Gayle-ABD : బెంగళూరు ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో గేల్‌, ఏబీడీ

యూనివర్సల్ బాస్ క్రిస్‌ గేల్, మిస్టర్ 360 బ్యాటర్‌ ఏబీ డివిలియర్స్‌కు భారత్‌లో భారీ సంఖ్యలోనే ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. వీరిద్దరూ టీ20 లీగ్‌లో ఆడి ప్రేక్షకులను...

Published : 18 May 2022 01:46 IST

ఇంటర్నెట్ డెస్క్: యూనివర్సల్ బాస్ క్రిస్‌ గేల్, మిస్టర్ 360 బ్యాటర్‌ ఏబీ డివిలియర్స్‌కు భారత్‌లో భారీ సంఖ్యలోనే ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. వీరిద్దరూ టీ20 లీగ్‌లో ఆడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బెంగళూరు తరఫున టీ20 లీగ్‌లో 14వ సీజన్‌ వరకు ఆడిన డివిలియర్స్‌ ఆటకు వీడ్కోలు పలికాడు. గతంలో బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన క్రిస్‌ గేల్‌ను ఈసారి ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. అయితే బెంగళూరు జట్టు మాత్రం వారిని తమ ‘హాల్‌ ఆఫ్ ఫేమ్‌’ జాబితాలో చేర్చి గౌరవించింది. ఈ మేరకు బెంగళూరు యాజమాన్యం ట్విటర్‌లో వీడియోను షేర్‌ చేసింది. 

గేల్‌, డివిలియర్స్‌ను ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’తో గౌరవించిన సందర్భంగా బెంగళూరు మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, డైరెక్టర్‌ ఆఫ్ క్రికెట్ మైక్‌ హెస్సన్‌ మాట్లాడారు. ‘‘ఏబీ తన ఆటతీరుతో గేమ్‌ను ఎంతో మార్చాడు. గేల్‌, డివిలియర్స్‌కు ఈ గౌరవం దక్కడం సంతోషంగా ఉంది. ఇద్దరు ఆటగాళ్లు టీ20 లీగ్‌లో భారీగా ప్రభావం చూపారు’’ అని కోహ్లీ పేర్కొన్నాడు. ఆన్‌లైన్‌లో పాల్గొన్న ఏబీడీ మాట్లాడుతూ.. ‘‘అద్భుతమైన గౌరవం ఇది. నిజం చెప్పాలంటే భావోద్వేగం ఆపుకోలేకపోతున్నా. విరాట్‌కు ధన్యవాదాలు. మైక్‌, నిఖిల్‌, ఇతర సిబ్బంది ఎంతో మద్దతుగా నిలిచారు. నేను, గేల్‌ ప్రస్తుతం లేకపోయినా.. ఎప్పటికీ మనమంతా కుటుంబమే’’ అని తెలిపాడు. ఏబీడీ బెంగళూరు జట్టుతో 2011 నుంచి 2021 వరకు ప్రయాణించాడు. అలానే క్రిస్‌ గేల్‌ కూడా ఆరేళ్లపాటు బెంగళూరుకు ఆడాడు. మరి ఆ వీడియోను మీరూ చూసేయండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని