Fixed deposit VS Recurring deposit: ఫిక్స్డ్ రికరింగ్ డిపాజిట్ లలో ఏది మంచిది?
ఫిక్స్ డ్ డిపాజిట్లు నిర్ణీత కాల వ్యవధిలో మీ డబ్బుకు మంచి వడ్డీని అందిస్తాయి
ఇంటర్నెట్డెస్క్: నష్టభయం లేకుండా పెట్టుబడి పెట్టాలనుకుంటున్న వారికి ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ), రికరింగ్ డిపాజిట్లు (ఆర్డీ) రెండూ అనువుగా ఉంటాయి. అలాగే ఇవి బ్యాంకు పొదుపు ఖాతాతో పోలిస్తే అధిక వడ్డీ రేట్లను అందిస్తాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు రెండిటిలో పెట్టుబడులు పెట్టడం వలన ఎలాంటి ప్రమాదం ఉండదు. అలాగే రెండూ తప్పకుండా మంచి రాబడులను ఇస్తాయి. అయితే ఈ రెండింటిలో ఏది మంచిదో పెట్టుబడిదారుడు నిర్ణయించుకోవాలి.
ఫిక్స్డ్ డిపాజిట్ల ప్రయోజనాలు: ఫిక్స్డ్ డిపాజిట్లు నిర్ణీత కాల వ్యవధిలో మీ డబ్బుకు మంచి వడ్డీని అందిస్తాయి. ఫిక్స్డ్ డిపాజిట్లలో 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాల వ్యవధి వరకు డబ్బును పెట్టుబడిగా పెట్టవచ్చు. మీకు కొన్నిసార్లు అనుకోని కారణాల వలన అత్యవసరంగా డబ్బు అవసరం అవ్వొచ్చు. అలాంటి పరిస్థితులలో, మీ డిపాజిట్లపై రుణం తీసుకోనే అవకాశం ఉంటుంది. మీ మొత్తం డిపాజిట్లలో 60 శాతం నుంచి 90 శాతం వరకూ మాత్రమే రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్లపై సంపాదించిన వడ్డీపై ఆదాయ పన్ను స్లాబ్ ఆధారంగా పన్ను వర్తిస్తుంది. ఒకవేళ వడ్డీ మొత్తం రూ. 10,000 మించినట్లైతే, సంవత్సరానికి 10 శాతం చొప్పున బ్యాంకు టీడీఏస్ కింద డిడెక్టు చేస్తుంది.
రికరింగ్ డిపాజిట్ల ప్రయోజనాలు: చాలా సందర్భాల్లో, రికరింగ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లకు సమానంగా ఉంటాయి. వేతన జీవులు ప్రతి నెలా కొంత మొత్తాన్ని పొదుపుగా రికరింగ్ డిపాజిట్లలో పెట్టుబడిగా పెట్టడం మంచిది. రికరింగ్ డిపాజిట్ పథకాలు కచ్చితమైన రాబడులను అందిస్తాయి. అలాగే, రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేటు ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటాయి. ఇది వడ్డీరేటు హెచ్చు తగ్గుల నుంచి పెట్టుబడిదారులను కాపాడుతుంది.
ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా రికరింగ్ డిపాజిట్లలో మీరు ఏది ఎంచుకుంటారు?
ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు రెండూ పెట్టుబడి సాధనాలే. ఇవి ఇంచుమించు ఒకేరకమైన ప్రయోజనాలను అందిస్తాయి. అలాగే, ప్రతి నెలా జీతం ద్వారా ఆదాయం పొందే వారు రికరింగ్ డిపాజిట్లలలో పెట్టుబడులు పెట్టవచ్చు. అదే ఒక వ్యక్తి వద్ద పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నట్లైతే, సదరు వ్యక్తి ఆ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడిగా పెట్టవచ్చు. అయితే, ఫిక్స్డ్ డిపాజిట్లపై సంపాదించిన వడ్డీ అనేది రికరింగ్ డిపాజిట్ల కంటే ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు, ఒక వ్యక్తి సంవత్సర కాలానికి గాను రూ.1,20,000 లను ఫిక్స్ డ్ డిపాజిట్లలో పెట్టుబడిగా పెట్టాడు. అలాగే నెలకి రూ .10,000ల చొప్పున సంవత్సర కాలానికి రికరింగ్ డిపాజిట్లలలో పెట్టుబడి పెట్టాడు. అయితే ఫిక్స్ డ్ డిపాజిట్లలో ఒకేసారి పెద్ద మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టడం వలన ఎక్కువ వడ్డీ రేటును పొందుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్