Ram: ఇంట్లో వాళ్లని నమ్మించాల్సి వస్తోంది.. రూమర్స్‌పై రామ్‌ ట్వీట్‌

సోషల్‌మీడియాలో తన పెళ్లిపై వస్తోన్న రూమర్స్‌పై నటుడు రామ్‌ పోతినేని (Ram Pothineni) స్పందించారు. వాటి వల్ల తాను ఎంతగానో విసిగిపోయానని, అసత్య ప్రచారాల వల్ల అయిన వాళ్లకే సమాధానం

Updated : 30 Jun 2022 10:14 IST

హైదరాబాద్‌: సోషల్‌మీడియాలో తన పెళ్లిపై వస్తోన్న రూమర్స్‌పై నటుడు రామ్‌ పోతినేని (Ram Pothineni) స్పందించారు. వాటి వల్ల తాను ఎంతగానో విసిగిపోయానని, అసత్య ప్రచారాల వల్ల అయిన వాళ్లకే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్‌ పెట్టారు. ‘‘ఓరి దేవుడా..!! ఇకనైనా ఆపండి.. పరిస్థితి ఎంతలా దిగజారిందంటే చివరికి హైస్కూల్‌ స్వీట్‌హార్ట్‌ అంటూ నాకు ఎవరూ లేరని, నేను ఎవర్నీ పెళ్లి చేసుకోవడం లేదని ఇంట్లోవాళ్లు, ప్రాణమిత్రులను సైతం నమ్మించాల్సి వస్తోంది. మరో విషయం ఏమిటంటే.. ఆ రోజుల్లో నేనస్సలు స్కూల్‌కే సరిగ్గా వెళ్లలేదు’’ అని రామ్‌ రాసుకొచ్చారు.

రామ్‌ త్వరలో పెళ్లి చేసుకోనున్నారని ఇటీవల నెట్టింట జోరుగా ప్రచారం సాగింది. తన హైస్కూల్‌ ఫ్రెండ్‌తో ఎంతోకాలంగా సీక్రెట్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, ఎట్టకేలకు ఈ ఏడాది ఏడడుగులు వేయాలనుకుంటున్నారని పలు వెబ్‌సైట్లలో కథనాలు వచ్చాయి. దీంతో ఆ వార్తలపై రామ్‌ తాజాగా ట్విటర్‌లో స్పందించడంతో ఆయన పెళ్లి వార్తలకు చెక్‌ పడినట్లు అయ్యింది.

సినిమాల విషయానికొస్తే.. రామ్‌ ప్రస్తుతం ‘ది వారియర్‌’ (The Warriorr) పోస్ట్‌ ప్రొడెక్షన్‌ పనులతో బిజీగా ఉన్నారు. లింగుస్వామి (Lingusamy) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయన సత్య అనే పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నారు. కృతిశెట్టి కథానాయిక. మరోవైపు, రామ్‌ ఇటీవల యాక్షన్‌, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీనుతో (Boyapati Srinu) కొత్త ప్రాజెక్ట్‌ ఓకే చేసిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని