ఆ చేపలు మావి.. తొలగించం

జ్ఞానవాపి మసీదులోని మానవ నిర్మిత కొలనులో చేపలను తొలగించడంపై గురువారం వారణాసి కోర్టులో ఆసక్తికర వాదనలు జరిగాయి. కొలను నుంచి చేపలను తీసేయాలని ప్రభుత్వం తరఫున

Published : 20 May 2022 05:57 IST

కోర్టులో ఆసక్తికర వాదనలు

వారణాసి: జ్ఞానవాపి మసీదులోని మానవ నిర్మిత కొలనులో చేపలను తొలగించడంపై గురువారం వారణాసి కోర్టులో ఆసక్తికర వాదనలు జరిగాయి. కొలను నుంచి చేపలను తీసేయాలని ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదించారు. ముస్లింల తరఫున న్యాయవాది అభయ్‌ యాదవ్‌ దీనికి అంగీకరించలేదు. ‘ఆ చేపలు మావి’ అని పేర్కొన్నారు. ప్రభుత్వ పిటిషన్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మసీదులోని కొన్ని గోడలు కూల్చాలన్న పిటిషన్‌పై కూడా తమ వ్యతిరేకతను న్యాయస్థానం ముందు వ్యక్తం చేశామని యాదవ్‌ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని