క్షమాభిక్షలు ముగిశాయి..ఇక అవార్డుల పర్వం!

ఎన్నికల ఓటమి తర్వాత దోషులకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ వచ్చిన ట్రంప్‌ తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన మద్దతుదారుడైన అమెరికా ఇంటలిజెన్స్​కమిటీ మాజీ అధ్యక్షుడు డెవిన్​న్యూన్స్‌ని ‘ప్రెసిడెన్షియల్​ మెడల్‌ ఆఫ్​ ఫ్రీడమ్’​ అవార్డుతో సత్కరించారు........

Updated : 27 Feb 2024 16:49 IST

తన మద్దతుదారులకు పురస్కారాలు ప్రకటిస్తున్న ట్రంప్‌

వాషింగ్టన్‌: ఎన్నికల ఓటమి తర్వాత దోషులకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ వచ్చిన ట్రంప్‌ తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన మద్దతుదారుడైన అమెరికా ఇంటలిజెన్స్​ కమిటీ మాజీ అధ్యక్షుడు డెవిన్​ న్యూన్స్‌ని ‘ప్రెసిడెన్షియల్​ మెడల్‌ ఆఫ్​ ఫ్రీడమ్’​ అవార్డుతో సత్కరించారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవడానికి రష్యా సహకరించిందని ఆరోపణలు వచ్చినప్పుడు న్యూన్స్‌ ఆయనకు మద్దతుగా నిలిచారు. అంతేకాకుండా 2019లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టినప్పుడూ ట్రంప్​వైపే నిలబడ్డారు. ట్రంప్‌ మరో రెండు వారాల్లో అధ్యక్ష పదవి నుంచి దిగిపోనున్నారు. ఈలోపు మరికొంత మంది మద్దతుదారులకూ ట్రంప్‌ పురస్కారాలు అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ట్రంప్ ​సహచరులు, మద్దతుదారుల్లో చాలా మంది, అధ్యక్ష ఎన్నికల్లో విదేశీ శక్తుల ప్రమేయం విషమయై దోషులుగా తేలారు. అందులో జాతీయ భద్రతా మాజీ సలహాదారు మైకేల్​ ఫ్లిన్​ఉన్నారు. ఎఫ్‌బీఐ దర్యాప్తులో వారంతా అబద్ధం చెప్పారనే కారణంతో దోషులుగా తేలారు. అయితే ఫ్లిన్‌కు గత నెలలో ట్రంప్‌ క్షమాభిక్ష ప్రసాదించారు. ఇదే కోవలో మరికొంతమంది మద్దతుదారులను కూడా శిక్షల నుంచి తప్పించారు.

ఇవీ చదవండి..

అమెరికా స్పీకర్‌గా మళ్లీ పెలోసీ

అసాంజే అప్పగింతకు బ్రిటన్‌ కోర్టు తిరస్కరణ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని