Rishabh Pant : రిషభ్‌ పంత్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ మారితే ఇంకా సక్సెస్‌ అవుతాడు: సెహ్వాగ్‌

అటు బ్యాటింగ్‌లో ఇటు కీపింగ్‌లో ఎంఎస్ ధోనీ లేని లోటును తీరుస్తాడని భావించిన రిషభ్ పంత్‌ కొంతమేర మాత్రమే రాణిస్తున్నాడు. అయితే మిడిల్, లోయర్‌ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు..

Published : 21 May 2022 01:48 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అటు బ్యాటింగ్‌ ఇటు కీపింగ్‌లో ఎంఎస్ ధోనీ లేని లోటును తీరుస్తాడని భావించిన రిషభ్ పంత్‌ కొంతమేర మాత్రమే రాణిస్తున్నాడు. అయితే మిడిల్‌, లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు రావడం వల్లే విపరీతమైన ఒత్తిడితో కొన్నిసార్లు ఆడలేక పోతున్నాడనేది క్రికెట్ విశ్లేషకుల అంచనా. అన్ని ఫార్మాట్లలో టీమ్‌ఇండియాలో స్థానం దక్కించుకుంటున్న పంత్‌ ధాటిగా ఆడటానికి ఏమాత్రం సంకోచించడు. ఈ క్రమంలో పంత్‌ ఓపెనింగ్‌కు వస్తే బాగుంటుందని భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. టీమ్‌ఇండియాకు రిషభ్‌ పంత్‌ విలువైన ఆస్తి అని పేర్కొన్నాడు. 

‘‘మేం పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడేది 50 లేదా 100 కొట్టడానికి కాదు. ప్రత్యర్థి, కఠిన పరిస్థితులతో సంబంధం లేకుండా వేగంగా పరుగులు చేసేందేకు ప్రయత్నిస్తాం. అలానే రిషభ్ పంత్‌ కూడా ధాటిగా ఆడతాడు. నాలుగు కానీ ఐదు స్థానంలోగానీ బ్యాటింగ్‌ చేసేటప్పుడు ఎంతో బాధ్యతాయుతంగా ఆడాల్సి ఉంటుంది. అదే ఓపెనింగ్‌కు వస్తే ఫీల్డింగ్‌ నిబంధనలు ఉంటాయి కాబట్టి పంత్ విజయవంతం అవుతాడనే నా నమ్మకం’’ అని సెహ్వాగ్‌ వివరించాడు. సెహ్వాగ్‌ కూడా కెరీర్‌ ప్రారంభంలో మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చేవాడు. ఆ తర్వాత ఓపెనింగ్‌ చేసి రికార్డులు సృష్టించాడు. దిగ్గజ బ్యాటర్ సచిన్‌ తెందూల్కర్‌ కూడా మిడిలార్డర్‌ నుంచి ఓపెనర్‌గా ప్రమోషన్‌ అందుకున్న ఆటగాడే కావడం విశేషం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని