Crime News: గుంటూరు జిల్లాలో బాలికపై అత్యాచారం

గుంటూరు జిల్లాలో అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా తొమ్మిదో తరగతి విద్యార్థిని

Updated : 19 May 2022 12:48 IST

గుంటూరు: గుంటూరు జిల్లాలో అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా నల్లపాడు పీఎస్‌ పరిధిలో తొమ్మిదో తరగతి విద్యార్థిని అత్యాచారానికి గురైంది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు జనసేన నాయకులు జీజీహెచ్‌కు చేరుకొని ఆందోళన నిర్వహించారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయిందని.. వరుస ఘటనలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని