Nara Lokesh: ఏపీ రోడ్లపై చినజీయర్‌స్వామి ఆవేదనతో స్పందించారు: లోకేశ్‌

రాజ‌కీయాల‌కు దూరంగా, ఆధ్మాత్మిక ప్రపంచానికి ద‌గ్గర‌గా.. హిందూ ధ‌ర్మ ప్రచార‌మే జీవిత‌ల‌క్ష్యంగా సాగుతోన్న చిన‌ జీయ‌ర్ స్వామి ఏపీలో

Updated : 19 May 2022 12:08 IST

అమరావతి: రాజ‌కీయాల‌కు దూరంగా, ఆధ్మాత్మిక ప్రపంచానికి ద‌గ్గర‌గా.. హిందూ ధ‌ర్మ ప్రచార‌మే జీవిత‌ల‌క్ష్యంగా సాగుతోన్న చిన‌ జీయ‌ర్ స్వామి ఏపీలో ర‌హ‌దారుల దుస్థితిపై ఆవేద‌న‌తో స్పందించారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. గోతులు, ఒడుదొడుకుల గురించి జీయర్ స్వామి ప్రస్తావించిన ఓ వీడియోను లోకేశ్‌ విడుదల చేశారు. జంగారెడ్డి గూడెం నుంచి రాజ‌మ‌హేంద్రవరం వ‌ర‌కూ రోడ్డు ప్రయాణం ఒక జ్ఞాప‌కంగా మిగులుతుందంటూ రోడ్ల దుస్థితిని భ‌క్తుల‌కు చెప్పారని గుర్తుచేశారు.

ప్రవ‌చ‌నంలో భాగంగానే జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలతో.. జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లో ర‌హ‌దారులు ఎంత దారుణంగా ఉన్నాయో స్పష్టం అవుతోందని లోకేశ్‌ విమర్శించారు. రాష్ట్రంలో రోడ్లు న‌డిచేందుకు కూడా వీలుగా లేవ‌ని జ‌నం గ‌గ్గోలు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. అధ్వాన పాల‌న‌కి ఉదాహ‌ర‌ణ‌గా ప‌క్కరాష్ట్ర పాల‌కులు మ‌న ఏపీని చూపిస్తున్నా ప్రభుత్వ స్పంద‌న శూన్యమని లోకేశ్‌ ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని