Air India: గాల్లో ఉండగా ఇంజిన్‌ ఆఫ్‌.. ఎయిరిండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం

ఎయిరిండియా విమానం పెను ప్రమాదం నుంచి బయటపడింది. బయల్దేరిన కాసేపటికే సాంకేతిక సమస్య తలెత్తడంతో మళ్లీ అదే విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది......

Published : 20 May 2022 17:50 IST

ముంబయి: ఎయిరిండియా విమానం పెను ప్రమాదం నుంచి బయటపడింది. బయల్దేరిన కాసేపటికే సాంకేతిక సమస్య తలెత్తడంతో మళ్లీ అదే విమానాశ్రయంలో ల్యాండ్‌ అయ్యింది. ముంబయి​ నుంచి బెంగళూరు పయనమైన ఎయిరిండియా A320NEO విమానం.. గాల్లో ఉండగానే ఓ ఇంజిన్ పనిచేయడం ఆగిపోవడంతో అత్యవసరంగా మళ్లీ ముంబయి ఎయిర్‌పోర్టులో దిగింది. టేకాఫ్​ అయిన 27 నిమిషాలకే విమాన ఇంజిన్‌ ఆగిపోయింది. కాగా ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని, ల్యాండ్‌ అయిన తర్వాత మరో విమానంలో వారిని తరలించినట్లు సంస్థ ప్రతినిధి వెల్లడించారు.

ఎయిరిండియాకు చెందిన A320NEO విమానాలు సీఎఫ్​ఎమ్​ లీప్ ఇంజిన్లు కలిగి ఉంటాయి. ఆ పీల్‌ ఇంజిన్లలో తలెత్తిన సాంకేతిక సమస్య వల్లే ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. కాగా ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణ జరుపుతోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని