Crime News: ఆత్మహత్యకు ప్రేరేపించిన ముగ్గురి అరెస్టు

ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎల్‌ఎండీ ఎస్సై ప్రమోద్‌ రెడ్డి బుధవారం తెలిపారు. ఆయన కథనం

Updated : 11 Nov 2021 04:58 IST

తిమ్మాపూర్‌,న్యూస్‌టుడే: ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎల్‌ఎండీ ఎస్సై ప్రమోద్‌ రెడ్డి బుధవారం తెలిపారు. ఆయన కథనం మేరకు...తిమ్మాపూర్‌ మండలంలోని సుభాష్‌నగర్‌కి చెందిన బొంగాని సంజీవ్‌ ఆరు నెలల క్రితం చెట్లుకోసే పని నిమిత్తం కరీంనగర్‌కు చెందిన మహమ్మద్‌ షోహెబ్‌ దగ్గర చేరాడు. షోహెబ్‌ తన స్నేహితులైన నుస్తులాపూర్‌కు చెందిన సంతోష్‌, కరీంనగర్‌కు చెందిన మోసిమ్‌, హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్‌ వాసీమ్‌లతో విందు చేసుకోగా అక్కడ ఉన్న సెల్‌ఫోన్‌ను సంజీవ్‌ దొంగిలించాడని కొట్టి అవమానించి అతని చావుకు కారణమయ్యారన్నారు. సంజీవ్‌ తల్లి ఫిర్యాదు మేరకు ఎల్‌ఎండీ పోలీసులు కేసు నమోదు చేయగా వారు నలుగురు సంజీవ్‌ కుటుంబానికి నష్టపరిహారం ఇచ్చి ఆదుకుంటామని చెప్పి నమ్మించారు. నెలరోజులక్రితం సంజీవ్‌ సోదరుడు లక్ష్మణ్‌ నష్టపరిహారం కోసం వారిచుట్టూ తిరగగా మోసం చేయడంతో లక్ష్మణ్‌ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. లక్ష్మణ్‌ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గత కొన్ని రోజులుగా గాలించారు. పక్కా సమాచారం మేరకు బుధవారం ఇందిరానగర్‌ స్టేజీ వద్ద సంతోష్‌, షోహెబ్‌, మోసిన్‌లను పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. మరొక నిందితుడు వాసిమ్‌ పరారీలో ఉన్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని