Kids Health: మీ పిల్లలతో వ్యాయామం చేయించండిలా!

వ్యాయామం చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే ఈ వ్యాయామం పెద్దలకు మాత్రమేనా పిల్లల సంగతేంటి?

Published : 20 May 2022 01:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వ్యాయామం చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే ఈ వ్యాయామం పెద్దలకు మాత్రమేనా పిల్లల సంగతేంటి?
వారి శరీరానికి కూడా వ్యాయామం అవసరం. పిల్లలు ఎక్కువగా తరగతి గదిలో గంటలపాటు కూర్చుని ఉండిపోతారు. ఈ కరోనా దెబ్బకు ఇంటికే పరిమితమయ్యారు. గంటల తరబడి ఫోన్లతోనే గడుపుతున్నారు. వారి శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడే వ్యాయామం సంగతేంటి? ఇలా చేసి చూడండి 
వీటిని కొనివ్వండి
సాధారణంగా పిల్లలకు బొమ్మలను కొనిస్తూనే ఉంటారు. వాటికి బదులుగా వారికి ఉపయోగపడేలా స్కిప్పింగ్‌, బాడ్మింటన్‌ రాకెట్‌ లాంటి ఆట పరికరాలను కొనివ్వండి. ఇలా చేయడం వల్ల వారికి బోర్‌గా అనిపించకుండా వీటితో ఆడుకుంటారు. 

 


విహార యాత్రకు వీటినీ తీసుకెళ్లండి
పిల్లలను తల్లిదండ్రులు బయటకు తీసుకెళ్లాలనుకుంటే సెలవు రోజుల్లో కొంత విభిన్నంగా ప్రణాళికలను రూపొందించండి. స్విమ్మింగ్‌, మౌంటెన్‌ బైకింగ్‌ ఉండే  ప్రాంతాలకు తీసుకెళ్లాలి. దీంతో ప్రకృతితో వారు మమేకం కాగలరు. ఇటువంటివి చేయడం అలవాటుగా చేసుకుంటే ఆనందకర కుటుంబాన్ని పొందగలరు.
ఇంటి పనులు చేసేలా ప్రోత్సహించండి
ఇంటిలో పనులకు పిల్లలను దూరంగా ఉంచుతారు తల్లిదండ్రులు కానీ అలా చేయడం మంచి పద్ధతి కాదు. వారికి చిన్న చిన్న  పనులు చేసేలా ప్రోత్సహించాలి. వారు పనులు నేర్చుకున్నట్లూ ఉంటుంది. పనులు చేస్తుంటే వారి శరీరానికి వ్యాయామం చేసినట్లు కూడా ఉంటుంది. 
టీవీ టైమ్‌ను తగ్గించండి
టీవీ చూస్తే కుటుంబం అంతా కలిసి చూడండి. వారికి రిమోట్‌ ఇచ్చేసి వదిలేయకూడదు. ఇలా చేయడం వల్ల వారు గంటల తరబడి  తెరను చూస్తూనే ఉంటారు. దీంతో కంటి సమస్యలు తలెత్తుతాయి. అలాకాకుండా మీరు పిల్లలతో ఆడుకోండి. వారికి ఏం కావాలో అడిగి తెలుసుకోండి. మీరు వారితో సమయం గడపకుంటే పిల్లలు మానసికంగా కుంగిపోతారు. ఒంటరిగా ఫీల్‌ అవుతారు. 
 ఈ కొద్ది పాటి మార్పులు చేసుకొని పిల్లలను వ్యాయామం చేసేలా ప్రోత్సహించండి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని