Virat Kohli : నా ముందున్న లక్ష్యం అదే.. దానికోసం ఏమి చేయడానికైనా సిద్ధమే: విరాట్

టీమ్‌ఇండియాకు ఆసియా కప్‌, టీ20 ప్రపంచకప్‌ను అందించడమే తన ముందున్న లక్ష్యమని భారత స్టార్‌ బ్యాటర్...

Published : 21 May 2022 02:02 IST

(ఫొటో సోర్స్‌: విరాట్ ట్విటర్)

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియాకు ఆసియా కప్‌, టీ20 ప్రపంచకప్‌ను అందించడమే తన ముందున్న లక్ష్యమని భారత స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ చెప్పాడు. దీని కోసం తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నాడు. గత టీ20 ప్రపంచకప్‌ తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న విరాట్ కోహ్లీని తర్వాత వన్డే సారథ్యం నుంచి బీసీసీఐ తొలగించింది. అయితే కెప్టెన్‌గా ఒక్క ఐసీసీ టైటిల్‌ను సాధించకపోవడం మినహా విరాట్ నాయకత్వంలో భారత్‌ అద్భుత విజయాలను నమోదు చేసింది. 

‘‘భారత్‌ వచ్చే ఆసియా కప్, టీ20 లీగ్‌ టైటిల్‌ను సాధించాలి. ప్రస్తుతానికి నాకు ప్రేరణ ఇచ్చే అంశం. నేను సమతూకంగా ముందుకు సాగాలి. అందుకోసం కాస్త విరామం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి నేను కుదురుకున్నానని సెట్‌ అయితే మాత్రం వెనక్కి తిరిగి చూసుకోను. కప్‌లను సాధించేందుకు ఏం చేయడానికైనా సిద్ధమే’’ అని కోహ్లీ వివరించాడు. అంతర్జాతీయంగా 70 సెంచరీలను సాధించిన విరాట్ కోహ్లీ గత రెండేళ్లుగా సరైన ఫామ్‌లో లేక తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ప్రస్తుత టీ20 లీగ్‌లోనూ ఒకటీ ఆరా మ్యాచ్‌ల్లో తప్ప పెద్దగా రాణించలేదు. అయితే కీలకమైన మ్యాచ్‌లో గుజరాత్‌పై 73 పరుగులు చేసి బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని