దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ రాజీనామా

దేశ రాజధాని కేంద్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు

Published : 19 May 2022 05:27 IST

దిల్లీ: దేశ రాజధాని కేంద్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు రాజీనామా లేఖ పంపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వ్యక్తిగత కారణాల వల్లే బైజల్‌ పదవి నుంచి వైదొలగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  1969 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన బైజల్‌ 2016 డిసెంబరులో దిల్లీ ఎల్‌జీగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు అయిదేళ్ల తన పదవీకాలంలో పరిపాలనపరమైన అధికార పరిధి, ప్రభుత్వ వ్యవహారాల్లో తరచూ ఆప్‌ సర్కారుతో విభేదాలు ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారం 2018లో ఎల్జీ కార్యాలయం ఎదుట ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, మంత్రులు ధర్నా చేసేదాకా వెళ్లింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని