Stock Market: లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు గురువారం లాభాల్లో కొనసాగుతున్నాయి. జూన్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగియనున్న నేపథ్యంలో నేటి ట్రేడింగ్‌ను సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభించాయి. అయితే కొన్ని రంగాల షేర్లలో వెల్లువెత్తిన

Published : 30 Jun 2022 09:37 IST

ముంబయి: దేశీయ మార్కెట్లు గురువారం లాభాల్లో కొనసాగుతున్నాయి. జూన్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగియనున్న నేపథ్యంలో నేటి ట్రేడింగ్‌ను సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభించాయి. అయితే కొన్ని రంగాల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు సూచీలకు అండగా నిలిచాయి. దీంతో మార్కెట్లు లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా లాభంతో ఉండగా.. నిఫ్టీ 15,800 మార్క్‌ పైన ట్రేడ్‌ అవుతోంది. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 218.65 పాయింట్ల లాభంతో 53,245 వద్ద, నిఫ్టీ 49 పాయింట్ల లాభంతో 15,848.20 వద్ద కొనసాగుతున్నాయి.

డాలర్‌తో రూపాయి మారకం విలువ 11 పైసలు కోలుకుని 78.92 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు రాణిస్తుండగా.. బజాజ్‌ ఆటో, టాటా కన్స్యూమర్స్‌ ప్రొడక్ట్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని