బెంగళూరులో వర్ష బీభత్సం

భారీ వర్షానికి కర్ణాటక రాజధాని బెంగళూరు చిగురుటాకులా వణికిపోయింది. మంగళవారం సాయంత్రం 6.30 నుంచి రాత్రి 10 గంటల వరకు 114.6 మి.మీ. నమోదైంది.

Published : 19 May 2022 05:27 IST

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: భారీ వర్షానికి కర్ణాటక రాజధాని బెంగళూరు చిగురుటాకులా వణికిపోయింది. మంగళవారం సాయంత్రం 6.30 నుంచి రాత్రి 10 గంటల వరకు 114.6 మి.మీ. నమోదైంది. రాత్రి 8.30 నుంచి 10 గంటల మధ్యలోనే 100 మి.మీ. వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. ‘నగరంలో గరిష్ఠంగా 90 మి.మీ. వర్షపాతం నమోదైతే నీరు నిలవకుండా కాలువల ద్వారా వెళుతుంది. అంతకు మించి వర్షం కురిస్తే లోతట్టు ప్రాంతాలు, రహదారులపై నీరు నిలిచిపోతుంది’ అని బెంగళూరు పాలికె ప్రధాన కమిషనరు తుషార్‌ గిరినాథ్‌ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి కురిసిన వర్షంతో వాహన సంచారం అస్తవ్యస్తంగా మారిపోయింది. చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో 4అడుగుల మేర నీరు నిలిచి.. వాహన సంచారానికి ఆటంకం కలిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని