Cannes 2022: కేన్స్‌... క్వీన్స్‌

కేన్స్‌ చిత్రోత్సవానికి తారలు మెరుపులు అద్దారు. తమ వస్త్రాలు, వన్నెలతో కళ తెచ్చారు. మాజీ విశ్వ సుందరి ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌ రెడ్‌ కార్పెట్‌పై హొయలొలికించింది. క్లాసీ సూట్‌లో చిరునవ్వులు చిందిస్తూ వచ్చిన హాలీవుడ్‌ కథానాయకుడు టామ్‌ క్రూజ్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు.

Updated : 05 Jan 2024 14:58 IST

కేన్స్‌ చిత్రోత్సవానికి తారలు మెరుపులు అద్దారు. తమ వస్త్రాలు, వన్నెలతో కళ తెచ్చారు. మాజీ విశ్వ సుందరి ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌ రెడ్‌ కార్పెట్‌పై హొయలొలికించింది. క్లాసీ సూట్‌లో చిరునవ్వులు చిందిస్తూ వచ్చిన హాలీవుడ్‌ కథానాయకుడు టామ్‌ క్రూజ్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. తన సినిమాలో మాదిరిగానే హెలీకాప్టర్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ హాలీవుడ్‌ హీరో రెడ్‌ కార్పెట్‌పై నడుస్తూ తనదైన చిరునవ్వుతో ఆకట్టుకున్నాడు. పూజా హెగ్డే, హీనాఖాన్‌, తమన్నా భాటియా, నవాజుద్దీన్‌ సిద్దిఖీ,   మాధవన్‌ తదితరులు సందడి చేశారు.

* టామ్‌క్రూజ్‌ నటించిన ‘టాప్‌ గన్‌ మావెరిక్‌’ ప్రీమియర్‌ను కేన్స్‌లో ప్రదర్శించారు. దానికి హాజరైన టామ్‌కు వీక్షకుల నుంచి 5 నిమిషాల స్టాండింగ్‌ ఒవేషన్‌ లభించింది. అనంతరం కేన్స్‌ ప్రతినిధులు టామ్‌ క్రూజ్‌కు గోల్డెన్‌ పామ్‌ (హానరరీ)ను అందించారు. సినిమా రంగానికి విశేష సేవలందించినందుకు ఈ అవార్డు లభించింది.

* రానున్న వారం రోజుల్లో పలు భారతీయ చిత్రాలు కేన్స్‌లో ప్రదర్శితం కానున్నాయి. ‘రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్‌’, ‘గోదావరి’, ‘ఆల్ఫా బీటా గామా’, ‘బూంబా రైడ్‌’, ‘ధుయిన్‌’, ‘ట్రీ ఫుల్‌ ఆఫ్‌ ప్యారెట్స్‌’ చిత్రాలను భారతీయ సినిమా ఔన్నత్యాన్ని చాటిచెప్పడానికి భారత సమాచార, ప్రసార శాఖ ఎంపిక చేసింది. వీటితో పాటు ‘మానిక్‌బాబర్‌ మేఘ్‌’ ‘లే మస్క్‌’, ‘గోల్డ్‌ ఫిష్‌’, ‘ఇరావిన్‌ నిజల్‌’ ప్రీమియర్లను కేన్స్‌లో ప్రదర్శించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని