రష్యా-ఉక్రెయిన్‌ మధ్య చర్చలు జరగాలి

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఆ రెండు దేశాల మధ్య చర్చలు జరగాల్సి ఉందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ అభిప్రాయపడ్డాయి.

Published : 20 May 2022 05:57 IST

విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ 

దిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఆ రెండు దేశాల మధ్య చర్చలు జరగాల్సి ఉందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ అభిప్రాయపడ్డాయి. గురువారం వర్చువల్‌గా జరిగిన బ్రిక్స్‌ దేశాల సమావేశంలో చైనా, రష్యా ప్రతినిధుల సమక్షంలో ఆయన మాట్లాడారు. ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాలను, అంతర్జాతీయ న్యాయాన్ని అందరూ గౌరవించాలని బ్రిక్స్‌ పలుమార్లు ఉద్ఘాటించిందని చెప్పారు. దానికి తగ్గట్టుగా కూటమి దేశాలు వ్యవహరించాలన్నారు. యుద్ధం అనంతరం ఆహారం, ఇంధన రంగాల్లో నెలకొన్న పరిస్థితిని ఈ సమావేశంలో చర్చించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని