Pokiri: పండుగాడికి పదహారేళ్లు.. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
మహేష్‌బాబు, పూరి జగన్నాథ్‌ల కాంబినేషన్‌కు సినీ ప్రియుల్లో మంచి క్రేజ్ ఉంది. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘పోకిరి’, ‘బిజినెస్మెన్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి.
మహేష్‌బాబు, పూరి జగన్నాథ్‌ల కాంబినేషన్‌కు సినీ ప్రియుల్లో మంచి క్రేజ్ ఉంది. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘పోకిరి’, ‘బిజినెస్మెన్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ముఖ్యంగా ‘పోకిరి’ చిత్రం అప్పట్లో వసూళ్ల పరంగా తెలుగు చిత్రసీమలో సరికొత్త రికార్డులు సృష్టించింది. రూ.10కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం.. రూ.70కోట్ల గ్రాస్‌తో రూ.40కోట్ల షేర్ సాధించి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. మహేష్, పూరిల సినీ కెరీర్‌కు ఇంతటి అపురూప విజయాన్ని అందించిన ఈ చిత్రం విడుదలై నేటికి(ఏప్రిల్ 28) 16 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఈ సినిమా వెనుక కొన్ని ఆసక్తికర విషయాలున్నాయి.
ఆ హీరో కోసం కథ రాసుకున్న పూరి
దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని మహేష్‌బాబుతో కలిసి 2006లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆయన ఈ కథను రాసుకుంది మాత్రం అంతకు ఆరేళ్ల ముందుగానే. పూరి తన తొలి చిత్రం ‘బద్రి’ కన్నా ముందే ఈ చిత్ర స్క్రిప్ట్‌ను రాసుకున్నారట. తొలుత ఈ కథకు హీరోగా అనుకున్నది మహేష్‌ను కాదు.. రవితేజని. ఈ చిత్రాన్ని ఆయనతోనే ‘ఉత్తమ్ సింగ్.. సన్నాఫ్ సూర్య నారాయణ’ అనే టైటిల్‌తో తెరపైకి తీసుకొద్దామని అనుకున్నారు. అనుకోని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. తర్వాత కొన్నాళ్లకు ఈ కథ మహేష్ దగ్గరకు చేరింది. ఆయన ఈ స్క్రిప్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చాక.. పూరి కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి దాన్ని ‘పోకిరి’గా మార్చారు.
కథానాయికగా ఎంపికైన కంగన
మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో కథానాయిక పాత్రకి తొలుత అనుకున్నది అయేషా టకియాని. కొన్ని కారణాల వల్ల ఆమె ఈ పాత్రను వదులుకుంది. తర్వాత ఆ అవకాశాన్ని కంగనా రనౌత్ దక్కించుకుంది. ఈ చిత్ర ఆడిషన్స్ ముంబయిలో జరుగుతున్న సమయంలో.. అక్కడే బాలీవుడ్ చిత్రం ‘గ్యాంగ్‌స్టర్’కూ ఆడిషన్స్ జరిగాయట. దీంట్లో పాల్గొనడానికి వచ్చిన కంగన.. పనిలో పనిగా ‘పోకిరి’ చిత్రానికీ ఆడిషన్స్ ఇచ్చింది. అదృష్టమో, దురదృష్టమో తెలియదు కానీ, కంగనాకు ఈ రెండు చిత్రాల్లోనూ అవకాశం దక్కింది. అయితే వీటిలో ఏదో ఒక దాన్నే చేయాల్సి రావడంతో ఆమె ‘పోకిరి’ని వదులుకుంది. దీంతో ఆ అవకాశం కాస్తా ఇలియానాకు దక్కింది.
అలా కనిపించడం అదే తొలిసారి..
‘పోకిరి’ ముందు వరకు మహేష్‌బాబు చేసిన అన్ని సినిమాల్లోనూ ఆయన లుక్ దాదాపు ఒకేలా ఉండేది. లైట్ హెయిర్, క్లీన్ షేవ్‌తో బాలీవుడ్ హీరోలా క్లాస్‌గా దర్శనమిచ్చేవారు. ‘పోకిరి’ చిత్రంతో మహేష్‌ను తొలిసారి ఊర మాస్ యాంగిల్లో చూపించారు పూరి. ఆయన మహేష్‌కు కథ చెబుతున్నప్పుడే జుత్తు బాగా పెంచాలి.. లైట్‌గా మీసం, గెడ్డంతో ఉండాలని చెప్పేశారట. దీనికి తగ్గట్లుగానే మహేష్ ‘అతడు’ చిత్రం తర్వాత వచ్చిన నాలుగు నెలల విరామాన్ని దీనికోసం వినియోగించుకున్నారట. జుత్తు కత్తిరించుకోకుండా సరికొత్త లుక్‌లోకి మారారు ఆయన. ఈ చిత్రంలో ఆయన డ్రెస్సింగ్ స్టైల్ అప్పట్లో కొత్త ట్రెండ్ అయింది. ఇక పూరి రాసిన సంభాషణలు మహేశ్ చెబుతుంటే చిన్నా పెద్దా తేడాలేకుండా అందరికీ నరనరాల్లోకి ఎక్కేశాయి. దానితోడు మణిశర్మ పాటలు ఓ ఊపు ఊపేశాయి. అప్పటికీ, ఇప్పటికీ ఎప్పటికీ టీవీ వచ్చిన ప్రతిసారి ‘పోకిరి’ ప్రసారమవుతుంటే ఛానల్ మార్చకుండా చూసేవాళ్లు కచ్చితంగా ఉన్నారు.. ఉంటారు..! దటీజ్ ‘పండుగాడు’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Venky: 20 ఏళ్ల ‘వెంకీ’.. ఈ హిట్ మూవీ మిస్సైన హీరోయిన్ ఎవరంటే?
రవితేజ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘వెంకీ’ చిత్రం 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Brindha Sivakumar: మణిరత్నం ‘హీరోయిన్ ఛాన్స్’ వదులుకున్న బృందా.. సూర్య సోదరి గురించి మీకు తెలుసా?
ప్రముఖ హీరోలు సూర్య, కార్తి సోదరి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
gautham Menon:ఆ కీలక పాత్రలకు వారిని అనుకున్నా: గౌతమ్‌మేనన్
సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
Prithviraj Sukumaran: రెండు ఆఫర్లు ఇచ్చిన చిరంజీవి.. తిరస్కరించిన పృథ్వీరాజ్ సుకుమారన్.. కారణమదే
చిరంజీవి ఇచ్చిన రెండు ఆఫర్లను ఓ సినిమా కారణంగా తిరస్కరించాల్సి వచ్చిందని మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. -
RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ప్రీక్లైమాక్స్‌లో చేసిన మార్పు ఇదే.. జెన్నీ పాత్ర చనిపోతుందట!
ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు నటించిన ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. -
Mohan Babu: మోహన్‌బాబు అలా ‘అల్లుడుగారు’ అయ్యారు.. అదరగొట్టారు
నేడు మోహన్‌బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘అల్లుడుగారు’ సినిమా సంగతులు చూద్దాం.. -
Deepika Padukone: అలా మిస్సై.. ‘కల్కి 2898ఏడీ’తో సిద్ధమై: దీపికా టాలీవుడ్ ఎంట్రీ సంగతులివీ..
ప్రముఖ నటి దీపికా పదుకొణె టాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
Daddy Movie: చిరంజీవి ‘డాడీ’ మూవీ వెంకటేశ్ చేస్తే సూపర్ హిట్ అయ్యేదట!
Daddy movie: ‘డాడీ’ మూవీ యావరేజ్‌గా ఆడటంపై చిరంజీవి ఓ సందర్భంలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. -
Prema: షూటింగ్లో నిజంగానే పాము కాటేసింది.. ఆ హిట్ సినిమాకు 25 ఏళ్లు..
నటి ప్రేమ (Prema) ప్రధానపాత్రలో నటించిన ‘దేవి’ (Devi) చిత్రం విడుదలై నేటికి 25ఏళ్లు పూర్తయింది. -
Sekhar Kammula: ఆ ఫీల్‌గుడ్ స్టోరీ.. పవన్‌ను దృష్టిలో పెట్టుకుని రాసిందే కానీ..!
ఓ హిట్ సినిమా స్టోరీని ప్రముఖ హీరో పవన్ కల్యాణ్‌ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నారు ఆ దర్శకుడు. ఆ ఆసక్తికర సంగతులివీ.. -
చిరు-నాగ్-వెంకటేశ్‌లతో మల్టీస్టారర్ తీయాలనుకున్నారు
ఒక టికెట్టుపై డబుల్ ధమాకా వినోదాల్ని పంచిచ్చేవి మల్టీస్టారర్ చిత్రాలు. అందుకే ఏ చిత్రసీమలోనైనా ఓ మల్టీస్టారర్ చిత్రం మొదలవుతుందంటే.. ప్రేక్షకుల చూపంతా అటువైపే మళ్లుతుంటుంది. -
Sharwanand: అందుకే శర్వానంద్ ఆ హిట్ మూవీకి ‘నో’ చెప్పారు.. సెకండ్ ఛాన్స్‌లోనూ!
హీరో శర్వానంద్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి ఆసక్తికర విషయం మీకోసం.. -
Mahesh Babu: మహేశ్ బాబును అనుకున్నారు.. తరుణ్‌తో తెరకెక్కించారు!
తరుణ్ నటించిన ఓ హిట్ చిత్రంలో.. ముందుగా మహేశ్ బాబును హీరోగా అనుకున్నారు నిర్మాత. కానీ, డైరెక్టర్ వద్దనుకున్నారు. అదే సినిమా అంటే? -
Soggadu Movie: రవిబాబు మూవీకి నో చెప్పిన ఉదయ్‌కిరణ్.. కోపంతో నిర్ణయం తీసుకోవడం వల్లే..!
Soggadu Movie: ‘సోగ్గాడు’కి క్యాస్ట్ ఫెయిల్యూర్ కారణంగా మూవీపై ఎలాంటి ప్రభావం పడిందో రవిబాబు ఓ సందర్భంలో చెప్పారు. -
ఈ హీరోలు ఇలా చెబితే డేట్స్ ఇస్తారట!
అసలు ఎవరికి ఏం చెబితే కాల్షీట్స్ ఇస్తారో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ సందర్భంలో ఇలా చెప్పారు. -
Samantha: రామలక్ష్మిపై అందరూ అనుమానం వ్యక్తంచేశారు!
Samantha: కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన సమంత 14 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆమె ‘ఏమాయ చేసావె’తో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. -
baahubali: ‘బాహుబలి’లో ఆ పాత్రను ఆయన ఎందుకు చేయలేదంటే?
‘బాహుబలి’ సినిమాలోని కట్టప్ప పాత్ర సంజయ్‌దత్‌ను ఊహించి రాసిందని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. -
Mahesh babu: ‘మురారి’ శాపం వెనుక స్టోరీ ఇది.. క్లైమాక్స్‌లో ఆ పాట వద్దన్న కృష్ణ..!
మహేశ్‌బాబు కథానాయకుడిగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘మురారి’. సోనాలి బింద్రే కథానాయిక. 2001 ఫిబ్రవరి 17న విడుదలైన ఈ సినిమా 23 ఏళ్లు పూర్తి చేసుకుంది. -
Jayamalini: జయమాలిని కోసం కత్తితో బెదిరింపు!
సినీ తారలను చూసేందుకు జనం విరగబడి రావడం, వారితో సెల్ఫీల కోసం పోటీ పడటం మనం చూస్తుంటాం. సరిగ్గా ఇలాంటి పరిస్థితే అలనాటి నృత్యతార జయమాలినికి (Jayamalini) ఎదురైందట. -
Temper: ఆర్. నారాయణమూర్తి ‘టెంపర్’లో నటించకపోవడానికి కారణమిదే
ఎన్టీఆర్ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘టెంపర్’ తొమ్మిదేళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి ఆసక్తికర అంశం మీకోసం.. -
Oy: ‘ఓయ్’ టైటిల్ అర్థమిదే.. మీరు గమనించారా?
సిద్ధార్థ్, షామిలీ జంటగా నటించిన చిత్రం ‘ఓయ్!’. ఈ సినిమాకి ఆ పేరెందుకు పెట్టారో మీకు తెలుసా?
తాజా వార్తలు (Latest News)
-
ఒక్క ఓటరు కోసం.. 39 కి.మీ. ట్రెక్కింగ్‌కు పోలింగ్ సిబ్బంది రెడీ!
-
సరిగ్గా ఇదే రోజు.. మన ‘క్రికెట్ దేవుడు’ అవతరించాడు!
-
జనసేన పెండింగ్ స్థానాలపై పవన్ కల్యాణ్ కసరత్తు
-
మయన్మార్ సరిహద్దుల్లో కంచె.. రూ.30,000 కోట్ల ఖర్చు..!
-
భారత్ - పాక్ ద్వైపాక్షిక సిరీస్‌ల నిర్వహణకు ఆసీస్ ఆసక్తి!
-
‘సునీత.. రబ్రీ దేవిలా మారనున్నారా?’.. వీడియో సందేశంపై భాజపా విమర్శలు!