Health: అధిక రక్తపోటును అదుపులో ఉంచే ఆహారమిదే

అధిక రక్తపోటు మందులు వాడితే తగ్గిపోతుందిలే అనుకునే వారు అధికంగా పెరిగిపోయారు. ఉప్పు తగ్గించినా చాలు అనుకుంటారు. 

Published : 20 May 2022 01:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అధిక రక్తపోటు మందులు వాడితే తగ్గిపోతుందిలే అనుకునే వారు అధికంగా పెరిగిపోయారు. ఉప్పు తగ్గించినా చాలు అనుకుంటారు. సరయిన వ్యాయామం, ఆహార నియమాలు పాటించకపోవడంతో అది తీవ్రరూపం దాల్చుతోంది. కేవలం మందులతోనే కాకుండా చక్కని ఆహారపు అలవాట్లను అలవర్చుకున్నట్లయితే అధిక రక్తపోటు అదుపు పెట్టుకోవచ్చని పోషకాహార నిపుణురాలు అంజలీదేవి సూచిస్తున్నారు.

* ఉప్పును వయసుకు తగినట్టు తినాలి. ఆరోగ్యకరంగా ఉన్నవారు రోజుకు ఐదు గ్రాముల ఉప్పు తీసుకోవచ్చు. మధుమేహం, అధిక రక్తపోటు, వయసు మళ్లిన వారు తక్కువ ఉప్పు వాడాలి. 

* దుంప కూరలు తగ్గించాలి. వీటిలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. ఇవి కొవ్వుగా మారుతుంటాయి. 

* మేక, కోడి కూరల్లో ఉండే కొవ్వు నేరుగా గుండె రక్త కణాల్లో పట్టేస్తుంది. నరాల పరిమాణం తగ్గిస్తుంది. దీంతోనే రక్తపోటు వస్తుంది. కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా తినాలి.

* 20-30 గ్రాముల నూనె, నెయ్యి, వెన్న మాత్రమే రోజుకు వినియోగించాలి. అంతకంటే ఎక్కువగా తింటే శరీరంలో కొవ్వు పేరుకొని పోతుంది.

* గానుగ పట్టిన నూనెలను తెచ్చుకొని వాడాలి. వాటి ధర అధికంగా ఉండటంతో సహజంగానే వాటిని తక్కువగా వినియోగిస్తాం.అప్పుడు కావాల్సినంత శరీరానికి పడుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని