Andhra News: విశాఖ టు అనంతపురం.. బస్సు యాత్రకు సిద్ధమవుతున్న ఏపీ మంత్రులు!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రులు రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మంత్రులు బస్సు యాత్ర చేపట్టే యోచనలో ఉన్నారు. విశాఖ నుంచి

Published : 19 May 2022 02:16 IST

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు ఏపీ మంత్రులు సిద్ధమవుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మంత్రులతో బస్సు యాత్ర నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు ఈ యాత్ర కొనసాగనుంది. బస్సు యాత్రలో 17 మంది మంత్రులు పాల్గొననున్నారు. యాత్ర కోసం ప్రత్యేకంగా 2 బస్సులను సిద్ధం చేశారు. విశాఖపట్నం నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్ర అనంతపురంలో ముగియనుంది.

రాష్ట్రంలోని ముఖ్యమైన పట్టణాలు, నియోజకవర్గాలు, మండల కేంద్రాల మీదుగా బస్సు యాత్ర సాగనుంది. ఈ మేరకు రూట్ మ్యాప్ సైతం సిద్ధం చేశారు. శ్రీకాకుళం, రాజమండ్రి, నరసరావుపేట, అనంతపురంలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి మంత్రులు ప్రసంగించనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఈ యాత్ర ద్వారా మంత్రులు ప్రజలకు వివరించనున్నారు. స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవులు, రాజ్యసభ స్థానాల్లో వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం ఇస్తోన్న ప్రాధాన్యతను ప్రజల దృష్టికి తీసుకెళ్లనున్నారు. ప్రస్తుతం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు చేస్తుండగా.. మంత్రులు బస్సు యాత్రలో పాల్గొననున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని