Andhra News: అనకాపల్లి జిల్లా.. జీడిమామిడితోటలో పెద్దపులి!

అనకాపల్లి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. కోటవురట్ల మండలం టి.జగ్గంపేట సమీపంలోని జీడిమామిడి తోటల్లో పులి పాదముద్రలు కనిపించాయి.

Updated : 30 Jun 2022 06:48 IST

కోటవురట్లలో పాడి గేదెపై దాడి

కోటవురట్ల, నాతవరం, న్యూస్‌టుడే: అనకాపల్లి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. కోటవురట్ల మండలం టి.జగ్గంపేట సమీపంలోని జీడిమామిడి తోటల్లో పులి పాదముద్రలు కనిపించాయి. కొద్దికాలంగా తూర్పుగోదావరి పరిసరాల్లో సంచరిస్తున్న పులి ఇటు వచ్చి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇక్కడి శ్రీరాంపురం సమీపంలోని జీడితోటలో ఓ గేదెను చంపి తిన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని రైతులు నర్సీపట్నం అటవీ శాఖాధికారులకు చెప్పడంతో డీఎఫ్‌ఓ సూర్యనారాయణ, రేంజర్‌ రాజుబాబు వచ్చి పాదముద్రలను బట్టి అది బెంగాల్‌ టైగర్‌ అని గుర్తించారు. పక్కనే ఉన్న కొండపైకి వెళ్లిపోయిందని, మళ్లీ తిరిగి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. చుట్టుపక్కల కెమెరాలను ఏర్పాటు చేశారు. 30 కిలోమీటర్ల పరిధిలో పులి సంచారం ఉంటుందని, అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు సూచించారు. పులి గురించి తెలియడంతో పరిసర గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని