Viral Video: ఔట్‌ కావొద్దని ప్రయత్నించి.. చివరికి విఫలమై..!

క్రికెట్‌లో అప్పుడప్పుడూ సరదా సన్నివేశాలు, చిత్ర విచిత్ర సంఘటనలు చోటు చేసుకోవడం మామూలే. తాజాగా ఇంగ్లాండ్‌లోని కౌంటీ క్రికెట్‌ ఛాంపియన్‌షిప్‌లో అలాంటి...

Published : 22 May 2022 01:47 IST

(Photo: County Championship Twitter Video Screenshot)

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌లో అప్పుడప్పుడూ సరదా సన్నివేశాలు, చిత్ర విచిత్ర సంఘటనలు చోటు చేసుకోవడం మామూలే. తాజాగా ఇంగ్లాండ్‌లోని కౌంటీ క్రికెట్‌ ఛాంపియన్‌షిప్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. హాంప్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో సోమర్‌సెట్‌ కెప్టెన్‌ టామ్‌ అబెల్‌  ఊహించని రీతిలో ఔటయ్యాడు. మహ్మద్‌ అబ్బాస్‌ వేసిన బంతిని డిఫెండ్‌ చేయగా.. మొదట అది ఎక్కడికి వెళ్లిందో బ్యాట్స్‌మన్‌కు కనపడలేదు. తర్వాత వికెట్లకు తాకేలా కనిపించడంతో దాన్ని కాళ్లతో ఆపే ప్రయత్నం చేశాడు. కానీ, చివరికి అది వికెట్లకు తాకి బెయిల్స్‌ కిందపడ్డాయి. ఇలా ఊహించని రీతిలో ఔటైన టామ్‌ అబెల్‌ అసహనంతో వెనుదిరిగాడు. ఈ వీడియోను కౌంటీ ఛాంపియన్‌షిప్‌ నిర్వాహకులు ట్విటర్‌లో పంచుకోవడంతో అది వైరల్‌గా మారింది. అతడెలా ఔటయ్యాడో మీరూ ఓ లుక్కేయండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని