Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 21 May 2022 09:09 IST

1. వైకాపా వ్యతిరేక ఓటు చీలకుండా భాజపాను ఒప్పిస్తా

‘‘ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల్లో వైకాపా వ్యతిరేక ఓటు చీలకుండా భారతీయ జనతా పార్టీని సైతం ఒప్పిస్తా. ఆ పార్టీ హైకమాండ్‌తో ఈ విషయం చర్చిస్తా. రాష్ట్రం బాగుండాలంటే వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా కనీస ఉమ్మడి కార్యక్రమంతో అందరం ముందుకు వెళ్లాలని భావిస్తున్నా. భాజపా అధినాయకత్వానికి ఈ విషయం అర్థమయ్యేలా చెప్పగలనని అనుకుంటున్నా....’’ అని  జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. క్యుములోనింబస్‌తో కుంభవృష్టి

ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక దక్షిణ ప్రాంతం వరకూ ఉపరితల ద్రోణి రూపంలో గాలుల ప్రవాహం ఏర్పడింది. కర్ణాటకపై 3.1 కిలోమీటర్ల ఎత్తులో గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో శనివారం నుంచి 4 రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ పసుపురంగు హెచ్చరిక జారీచేసింది. శుక్రవారం వికారాబాద్‌, రంగారెడ్డి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో కొన్నిచోట్ల భారీవర్షాలు కురిశాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు యాప్‌

3. పట్టాలెక్కనున్న రైల్వేజోన్‌!
దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ఏర్పాటు ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చిందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. శుక్రవారం చెన్నైలోని ఇంటిగ్రేటెడ్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌), ఎంజీఆర్‌ సెంట్రల్‌ రైల్వేస్టేషన్లను సందర్శించిన ఆయన ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు. రైల్వేజోన్‌కు సంబంధించిన డీపీఆర్‌ ఆమోద ప్రక్రియ దాదాపు ఖరారయ్యే స్థితిలో ఉందన్నారు. తమ నిర్ణయంపై తెలుగు రాష్ట్రాల ప్రజలు కచ్చితంగా సంతోషిస్తారని తెలిపారు. ‘మొదట్లో రెండు వందేభారత్‌ రైళ్లను నడిపాం.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
4.  బేగంబజార్‌ పరువుహత్య కేసులో పురోగతి.. కర్ణాటకలో నిందితుల పట్టివేత
నగరంలోని బేగంబజార్‌ మచ్చి మార్కెట్‌ వద్ద పరువు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్యకు పాల్పడిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. హత్య చేసిన తర్వాత నిందితులు కర్ణాటక వైపు వెళ్లినట్లు గుర్తించారు. హైదరాబాద్‌కు 150 కి.మీ.దూరంలో కర్ణాటక గుడిమిత్కల్‌లో నిందితులను పశ్చిమ మండల టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. మరోవైపు హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
5. ధోనీ అభిమానులకు శుభవార్త.. 2023లోనూ ఆడతాడట
ధోని అభిమానులకు శుభవార్త. వచ్చే ఏడాది టీ20 లీగ్‌లోనూ ఈ జార్ఖండ్‌ డైనమైట్‌ ఆటను చూడొచ్చు. అంతకన్నా ముఖ్య విషయమేంటంటే.. అతడు 2023లో కూడా కెప్టెన్‌గా చెన్నైని నడిపించనున్నాడు. ధోని వచ్చే సంవత్సరమూ కొనసాగడానికి ప్రధాన కారణం.. చెన్నై, దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులకు వీడ్కోలు చెప్పాలనుకోవడమే. నిజానికి ఈ సీజన్‌ ఆరంభంలో జడేజాకు కెప్టెన్సీ అప్పగించడంతో మరో టీ20 లీగ్‌లో అతడు ఆడడని, ఇదే అతడి చివరి సీజన్‌ అని అంతా అనుకున్నారు. అయితే జడేజా టోర్నీ సగంలోనే సారథ్య బాధ్యతలను వదిలేయడంతో ధోని తిరిగి చెన్నై పగ్గాలు అందుకున్న సంగతి తెలిసిందే.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
6. Andhra News: అమ్మఒడిలో మరో రూ.వెయ్యి కోత
 ‘అమ్మఒడి’ పథకం కింద ఇస్తున్న రూ.15వేలల్లో ప్రభుత్వం మరో రూ.వెయ్యి కోత వేయనుంది. మొత్తంగా రూ.2వేలకు కోతపడనుంది. ఇప్పటికే మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో రూ.వెయ్యి తగ్గించగా.. ఇప్పుడు పాఠశాల మౌలిక సదుపాయాల నిర్వహణకు మరో రూ.వెయ్యి మినహాయించేందుకు సిద్ధమైంది. ఈ పథకం కింద జూన్‌లో రూ.13వేలు మాత్రమే విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. లబ్ధిదారుల నుంచి మినహాయించిన మొత్తాన్ని పాఠశాల విద్యాశాఖ ద్వారా బడుల నిర్వహణకు కేటాయిస్తారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పదవి లేకున్నా నేనే సీనియర్‌ను.. ఆ మంత్రుల వద్దకు వెళ్లకండి: ముత్తంశెట్టి

7. ఇక ఫోన్‌ చేసిన వారెవరో తెలిసిపోతుంది..
ఎవరైనా ఫోన్‌ చేసినప్పుడు మొబైల్‌ తెర మీద వారి పేరు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు మన మొబైల్‌లో పేరు-నెంబరు నిల్వ చేసుకుంటేనే, సదరు వ్యక్తులు ఫోన్‌ చేసినప్పుడు వారి పేరు మొబైల్‌ తెరపై కనపడుతుంది. ట్రాయ్‌ ప్రతిపాదన ప్రకారం, మనకు పరిచయం లేని వారు ఫోన్‌ చేసినా కూడా, వారి పేరు మనకు కనపడుతుంది. దీనికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు టెలికాం విభాగం (డాట్‌)తో ట్రాయ్‌ సమాలోచనలు నిర్వహించనుంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
8. 1,01,400 మంది చిన్నారులను పొట్టనపెట్టుకున్న ‘కోల్డ్‌ వైరస్‌’!
సాధారణ జలుబు వంటి లక్షణాలకు కారణమయ్యే ‘కోల్డ్‌ వైరస్‌’... 2019లో ప్రపంచ వ్యాప్తంగా 1,01,400 మంది ఐదేళ్లలోపు చిన్నారులను పొట్టనపెట్టుకున్నట్టు బ్రిటన్‌ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. ‘యూనివర్సిటీ ఆఫ్‌ ఈడెన్‌బరో’ ఆధ్వర్యాన చేపట్టిన ఈ పరిశోధన వివరాలను ద లాన్సెట్‌ పత్రిక అందించింది. కోల్డ్‌ వైరస్‌గా పిలిచే రెస్పిరేటరీ సిన్సిటియల్‌ వైరస్‌ (ఆర్‌ఎస్‌వీ)... చిన్నారుల్లో శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతుంది. పురిటి బిడ్డలు మొదలు ఆరు నెలల పసికందులే ఎక్కువగా దీనికి చిక్కుతుంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
9. పోచారం పోదాం పద
తూర్పు హైదరాబాద్‌లో గృహ నివాసాలకు అనుకూలమైన ప్రాంతాల్లో పోచారం ఒకటి. ఇన్ఫోసిస్‌ వంటి ఐటీ కార్యాలయాల అతిపెద్ద క్యాంపస్‌.. సింగ్‌పూర్‌ టౌన్‌షిప్‌తో కొన్నేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ ప్రాంతంలో ప్రస్తుతం పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు జరుగుతున్నాయి.  బహుళ అంతస్తుల భవనాలు, విల్లాలు వస్తున్నాయి. వ్యక్తిగత గృహాలు నిర్మించుకుంటున్నారు. సొంతింటి కల నెరవేర్చుకోవాలని అనుకునే వారికి అవుటర్‌ లోపల అనువైన ప్రాంతాల్లో ఒకటిగా ఉంది. మున్సిపాలిటీగా మారడం, ఎక్స్‌ప్రెస్‌ వే వస్తుండటం..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
10. ఉషా దూరమైన నేను..

యోగా చేద్దామని ఉదయాన్నే టెర్రస్‌పైకి వెళ్లా. ఎదురు బిల్డింగ్‌పై పొడవాటి కురుల్ని ఆరబెట్టుకుంటూ నన్నాకర్షించిందో అమ్మాయి. చారడేసి కళ్లు.. తీర్చిదిద్దిన కాటుకతో అందమంతా ఆ కళ్లలోనే ఉందనిపించింది. కొన్ని క్షణాలు కన్నార్పకుండా చూశాక సడెన్‌గా గుర్తొచ్చింది.. తను మా ఆఫీసులో కొత్తగా చేరిన ఉషేనని. ఉష అందరితో కలిసిపోయే రకం. కట్టిపడేసే కళ్లకితోడు తీయని గొంతు. అబ్బాయిలంతా చుట్టూ మూగేవాళ్లు. నేనూ మాట కలిపా. తన అందం, కలుపుగోలుతనం వర్ణిస్తుంటే.. ‘అంతటితో ఆగిపో.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మెడ చుట్టూ మఫ్లర్‌.. శిరసుపై పడగ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని