Virat Kohli: విరాట్‌ కోహ్లీ @ బెంగళూరు @ 7000

భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో ఇన్ని రోజులూ ఫామ్‌లో లేక తీవ్ర ఇబ్బందులు పడిన బెంగళూరు మాజీ సారథి విరాట్‌ కోహ్లీ ఎట్టకేలకు బ్యాట్‌ ఝుళిపించాడు...

Updated : 20 May 2022 16:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో ఇన్ని రోజులూ ఫామ్‌లో లేక తీవ్ర ఇబ్బందులు పడిన బెంగళూరు మాజీ సారథి విరాట్‌ కోహ్లీ ఎట్టకేలకు బ్యాట్‌ ఝుళిపించాడు. గతరాత్రి గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విరాట్‌ (73; 54 బంతుల్లో 8x4, 2x6) విజృంభించాడు. కవర్‌ డ్రైవ్‌లు, ఫ్లిక్‌ షాట్లలాంటి చూడచక్కని బ్యాటింగ్‌తో మళ్లీ తనలోని మునుపటి ఆటగాడిని గుర్తుచేశాడు. దీంతో బెంగళూరు జట్టే కాకుండా అతడి అభిమానులు కూడా మురిసిపోయారు. ఈ మ్యాచ్‌తో విరాట్‌ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. బెంగళూరు ఫ్రాంఛైజీ తరఫున 7000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. కాగా, విరాట్‌ ఇప్పటివరకు ఈ లీగ్‌లో మొత్తం 221 మ్యాచ్‌ల్లో 6,592 పరుగులు చేయగా.. మిగతావి ఛాంపియన్స్‌ లీగ్‌ (ఇప్పుడు లేదు)లో సాధించాడు. దీంతో ఫ్రాంఛైజీ లీగ్‌ క్రికెట్‌లో ఒకే జట్టు తరఫున ఇన్ని పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగానూ చరిత్ర సృష్టించాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని