AP News: రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్‌ బంకుల వద్ద తెదేపా నిరసనలు

ఏపీలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించనందుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా తెదేపా శ్రేణులు పెట్రోల్‌ బంకుల వద్ద ఆందోళన చేపట్టాయి.

Updated : 09 Nov 2021 12:48 IST

అమరావతి: ఏపీలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించనందుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా తెదేపా శ్రేణులు పెట్రోల్‌ బంకుల వద్ద ఆందోళన చేపట్టాయి. ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు పెట్రోల్‌ బంక్‌ల వద్ద కూర్చొని చమురు ధరలు తగ్గించాలని తెదేపా నేతలు, నాయకులు డిమాండ్‌ చేశారు. విజయవాడలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, బొండా ఉమ, పంచుమర్తి అనురాధ, గద్దె అనురాధ పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో గోరంట్ల, తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మల నేతృత్వంలో ఆందోళనలు చేశారు. కడప జిల్లా పులివెందులలో ఆందోళన చేస్తున్న బీటెక్‌ రవిని అరెస్టు చేసిన పోలీసులు సింహాద్రిపురం పీఎస్‌కు తరలించారు. గుంటూరులో చేపట్టిన నిరసన కార్యక్రమలో మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పాల్గొని పెట్రో ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రధాన కూడళ్ల నుంచి ర్యాలీగా పెట్రోల్‌ బంకుల వద్దకు వెళ్లిన తెదేపా శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో ఇంధన ధరలు ఉన్నాయని నాయకులు మండిపడ్డారు. వెంటనే వ్యాట్‌ తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఈ మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిరసనలు కొనసాగనున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని