Dental implant: పెట్టుడు పళ్లయినా సహజంగానే ఉంటాయి

వృద్ధాప్యంలో ఆహారం తినడానికి పళ్లు లేకపోయినా..అనుకోని ప్రమాదంలో పళ్లన్నీ రాలిపోయినా కట్టుడు పళ్లు పెట్టడం తెలిసిందే కదా.

Published : 21 May 2022 02:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వృద్ధాప్యంలో ఆహారం తినడానికి పళ్లు లేకపోయినా..అనుకోని ప్రమాదంలో పళ్లన్నీ రాలిపోయినా కట్టుడు పళ్లు పెట్టడం తెలిసిందే కదా...ఉదయం, సాయంత్రం వాటిని శుభ్రం చేసుకోవడం ఓ పని. మాంసాహారం తినాలనుకున్నా సరిగా కుదిరేది కాదు.. తరచూ ఊడిపోయి ఇబ్బందులు పెట్టేవి..ఇపుడు శాశ్వతంగా ఉండే ఇంప్లాంట్స్‌ అందుబాటులోకి వచ్చాయి. అచ్చు సహజంగా ఉండే పళ్లలాగే ఉంటాయి. ఎలాంటి ఆహారం తీసుకున్నా ఇబ్బంది ఉండదు. ఇలాంటి వాటి గురించి దంతవైద్య నిపుణురాలు అన్నే నీలిమాదేవి తెలిపారు.

🦷 ప్రయోజనం: పన్ను లేకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మ్యాన్‌మేడ్‌ ఇంప్లాంటు కృత్రిమంగా తయారు చేసి ఎముకలతో బిగిస్తాం. స్థానికంగానే మత్తు ఇచ్చి ఒక పన్నును అమర్చుతారు. గతంలో ఒక పన్నును పూర్తిస్థాయిలో అమర్చడానికి మూడు దశల్లో ఆరు నెలలు పట్టేది. ఇప్పుడు నేరుగా ఇంప్లాంటును పెట్టేస్తున్నాం. 

🦷 ఎన్ని రకాలు: పన్ను తీయగానే పెట్టేస్తున్నాం. అలా కాకుండా ఆరు నెలలకు కూడా పన్ను పెట్టే అవకాశం ఉంది. రెండు, మూడు పన్నులు లేకపోయినా పక్కవాటి సహకారం తీసుకొని ఇంప్లాంట్లను అమర్చడానికి వీలుంది. కొంతమందికి నాలుగు ఇంప్లాంట్లు పెట్టి మొత్తం పళ్లను అమర్చడానికి సిద్ధమవుతున్నాం. ఏదైనా రోగి ఎముక బలం ఆధారంగా పళ్లను అమర్చడానికి వీలుంటుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని