Drugs: లక్షద్వీప్‌ తీరంలో రూ.1,526 కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టివేత

డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ), భారత తీర రక్షక దళం (ఐసీజీ) అధికారులు భారీ స్థాయిలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.......

Published : 21 May 2022 02:11 IST

దిల్లీ: డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ), భారత తీర రక్షక దళం (ఐసీజీ) అధికారులు భారీ స్థాయిలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. లక్షద్వీప్‌ తీరంలో పడవల్లో తరలిస్తున్న 218 కిలోల హెరాయిన్‌ను పట్టుకున్నారు. ‘ఆపరేషన్‌ ఖొజ్బీన్‌’ పేరుతో అగట్టి తీరంలో డీఆర్‌ఐ, ఐసీజీ అధికారులు సంయుక్తంగా ఈ దాడులు చేశారు. కిలో ప్యాకెట్ల చొప్పున రెండు బోట్లలో రవాణా చేస్తున్న 218 పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్‌ విలువ మార్కెట్‌లో సుమారు రూ.1,526 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. పలువురిని అరెస్టు చేసి, పడవలను కొచ్చికి తరలించారు.

గత రెండు నెలల వ్యవధిలో దేశంలో భారీ స్థాయిలో మాదకద్రవ్యాలు పట్టుబడటం ఇది నాలుగోసారి. ఏప్రిల్‌ నుంచి 3800 కిలోలకు పైగా హెరాయిన్‌ను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో వీటి విలువ మొత్తంగా దాదాపు రూ.26,000 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని