Bill Gates: అందుకే నా దగ్గర క్రిప్టో కరెన్సీ లేదు..: బిల్‌గేట్స్‌

ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ (Crptocurrency)లకు ఓవైపు ఆదరణ పెరుగుతోంది. మరోవైపు అదే స్థాయిలో దీనిపై విమర్శలూ వస్తున్నాయి. ముఖ్యంగా కుబేరులైన వారు కూడా దీనిపై అనాసక్తత చూపిస్తుండటం

Published : 20 May 2022 18:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ (Crptocurrency)లకు ఓవైపు ఆదరణ పెరుగుతోంది. మరోవైపు అదే స్థాయిలో దీనిపై విమర్శలూ వస్తున్నాయి. ముఖ్యంగా కుబేరులైన వారు కూడా దీనిపై అనాసక్తత చూపిస్తుండటం గమనార్హం. ఆ మధ్య వారెన్‌ బఫెట్‌ క్రిప్టోలపై పెదవి విరిచినట్లు వ్యాఖ్యలు చేయగా.. తాజాగా మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ కూడా వీటిపై అవిశ్వాసం ప్రకటించారు.

రెడిట్‌లో ‘Ask Me Anything' సందర్భంగా ఓ యూజర్‌ బిల్‌ గేట్స్‌ను క్రిప్టో కరెన్సీ గురించి అడిగారు. దీనికి ఆయన స్పందిస్తూ.. తన వద్ద ఎలాంటి క్రిప్టో కరెన్సీ లేదని, వాటిల్లో పెట్టుబడులకు ఎలాంటి విలువ లేదని వ్యాఖ్యానించారు. ‘‘నా దగ్గర ఏ క్రిప్టోలూ లేవు. విలువైన, అర్థవంతమైన ఫలితాల్లో వచ్చే వాటిల్లో పెట్టుబడులు పెట్టేందుకే నేను ఇష్టపడతాను. ఓ కంపెనీ విలువ అనేది వారు ఎలాంటి గొప్ప గొప్ప ఉత్పత్తులు చేస్తున్నారనే దానిపై ఆధారపడాలి. అంతేగానీ, ఇతరులు వారిని ఎలా చూస్తున్నారన్నదానిపై కాదు. క్రిప్టోల విలువ అనేది ఎవరో ఒకరు నిర్ణయిస్తారు. మరొకరు చెల్లిస్తారు. అందువల్ల ఇతర పెట్టుబడుల్లా అది ఉండదు’’ అని గేట్స్‌ చెప్పుకొచ్చారు.

ఆ మధ్య ప్రపంచ ప్రముఖ పెట్టుబడిదారు వారెన్‌ బఫెట్‌ కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రపంచంలో ఉన్న బిట్‌కాయిన్‌లన్నింటినీ తాను కనీసం 25 డాలర్లకు కూడా కొనబోనని స్పష్టం చేశారు. బిట్‌కాయిన్‌ల వల్ల ప్రయోజనమేమీ ఉండదని.. ఒకవేళ కొన్నా తిరిగి వాటిని ఎవరికో ఒకరికి అమ్మాల్సి ఉంటుందన్నారు. అదే అమెరికాలో ఉన్న అన్ని అపార్ట్‌మెంట్లలో కేవలం 1 శాతాన్ని అమ్మినా తాను 25 బిలియన్‌ డాలర్లు పెట్టి కొనడానికి సిద్ధమని బఫెట్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని