అశోక్‌ లేలాండ్‌ డివిడెండ్‌ 100 శాతం

అశోక్‌ లేలాండ్‌ మార్చి త్రైమాసికానికి రూ.157.85 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఇదే కాల లాభం రూ.377.13 కోట్లతో పోలిస్తే ఇది 58.14 శాతం తక్కువ. ఇదే సమయంలో

Published : 20 May 2022 02:50 IST

దిల్లీ: అశోక్‌ లేలాండ్‌ మార్చి త్రైమాసికానికి రూ.157.85 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఇదే కాల లాభం రూ.377.13 కోట్లతో పోలిస్తే ఇది 58.14 శాతం తక్కువ. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.8,142.11 కోట్ల నుంచి రూ.9,926.97 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ.7,831.21 కోట్ల నుంచి రూ.9,429.55 కోట్లకు చేరాయి. రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.1 (100 శాతం) చొప్పున డివిడెండ్‌ చెల్లించాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు ప్రతిపాదించింది. ‘నాలుగో త్రైమాసికంలో స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగవడంతో వాణిజ్య వాహనాల పరిశ్రమలో కూడా రికవరీ కనిపించింది. మధ్య, భారీ వాణిజ్య వాహనాల విభాగం రికవరీలో ముందు వరుసలో ఉంది. నిర్మాణం, గనుల తవ్వకం, వ్యవసాయం, మౌలిక ప్రాజెక్టులకు గిరాకీ పెరగడం కలిసొచ్చింది. భవిష్యత్‌లో కమొడిటీ ధరలు, సెమీ కండక్టర్ల సరఫరాలు మెరుగవుతాయని ఆశిస్తున్నామ’ని అశోక్‌ లేలాండ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ ధీరజ్‌ హిందుజా వెల్లడించారు.

* 2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఏకీకృత ప్రాతిపదికన రూ.285.45 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. 2020-21లో ప్రకటించిన రూ.69.6 కోట్ల నష్టం కంటే ఇది ఎక్కువ. కార్యకలాపాల ఏకీకృత ఆదాయం రూ.19,454.1 కోట్ల నుంచి రూ.26,237.15 కోట్లకు చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు