AP News: గ్రంథ పఠనం ప్రజా ఉద్యమ రూపు దాల్చాలి: వెంకయ్య

రామ్మోహన్‌ గ్రంథాలయాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా వెంకయ్యకు కలెక్టర్‌ నివాస్‌, సీపీ శ్రీనివాసులు, మేయర్‌ భాగ్యలక్ష్మి ..

Updated : 31 Oct 2021 13:37 IST

విజయవాడ: నగరంలోని రామ్మోహన్‌ గ్రంథాలయాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా వెంకయ్యకు కలెక్టర్‌ నివాస్‌, సీపీ శ్రీనివాసులు, మేయర్‌ భాగ్యలక్ష్మి స్వాగతం పలికారు. గ్రంథాలయ నిర్వాహకులను ఉప రాష్ట్రపతి ఆత్మీయంగా పలకరించారు. గ్రంథాలయాన్ని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోనే ఈ గ్రంథాలయానికి విశేష చరిత్ర ఉందని తెలిపారు. ‘ఊరికో గ్రంథాలయం.. ఇంటికో స్వచ్ఛాలయం’ నినాదం కావాలన్న వెంకయ్యనాయుడు.. చారిత్రక ప్రదేశాలను యువత సందర్శించాలని సూచించారు. స్వచ్ఛ భారత్ మాదిరిగా గ్రంథ పఠనం ప్రజాఉద్యమ రూపు దాల్చాలని ఆకాంక్షించారు. ఇంటర్నెట్‌, టీవీ సంస్కృతి వల్ల ఎదురయ్యే సమస్యలకు పుస్తక పఠనమే పరిష్కారమని వెంకయ్యనాయుడు అన్నారు. విద్యార్థులకు పుస్తక పఠనం అనేది ఆటపాటల్లా అలవాటు చేయాలని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని