Andhra News: నా వయసు 72.. నా స్ఫూర్తి మాత్రం 27..: చంద్రబాబు

వైకాపా ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసిందని.. ఇక ఎవరూ ఆపలేరని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా కడపలో పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. బాదుడే బాదుడుతో వైకాపా...

Published : 19 May 2022 02:19 IST

కడప: వైకాపా ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసిందని.. ఇక ఎవరూ ఆపలేరని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా కడపలో పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. బాదుడే బాదుడుతో వైకాపా ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై మోయలేని భారాన్ని మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడుకు ఒంగోలులోని స్టేడియం ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

‘‘కడపలో అభివృద్ధికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా? అధిక అప్పులతో జగన్‌ రాష్ట్ర పరువును తీశారు. సీఎం జగన్‌ చెప్పిన రాయలసీమ ఎత్తిపోతల ఏమైంది? గుంటూరు మహిళ వెంకాయమ్మ ఉన్నదే చెప్పింది. నిజాలు చెబితే వెంకాయమ్మ ఇంటిపై దాడి చేశారు. సీబీఐ కేసుల్లో వాదించిన వారికి, తనతో కేసుల్లో ఉన్నవారికి జగన్‌ రాజ్యసభ అభ్యర్థిత్వం ఇచ్చారు. ఏపీలో రాజ్యసభ సీట్లు ఇచ్చేందుకు ఆయనకు సమర్థులు కనిపించలేదా? పులివెందులలో బస్టాండ్‌ కట్టలేని వారు 3 రాజధానులు కడతారా? పులివెందులలో రైతులకు ఎందుకు బీమా రావడం లేదో సీఎం చెప్పాలి. బైకుపై మృతదేహాన్ని తరలిస్తే సీఎం కనీసం స్పందించకపోవడం బాధాకరం. అత్యాచార బాధితులను పరామర్శించలేదు. సమస్యలు చెప్పే వారిపై కేసులు పెడుతున్నారు. వైకాపా పాలనలో పేదల జీవితాలు చితికిపోయాయి. జగన్‌ చేసేది ఉత్తుత్తి బటన్‌ నొక్కుళ్లే. రాజ్యసభ సీట్లను జగన్‌ గంపగుత్తగా అమ్ముకున్నారు. జగన్‌ పరిపాలన వల్ల రాష్ట్రం సర్వనాశనం అయింది. ఒక్కరికీ ఉద్యోగం రాలేదు.. జాబ్‌ క్యాలెండర్‌ ఏమైంది? ఈ ప్రభుత్వం కడప జిల్లాకు ఒక్క పరిశ్రమ తెచ్చిందా? రికార్డులు మార్చేసి బద్వేల్‌ ఎమ్మెల్సీ 800 ఎకరాలు కొట్టేశారు. ఈ పోరాటం నా కోసం కాదు.. బలహీన వర్గాల బాగు కోసం. నా వయసు 72.. నా స్ఫూర్తి మాత్రం 27.. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలో యువతకు ప్రాధాన్యం ఇస్తాం. కడప నుంచే తెదేపా జైత్రయాత్ర మొదలవుతుంది’’ అని చంద్రబాబు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని