‘ఎస్‌ఆర్‌ఎంఐఎస్టీ’ విద్యార్థికి రూ.కోటి వేతనం

చెన్నైలోని కాట్టాన్‌కులత్తూరులో ఉన్న ‘ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ’ (ఎస్‌ఆర్‌ఎంఐఎస్టీ) ప్రాంగణ నియామకాల్లో రికార్డు సృష్టించిందని సంబంధిత వర్గాలు

Published : 20 May 2022 05:57 IST

 

వడపళని (చెన్నై), న్యూస్‌టుడే: చెన్నైలోని కాట్టాన్‌కులత్తూరులో ఉన్న ‘ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ’ (ఎస్‌ఆర్‌ఎంఐఎస్టీ) ప్రాంగణ నియామకాల్లో రికార్డు సృష్టించిందని సంబంధిత వర్గాలు గురువారం ఒక ప్రకటనలో తెలిపాయి. 10వేల మందికిపైగా విద్యార్థులు పలు సంస్థల్లో ఉద్యోగావకాశాలు పొందారని పేర్కొన్నాయి. పురంజయ్‌ మోహన్‌కు అమెజాన్‌ జర్మనీ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ రోల్‌లో ఏడాదికి రూ.కోటి వేతనంతో అవకాశం వచ్చిందని ఎస్‌ఆర్‌ఎంఐఎస్టీ ఫౌండర్‌ ఛాన్సలర్‌ టీఆర్‌ పారివేందర్‌ తెలిపారు. కార్యక్రమంలో ప్రొ ఛాన్సలర్‌ (అకడమిక్స్‌) పి.సత్యనారాయణన్, ఉపకులపతి సి.ముత్తమిళ్‌సెల్వన్, రిజిస్ట్రార్‌ ఎస్‌.పొన్నుస్వామి, డైరెక్టర్‌ (కెరీర్‌ సెంటర్‌) వెంకశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని