు వాపోతున్నారు. చాలా రోజుల క్రితం ధాన్యం తెచ్చినా తూకం వేయడం లేదని వారు అంటున్నారు. మరోవైపు నార్సింగిలోని న్యూ తిరుమల రైస్‌మిల్లులో నిల్వ చేసిన ధాన్యం బస్తాల వద్ద వడ్లు మొలకెత్తి నారుమడిని తలపిస్తున్నాయి.
11/21
ఈ నెల 23 నుంచి ప్రారంభమయ్యే ఉత్తరప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు హైటెక్‌ తరహాలో జరగబోతున్నాయి. పూర్తిగా కాగిత రహిత 

విధానంలో సభను నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేలు కూర్చునే స్థానాలను హైటెక్‌ విధానంలో రూపొందించడంతోపాటు వాటిపై ట్యాబ్లెట్లను 

కూడా అమర్చారు. తద్వారా వారు ప్రశ్నోత్తరాలు, ఇతర కార్యక్రమాల్లోనూ సాంకేతిక పద్ధతిలో పాల్గొనవచ్చు. నాగాలాండ్‌ తరువాత సభ 

కార్యకలాపాలు పూర్తిగా కాగితరహితంగా ఉన్న రెండో రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌. ఈ నెల 23 నుంచి ప్రారంభమయ్యే ఉత్తరప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు హైటెక్‌ తరహాలో జరగబోతున్నాయి. పూర్తిగా కాగిత రహిత విధానంలో సభను నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేలు కూర్చునే స్థానాలను హైటెక్‌ విధానంలో రూపొందించడంతోపాటు వాటిపై ట్యాబ్లెట్లను కూడా అమర్చారు. తద్వారా వారు ప్రశ్నోత్తరాలు, ఇతర కార్యక్రమాల్లోనూ సాంకేతిక పద్ధతిలో పాల్గొనవచ్చు. నాగాలాండ్‌ తరువాత సభ కార్యకలాపాలు పూర్తిగా కాగితరహితంగా ఉన్న రెండో రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌.
12/21
ప్రపంచంలో ఎత్తయిన ఆటోమేటిక్‌ వాతావరణ కేంద్రాన్ని నేషనల్‌ జియోగ్రాఫిక్‌ సొసైటీ నిపుణులు ఎవరెస్టు శిఖరంపై 8,830 మీటర్ల ఎత్తున 

ఏర్పాటు చేశారు. వివిధ వాతావరణ మార్పులను స్వయంచాలకంగా ఈ కేంద్రం గుర్తిస్తుంది. ఎవరెస్టు శిఖరాగ్రానికి (8,848.86 మీటర్లు) 

కొద్ది మీటర్ల దిగువన ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు నేపాల్‌కు చెందిన జల, వాతావరణ విభాగం (డీహెచ్‌ఎం) తెలిపింది. సౌరశక్తి 

సాయంతో ఇది పనిచేస్తుంది. ప్రపంచంలో ఎత్తయిన ఆటోమేటిక్‌ వాతావరణ కేంద్రాన్ని నేషనల్‌ జియోగ్రాఫిక్‌ సొసైటీ నిపుణులు ఎవరెస్టు శిఖరంపై 8,830 మీటర్ల ఎత్తున ఏర్పాటు చేశారు. వివిధ వాతావరణ మార్పులను స్వయంచాలకంగా ఈ కేంద్రం గుర్తిస్తుంది. ఎవరెస్టు శిఖరాగ్రానికి (8,848.86 మీటర్లు) కొద్ది మీటర్ల దిగువన ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు నేపాల్‌కు చెందిన జల, వాతావరణ విభాగం (డీహెచ్‌ఎం) తెలిపింది. సౌరశక్తి సాయంతో ఇది పనిచేస్తుంది.
13/21
కంకిపాడు మండలం కుందేరులో రైవస్‌ కాలువపై తాత్కాలిక ఇనుప వంతెన ఇది. ఇనుప రేకుల మధ్య ఖాళీలు పెరగడంతో ద్విచక్ర 

వాహనాల చక్రాలు ఇరుక్కుపోతున్నాయి. రేకులకు రంధ్రాలు ఏర్పడి, బోల్టులు ఊడిపోయి పైకి, కిందకు ఊగిపోతున్నాయి. రైతుల లోడు 

ట్రాక్టర్లు దీనిపై నుంచే వెళ్తుంటాయి. పునాదిపాడు నుంచి గన్నవరం, మానుకొండ, పెదపారుపూడి, గుడివాడ వెళ్లేందుకు ఈ మార్గం ఎంతో 

సౌకర్యం. వంతెన ప్రమాదకరంగా ఉండడంతో ఈ గ్రామాలకు వెళ్లే వాహనచోదకులు భయం భయంగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. పక్కనే 

నిర్మాణ దశలోనే నిలిచిపోయిన వంతెన పూర్తయితే సౌకర్యవంతంగా ఉంటుందని, ప్రజాప్రతినిధులు ఆ దిశగా చర్యలు చేపట్టాలని ప్రజలు 

కోరుతున్నారు. కంకిపాడు మండలం కుందేరులో రైవస్‌ కాలువపై తాత్కాలిక ఇనుప వంతెన ఇది. ఇనుప రేకుల మధ్య ఖాళీలు పెరగడంతో ద్విచక్ర వాహనాల చక్రాలు ఇరుక్కుపోతున్నాయి. రేకులకు రంధ్రాలు ఏర్పడి, బోల్టులు ఊడిపోయి పైకి, కిందకు ఊగిపోతున్నాయి. రైతుల లోడు ట్రాక్టర్లు దీనిపై నుంచే వెళ్తుంటాయి. పునాదిపాడు నుంచి గన్నవరం, మానుకొండ, పెదపారుపూడి, గుడివాడ వెళ్లేందుకు ఈ మార్గం ఎంతో సౌకర్యం. వంతెన ప్రమాదకరంగా ఉండడంతో ఈ గ్రామాలకు వెళ్లే వాహనచోదకులు భయం భయంగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. పక్కనే నిర్మాణ దశలోనే నిలిచిపోయిన వంతెన పూర్తయితే సౌకర్యవంతంగా ఉంటుందని, ప్రజాప్రతినిధులు ఆ దిశగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
14/21
భానుడి ప్రతాపం, ఈదురు గాలులు, చెట్లపై నుంచి దించే క్రమంలో కాయకు ఏమాత్రం దెబ్బతగిలినా ఎగుమతికి ఉపయోగపడదని 

తీసివేస్తారు. గతేడాదితో పోలిస్తే మామిడి దిగుబడి తగ్గిందని, దెబ్బతిన్న కాయలే ఎక్కువగా వస్తుండడంతో అటు మామిడి రైతులు, ఇటు 

వ్యాపారులు నష్టపోతున్నామని చెబుతున్నారు. నున్న మామిడి మార్కెట్లో ఎక్కడ చూసినా వృథాగా పడేసిన మామిడి కాయలే 

కనిపిస్తున్నాయి. భానుడి ప్రతాపం, ఈదురు గాలులు, చెట్లపై నుంచి దించే క్రమంలో కాయకు ఏమాత్రం దెబ్బతగిలినా ఎగుమతికి ఉపయోగపడదని తీసివేస్తారు. గతేడాదితో పోలిస్తే మామిడి దిగుబడి తగ్గిందని, దెబ్బతిన్న కాయలే ఎక్కువగా వస్తుండడంతో అటు మామిడి రైతులు, ఇటు వ్యాపారులు నష్టపోతున్నామని చెబుతున్నారు. నున్న మామిడి మార్కెట్లో ఎక్కడ చూసినా వృథాగా పడేసిన మామిడి కాయలే కనిపిస్తున్నాయి.
15/21
విజయవాడ గ్రామీణం అంతర వలయ రహదారి నుంచి కొత్తూరు తాడేపల్లి, వెలగలేరు, మైలవరం రోడ్డు ఇది. జక్కంపూడి సమీపంలో 

ఇటీవల నూతనంగా నిర్మించిన రహదారిపై తారు ఇలా పెచ్చులు పెచ్చులుగా ఊడి ద్విచక్ర వాహనదారుల పాలిట ప్రాణాంతకంగా 

మారుతోంది. విజయవాడ గ్రామీణం అంతర వలయ రహదారి నుంచి కొత్తూరు తాడేపల్లి, వెలగలేరు, మైలవరం రోడ్డు ఇది. జక్కంపూడి సమీపంలో ఇటీవల నూతనంగా నిర్మించిన రహదారిపై తారు ఇలా పెచ్చులు పెచ్చులుగా ఊడి ద్విచక్ర వాహనదారుల పాలిట ప్రాణాంతకంగా మారుతోంది.
16/21
తెలంగాణ రాష్ట్రంలో పోటీపరీక్షలకు యువతీయువకులు సిద్ధమవుతున్న తరుణం. వారికి అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్న సమాచారంతో నిరుద్యోగులు హిమాయత్‌నగర్‌లోని తెలుగు అకాడమీ వద్ద ఇలా బారులు తీరారు. తెలంగాణ చరిత్ర-సంస్కృతి, తెలంగాణ ఉద్యమం-రాష్ట్రావతరణ, భారత ఆర్థిక వ్యవస్థ, జనరల్‌ స్టడీస్‌, భారత రాజ్యాంగంపై అకాడమీ పుస్తకాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు తెలుగు అకాడమీ అధికారులు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో పోటీపరీక్షలకు యువతీయువకులు సిద్ధమవుతున్న తరుణం. వారికి అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్న సమాచారంతో నిరుద్యోగులు హిమాయత్‌నగర్‌లోని తెలుగు అకాడమీ వద్ద ఇలా బారులు తీరారు. తెలంగాణ చరిత్ర-సంస్కృతి, తెలంగాణ ఉద్యమం-రాష్ట్రావతరణ, భారత ఆర్థిక వ్యవస్థ, జనరల్‌ స్టడీస్‌, భారత రాజ్యాంగంపై అకాడమీ పుస్తకాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు తెలుగు అకాడమీ అధికారులు చెప్పారు.
17/21
వరంగల్‌ నగరం భట్టుపల్లి రోడ్డులో నిర్మించిన రెండో దశ వాంబే ఇళ్లను తక్షణమే కేటాయించి, పట్టాలివ్వాలని పేదలు పెద్దసంఖ్యలో సంబంధిత ఓ అపార్టుమెంటు ఎక్కి నిరసన తెలిపారు. గురువారం సీపీఎం కరీమాబాద్‌ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఈ పోరాటం సాగింది. సీపీఎం జిల్లా కార్యదర్శి రంగయ్య మాట్లాడుతూ 1200 కుటుంబాలకు 22 అపార్టుమెంట్లు నిర్మించి 17 సంవత్సరాలైనా ఇళ్లులేని నిరుపేదలకు కేటాయించలేదన్నారు. వాంబే ఇళ్లను కేటాయించకుంటే పేదలు తమ పార్టీ ఆధ్వర్యంలో వాటిని స్వాధీనం చేసుకొంటారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వరంగల్‌ నగరం భట్టుపల్లి రోడ్డులో నిర్మించిన రెండో దశ వాంబే ఇళ్లను తక్షణమే కేటాయించి, పట్టాలివ్వాలని పేదలు పెద్దసంఖ్యలో సంబంధిత ఓ అపార్టుమెంటు ఎక్కి నిరసన తెలిపారు. గురువారం సీపీఎం కరీమాబాద్‌ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఈ పోరాటం సాగింది. సీపీఎం జిల్లా కార్యదర్శి రంగయ్య మాట్లాడుతూ 1200 కుటుంబాలకు 22 అపార్టుమెంట్లు నిర్మించి 17 సంవత్సరాలైనా ఇళ్లులేని నిరుపేదలకు కేటాయించలేదన్నారు. వాంబే ఇళ్లను కేటాయించకుంటే పేదలు తమ పార్టీ ఆధ్వర్యంలో వాటిని స్వాధీనం చేసుకొంటారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
18/21
కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు పరిధిలోని జన్నారం అటవీ డివిజన్‌లో పలు రకాల వన్యప్రాణులు కెమెరా కంటికి చిక్కాయి. చిరుతలు, అడవి దున్నలు, జింకలు, ఎలుగు బంట్లు ఇందులో ఉన్నాయి. దాదాపు 60 చిత్రాలు ఉండగా, ఇందులో ఎక్కువగా చీకటివేళలో సంచరిస్తున్నవే ఉన్నాయి. ఈ చిత్రాలు అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల వైవిధ్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. వీటిని ముఖ్యమంత్రి కార్యాలయానికి, కేంద్ర పర్యావరణ శాఖకు, ఎన్టీసీఏకు, రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌కి ట్యాగ్‌ చేస్తూ అటవీశాఖ గురువారం ట్వీట్‌ చేసింది. కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు పరిధిలోని జన్నారం అటవీ డివిజన్‌లో పలు రకాల వన్యప్రాణులు కెమెరా కంటికి చిక్కాయి. చిరుతలు, అడవి దున్నలు, జింకలు, ఎలుగు బంట్లు ఇందులో ఉన్నాయి. దాదాపు 60 చిత్రాలు ఉండగా, ఇందులో ఎక్కువగా చీకటివేళలో సంచరిస్తున్నవే ఉన్నాయి. ఈ చిత్రాలు అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల వైవిధ్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. వీటిని ముఖ్యమంత్రి కార్యాలయానికి, కేంద్ర పర్యావరణ శాఖకు, ఎన్టీసీఏకు, రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌కి ట్యాగ్‌ చేస్తూ అటవీశాఖ గురువారం ట్వీట్‌ చేసింది.
19/21
20/21
ఉద్యోగ నోటిఫికేషన్ల నేపథ్యంలో నిరుద్యోగులు గ్రంథాలయాలు, రీడింగ్‌ రూమ్‌లకు పోటెత్తుతున్నారు. కరీంనగర్‌ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో రీడింగ్‌ రూమ్‌లు ఉన్నా ఏమాత్రం సరిపోవడం లేదు. ప్రయివేటు వ్యక్తులు ఉచితంగా ఏర్పాటు చేసిన రీడింగ్‌ రూముల వద్దా అదే పరిస్థితి. గదుల్లో కుర్చీ కోసం ఉదయాన్నే క్యూ కడుతున్నారు. కలెక్టర్‌ ఆఫీసు రోడ్డులోని ఓ రీడింగ్‌ రూమ్‌లో కుర్చీ కోసం కొందరు ఉదయాన్నే వచ్చి తమ పుస్తకాలు, బ్యాగులను వరసలో ఉంచి ఎదురుచూస్తూ ఇలా కనిపించారు. ఉద్యోగ నోటిఫికేషన్ల నేపథ్యంలో నిరుద్యోగులు గ్రంథాలయాలు, రీడింగ్‌ రూమ్‌లకు పోటెత్తుతున్నారు. కరీంనగర్‌ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో రీడింగ్‌ రూమ్‌లు ఉన్నా ఏమాత్రం సరిపోవడం లేదు. ప్రయివేటు వ్యక్తులు ఉచితంగా ఏర్పాటు చేసిన రీడింగ్‌ రూముల వద్దా అదే పరిస్థితి. గదుల్లో కుర్చీ కోసం ఉదయాన్నే క్యూ కడుతున్నారు. కలెక్టర్‌ ఆఫీసు రోడ్డులోని ఓ రీడింగ్‌ రూమ్‌లో కుర్చీ కోసం కొందరు ఉదయాన్నే వచ్చి తమ పుస్తకాలు, బ్యాగులను వరసలో ఉంచి ఎదురుచూస్తూ ఇలా కనిపించారు.
21/21
ఆదిలాబాద్‌ సిమెంట్‌ పరిశ్రమ (సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా- సీసీఐ)లో నిర్మాణాలను తుక్కు కింద వేలంలో విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో.. గతంలో అందులో పనిచేసిన ఉద్యోగులు ఒకింత నిర్వేదానికి గురయ్యారు. 1982 ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పరిశ్రమ 2,500 మందికి ప్రత్యక్షంగా.. మరో 2 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించింది. ఆర్థిక భారంతో 1999లో మూతపడింది. మళ్లీ తెరవకపోతారా? అని చాలా మంది ఉద్యోగులు వేచిచూస్తున్నారు. కొందరు అక్కడే క్వార్టర్స్‌లో ఉంటున్నారు. కేంద్రం తాజా నిర్ణయంతో పునరుద్ధరణ ఆశలు ఆవిరైన ఆయా ఉద్యోగులు తమ పిల్లలతో గురువారం పరిశ్రమ వద్దకు వచ్చి పాత అనుభూతులను గుర్తు చేసుకుని స్వీయ చిత్రాలు తీసుకున్నారు. ఆదిలాబాద్‌ సిమెంట్‌ పరిశ్రమ (సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా- సీసీఐ)లో నిర్మాణాలను తుక్కు కింద వేలంలో విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో.. గతంలో అందులో పనిచేసిన ఉద్యోగులు ఒకింత నిర్వేదానికి గురయ్యారు. 1982 ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పరిశ్రమ 2,500 మందికి ప్రత్యక్షంగా.. మరో 2 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించింది. ఆర్థిక భారంతో 1999లో మూతపడింది. మళ్లీ తెరవకపోతారా? అని చాలా మంది ఉద్యోగులు వేచిచూస్తున్నారు. కొందరు అక్కడే క్వార్టర్స్‌లో ఉంటున్నారు. కేంద్రం తాజా నిర్ణయంతో పునరుద్ధరణ ఆశలు ఆవిరైన ఆయా ఉద్యోగులు తమ పిల్లలతో గురువారం పరిశ్రమ వద్దకు వచ్చి పాత అనుభూతులను గుర్తు చేసుకుని స్వీయ చిత్రాలు తీసుకున్నారు.

మరిన్ని