WhatsApp: వాట్సాప్‌లో ఈ పది ట్రిక్స్ గురించి మీకు తెలుసా?
వాట్సాప్‌లో తెలియని కొన్ని ఫీచర్లు కూడా దాగి ఉన్నాయి. వీటి గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. మరి ఆ హిడెన్ ఫీచర్ల ఏంటి? వాటిని ఎలా వాడాలి?
ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరికీ వాట్సాప్ సుపరిచితమే. చాటింగ్ నుంచి ఆడియో, వీడియో కాల్స్ వరకూ అన్ని సదుపాయాలు ఇందులో ఉన్నాయి. ఇంతేనా.. కాదండీ బాబు ఇంకా ఉన్నాయి. వాట్సాప్‌లో తెలియని కొన్ని ఫీచర్లు కూడా దాగి ఉన్నాయి. వీటి గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. మరి దాగి ఉన్న ఆ ఫీచర్ల ఏంటి? వాటిని ఎలా వాడాలనే ట్రిక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మనకు నచ్చిన ఫార్మాట్లో..
వాట్సాప్‌లో మనం ఒకే విధమైన టెక్ట్స్ ఫార్మాట్ ఉందనుకుంటాం. ఆ భ్రమలోనే ఉండిపోకండి. మైక్రోసాఫ్ట్ వర్డ్ తరహాలోనే టెక్ట్స్‌ను బోల్డ్ (Bold), ఇటాలిక్ (italic) ఫార్మాట్లో మార్చుకోవచ్చు. టెక్ట్స్ ముందు, వెనుక (*) పెడితే బోల్డ్లోకి, (_) పెడితే ఇటాలిక్ ఫార్మాట్లోకి మారుతుంది. అంతేకాదు టెక్ట్స్‌ను మధ్యలోకి స్ట్రైక్ చేయాలంటే (~) అనే సింబల్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.
సేవ్ చేసి తర్వాత ఉపయోగించుకునేలా..
మనకు నచ్చిన మెసేజ్, ఇమేజ్ను సేవ్ చేసి వీలైనపుడు సులభంగా ఓపెన్ చేయడానికి ‘స్టార్ టెక్ట్స్’ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. దీనికోసం మెసేజ్, ఇమేజ్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే పైన స్టార్ సింబల్ కనిపిస్తోంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం దేనైతే సెలెక్ట్ చేశామో ఆ మెసేజ్, ఇమేజ్ పక్కన స్టార్ సింబల్ గుర్తు ప్రత్యక్షం అవుతుంది.
ఎవరితో ఎక్కువగా చాట్ చేశారు?
వాట్సాప్‌లో మనం ఎవరితో ఎక్కువగా చాట్ చేశాం, ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకున్నామనే దాన్ని కూడా తెలుసుకోవచ్చు. దీనికోసం సెట్టింగ్స్‌లోకెళ్లి స్టోరేజీ అండ్ డేటాపై క్లిక్ చేయాలి. అందులో డేటా మేనేజ్మెంట్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనం ఎంత మందితో ఎక్కువగా ఇంటారాక్ట్ అయ్యామనే విషయాన్ని తెలుపుతూ ఒక లిస్ట్ ఓపెన్ అవుతుంది. కాంటాక్ట్ పక్కన స్టోరేజీ సైజు కూడా కనిపిస్తుంది. ఒక్కో కాంటాక్ట్‌పై క్లిక్ చేసి ఏ ఫైల్స్ షేర్ చేశాం. ఎప్పటివరకు చేశామనే ఇతరత్రా వివరాలు కూడా తెలుసుకోవచ్చు.
ఎప్పటికప్పుడు డిలీట్ అయ్యేలా..
వాట్సాప్‌లో మనకు వచ్చిన, మనం పంపిన మెసేజ్‌లను ఎప్పటికప్పుడు డిలీట్ చెయ్యాలంటే చాలా కష్టంగా ఉంటుంది. దీన్నే సులభతరం చేయడానికి డిస్ప్పియరింగ్ చాట్ ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొచ్చింది. దీంతో మెసేజ్‌లు మనం ఎంచుకున్న విధంగా నిర్దిష్ట సమయం తర్వాత వాటంతటవే డిలీట్ అయిపోతాయి. దీనికోసం కాంటాక్ట్ నేమ్‌పై క్లిక్ చేస్తే ‘డిస్ అపియరింగ్ మెసేజెస్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని టర్న్ ఆన్ చేసుకోవాలి.
ఒక్కో నెంబర్‌కు ఒక్కో ట్యూన్..
మన కాంటాక్ట్‌లో ఉన్న ముఖ్యమైన వారు మెసేజ్ చేస్తే సులువుగా గుర్తించేలా నోటిఫికేషన్‌ను మార్చుకోవచ్చు. కాంటాక్ట్‌పై క్లిక్ చేసి కస్టమ్ నోటిఫికేషన్లో టోన్ మార్చుకుంటే ఎవరు మెసేజ్ చేశారో సులువుగా కనిపెట్టవచ్చు.
పదేపదే వస్తే.. మ్యూట్ పెట్టొచ్చు..
వాట్సాప్‌లో పదేపదే మెసేజ్‌లు వచ్చే గ్రూప్/మెంబర్లతో విసుగెత్తిపోతే వాటిని మ్యూట్ చేసుకోవచ్చు. దీనికోసం కాంటాక్ట్పైనా లాంగ్ ప్రెస్ చేసి మ్యూట్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
దాచేయండి..
వాట్సాప్‌లో ఏదైనా చాట్‌ను దాచేయాలనుకుంటే హైడ్ ఆప్షన్ ఉంటుంది. కాంటాక్ట్పైన లాంగ్ ప్రెస్ చేస్తే పైన మ్యూట్ బటన్ పక్కన ఉన్న ఆర్కైవ్ బటన్‌ను సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.
ఆటో సేవ్ను ఆపేసేలా..
వాట్సాప్‌లో వచ్చిన ఇమేజెస్, వీడియోలు ఫోన్ గ్యాలరీలో ఆటో సేవ్కాకుండా ఉండటానికి ‘మీడియా విజిబిలిటీ’ అనే ఫీచర్ అందుబాటులో ఉంది. దీన్ని టర్న్ ఆఫ్ చేసుకుంటే మీడియా ఫైల్స్ గ్యాలరీలో సేవ్ అవ్వవు. ఐఫోన్ యూజర్లయితే ‘సేవ్ టూ కెమెరా రోల్’ను డిసేబుల్ చేసుకోవాలి.
‘బ్లూ టిక్’ వద్దా..
మనకు ఇతరులు చేసిన మెసేజ్‌ను చదివి రెస్పాండ్ అయ్యే తీరిక లేకపోతే ‘బ్లూ టిక్’ ఆప్షన్‌ను తీసేయవచ్చు. దీనికోసం సెట్టింగ్స్>అకౌంట్స్>ప్రైవసీ>రీడ్ రిసీప్ట్స్‌ను టర్న్ ఆఫ్ చేసుకుంటే మెసేజ్ ఓపెన్ చేసినట్లు ఇతరులకు కనిపించదు.
బ్లాక్ చేశారా లేదా?
ఇతరులు మనల్ని బ్లాక్ చేస్తే వారి ప్రొఫైల్ ఫొటో, స్టేటస్, లాస్ట్ సీన్ ఇవేవి కనిపించవు. కానీ, తమ ప్రొఫైల్ ఫొటో తీసేసి రీడ్ రిసీప్ట్స్‌ను టర్న్ ఆఫ్ చేసుకుంటే వారి స్టేటస్‌ను మనం చూసినా గుర్తించలేం. అసలు మనల్ని బ్లాక్ చేశారా లేదా అని కచ్చితంగా తెలుసుకోవాలంటే ఆ కాంటాక్ట్‌కు ఓ మెసేజ్ చేస్తే సరిపోతుంది. మీరు పంపిన ఆ మెసేజ్‌కు ఎప్పటికీ డబుల్ టిక్స్ రాకపోతే మిమ్మల్ని బ్లాక్ చేసినట్లే లెక్క.
డెస్క్‌టాప్‌లో వాట్సాప్..
కంప్యూటర్/ల్యాప్‌టాప్‌తో ఏదైనా పనిలో పడి ఫోన్లో వాట్సాప్ చూసుకునే వీలులేకపోతే వాట్సాప్ వెబ్ ఆన్ చేసి ఎంచక్కా వాడుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైన్ఇన్ లేకుండానే ఛాట్‌జీపీటీ
ఛాట్‌జీపీటీని వాడుకోవాలంటే ముందు సైన్ఇన్ కావాల్సి ఉంటుంది. పాస్‌వర్డ్‌ను మరచిపోవటం వంటి సందర్భాల్లో ఇది కష్టంగా అనిపిస్తుంటుంది. -
ఎక్స్‌లో కమ్యూనిటీ నోట్స్
ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న తరుణంలో ఎక్స్ (ట్విటర్) మనదేశంలో కమ్యూనిటీ నోట్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌కు కంట్రిబ్యూట్ చేయటానికి కొత్తవారికీ ఆహ్వానం పలికింది -
వైఫై పాస్వర్డ్ మరిచారా?
ఇంటికి వచ్చిన అతిథులో, పరిచయం ఉన్నవారో వైఫై పాస్వర్డ్ అడుగుతుంటారు. చాలాసార్లు అదేంటో గుర్తుకురాదు. మరెలా? చేతిలో ఫోన్ ఉంటే ఇట్టే తెలుసుకోవచ్చు. ఐఫోన్ వాడేవారైతే- సెటింగ్స్ ద్వారా వైఫై విభాగంలోకి వెళ్లాలి. -
సైబర్ నేరాలకు చక్షు కళ్లెం
మోసపూరిత కాల్స్, మెసేజ్‌ల వంటి సైబర్ నేరాలను అరికట్టటానికి టెలికం విభాగం కొత్త పోర్టల్‌ను పరిచయం చేసింది. సంచార్ సాథీ కార్యక్రమంలో భాగంగా తీసుకొచ్చిన దీని పేరు చక్షు. -
యాపిల్ పాడ్‌కాస్ట్‌లు అక్షరాల్లో..
పాడ్‌కాస్ట్‌లు ఎంత పాపులర్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకునే యాపిల్ సంస్థ పాడ్‌కాస్ట్‌లను మరింత విస్తృతంగా అందుబాటులోకి తేవటానికి, వాటిల్లోని అంశాలను, విషయాలను తేలికగా కనుక్కోవటానికి ఓ వినూత్న ఫీచర్‌ను ప్రవేశపెట్టింది -
ఫొటోతోనే వీడియో..
షేక్స్పియర్ స్వగతాన్ని మోనాలిసా పాట రూపంలో పాడితే? అదెలా సాధ్యమని ఆశ్చర్యపోకండి. కృత్రిమ మేధ(ఏఐ)తో ఇలాంటి అద్భుతాలు ఎన్నయినా చేయొచ్చు -
చిటికెలో వెబ్సైట్
కొద్ది నిమిషాల్లో వెబ్‌సైట్‌ను సృష్టించుకోవాలని అనుకుంటున్నారా? అయితే విక్స్ ఏఐ వెబ్సైట్ బిల్డర్ సాయం తీసుకోవచ్చు. ఇది ఏఐ ఛాట్‌బాట్ సాయంతో సెకండ్లలోనే వెబ్‌సైట్‌ను తయారుచేస్తుంది మరి. -
మన డ్రోన్ ఉపగ్రహం!
డ్రోన్ల గురించి తెలిసిందే. వేడుకల్లో వీడియోలు తీయటం దగ్గరి నుంచి పొలాల్లో మందులు చల్లటం వరకూ రకరకాల పనులకు ఉపయోగపడుతున్నాయి. మరి ఇవి ఉపగ్రహం మాదిరిగానూ పనిచేస్తే? అలా ఉపయోగపడగల మానవరహిత బుల్లి విమాన వాహనాన్ని (అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్- యూఏవీ) బెంగళూరులోని నేషనల్ ఏరోస్పేస్ ల్యాబోరేటరీస్ (ఎన్ఏఎల్) గతవారం విజయవంతంగా పరీక్షించింది. -
వాట్సప్‌లో ఫేవరెట్స్ ట్యాబ్
వాట్సప్ ఛాట్స్ జాబితాలో ఇష్టమైన కాంటాక్టులను కనుక్కోవటం కష్టంగా ఉందా? త్వరలోనే దీనికి పరిష్కారం లభించనుంది. కొత్తగా ఫేవరెట్స్ ట్యాబ్‌ను పరిచయం కానుంది. దీన్ని ప్రస్తుతం ఐఓఎస్, వెబ్ యూజర్ల కోసం పరీక్షిస్తున్నారు. -
ఎక్స్ క్యాచీ శుభ్రం
ఎక్స్ (ట్విటర్) మొబైల్ యాప్ ఫోన్లో, ట్యాబ్లెట్లో క్యాచ్డ్ ఫైళ్లను నిల్వ చేస్తుందని తెలుసా? ఒకవేళ ఫోన్లో స్టోరేజీ నిండుకుంటున్నట్టయితే ఎక్స్ వెబ్, మీడియా క్యాచీని తొలగించుకోవటం తేలికైన, సత్వర పరిష్కార మార్గంగా ఉపయోగపడుతుంది. -
టెక్ చిట్కాలు
ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఇకపై బయోలో ఐదు లింకుల వరకు యాడ్ చేసుకోవచ్చు. యాప్‌లో లాగిన్ అయ్యాక అకౌంట్ సెటింగ్స్‌ను ఓపెన్ చేయాలి. మన ఫొటో దిగువన ఉండే ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్లి యాడ్ లింకును క్లిక్ చేయాలి. షేర్ చేయాలనుకునే లింకు జత చేసుకుంటే సరి. -
ప్రైవసీ విధాన వివరాలు తేలికగా ..
వెబ్సైట్లకు ప్రైవసీ పాలసీలు ఉండటం తెలిసిందే. వీటిని చాలామంది పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ ఆయా విధానాలను చదవాలన్నా పెద్దగా ఉంటాయి. -
యూట్యూబ్ వీడియో ఆడియోగా మారితే
యూట్యూబ్ అంటే ఎప్పుడూ చూడటమేనా? రేడియో మాదిరిగా పాటలు, సంగీతాన్ని వినలేమా? కొన్నిసార్లు ఇలాగే అనిపిస్తుంటుంది. వీడియోలను ఆడియో ఫైళ్లుగా సేవ్ చేసుకుంటే ఇది సాధ్యమే -
సోషల్ ఖాతా హ్యాక్ అయితే?
ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్.. ఇలా ఎన్నెన్నో సామాజిక మాధ్యమాలు. అభిప్రాయాలు పంచుకోవటానికైనా.. చుట్టుపక్కల సమాచారాన్ని తెలుసుకోవటానికైనా ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి -
అనవసర జీమెయిళ్ల తొలగింపు తేలికగా
అనవసర ఈమెయిళ్లు చాలా చికాకు కలిగిస్తాయి. రోజురోజుకీ ఇన్‌బాక్స్‌లో నిండిపోతూ వస్తుంటాయి. కొన్నిసార్లు వీటిని డిలీట్ చేయటానికే సమయమంతా వెచ్చించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. -
మెయిల్‌కు జవాబు మరుస్తుంటే?
మెయిల్‌ను చదువుతాం. తర్వాత జవాబిద్దామని అనుకుంటాం. తీరా మరచిపోతాం. ఎప్పటికో గానీ గుర్తుకురాదు. చాలాసార్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూనే ఉంటాం కదా. -
ఫోన్ టైపింగ్ వేగంగా
స్మార్ట్‌ఫోన్‌లో వేగంగా టైప్ చేయాలనుకుంటున్నారా? అయితే టెక్స్ట్ రిప్లేస్మెంట్ సాయం తీసుకోండి. దీంతో పెద్ద పదబంధాలకు షార్ట్‌కట్స్‌ను సెట్ చేసుకుంటే చాలా సమయం ఆదా అవుతుంది. -
స్నాప్‌చాట్ లైవ్ లొకేషన్‌తో భద్రం
మీ పిల్లలు స్నాప్‌ఛాట్ వాడుతున్నారా? కాస్త జాగ్రత్త. దీనిలోని లైవ్ లొకేషన్ ఫీచర్‌ను కొందరు దుర్వినియోగం చేయొచ్చు. పిల్లలు ఎక్కడున్నారో గుర్తించొచ్చు. -
మన మెయిల్ మనకే!
కొత్త సంవత్సరంలో లక్ష్యాలు నిర్దేశించుకున్నారా? వాటిని ఎంతవరకు సాధించారో ఎప్పటికప్పుడు సమీక్షించుకోవటం ఎంతైనా మేలు చేస్తుంది. ఇంకా చేయాల్సిందేంటి? ఎలా చేయాలి? అనేవి నిర్ణయించుకోవటానికి వీలవుతుంది -
ఛాట్‌జీపీటీకి సమాచారమా?
ఛాట్‌జీపీటీ వాడుతున్నారా? దీనికి వ్యక్తిగత వివరాలూ ఇస్తున్నారా? అయితే జాగ్రత్త పడాల్సిందే. ఛాట్‌జీపీటీకి మనం ఇచ్చే సమాచారమంతా భవిష్యత్ ఏఐ నమూనాలకు తర్ఫీదు ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. మున్ముందు ఇదెక్కడికి దారితీస్తుందో ఎవరికీ తెలియదు. -
డూప్లికేట్ ఫొటోలు పోయేలా..
కంప్యూటర్, ల్యాప్‌టాప్, ఫోన్లలో డూప్లికేట్ ఫొటోలు, ఫైళ్లు చాలా స్థలాన్ని ఆక్రమిస్తాయి. ఇవి అచ్చం నిజమైన ఫైళ్ల మాదిరిగానే కాకుండా వాటిని దాదాపు పోలినట్టుగానూ ఉండొచ్చు. వీటిని తొలగించటానికి ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లలో డిఫాల్ట్‌గా సదుపాయాలుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్‌గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్‌లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్‌లో సత్తా చాటాడు