మెటావర్స్‌పై మహా మోజు!

ఆగ్మెంటెడ్‌, వర్చువల్‌ రియాలిటీ పరిజ్ఞానాల వాడకం పుంజుకుంటోంది. దీంతో కాల్పనిక వాస్తవ ప్రపంచం జీవనం మీదా రోజురోజుకీ ఆసక్తి పెరుగుతోంది. ఇటీవల ఆక్సెంచర్‌ సంస్థ నిర్వహించిన గ్లోబల్‌ సర్వే ఇదే విషయాన్ని చెబుతోంది. ఇందులో

Updated : 11 May 2022 10:36 IST

గ్మెంటెడ్‌, వర్చువల్‌ రియాలిటీ పరిజ్ఞానాల వాడకం పుంజుకుంటోంది. దీంతో కాల్పనిక వాస్తవ ప్రపంచం జీవనం మీదా రోజురోజుకీ ఆసక్తి పెరుగుతోంది. ఇటీవల ఆక్సెంచర్‌ సంస్థ నిర్వహించిన గ్లోబల్‌ సర్వే ఇదే విషయాన్ని చెబుతోంది. ఇందులో మొత్తం 16 దేశాల నుంచి 11వేల మంది అభిప్రాయాలను సేకరించారు. వీరిలో ఇప్పటికే సుమారు మూడింట రెండొంతుల (64%) మంది గత సంవత్సరంలో వర్చువల్‌ వస్తువులు కొనటం, దాని అనుభూతిని పొందటం గమనార్హం. మెటావర్స్‌ ద్వారా కొనుగోళ్లకు 83% మంది ఆసక్తి చూపుతుండటంతో మున్ముందు వీరి సంఖ్య గణనీయంగా పెరగొచ్చని భావిస్తున్నారు. సలహా తీసుకోవటానికి, డబ్బు చెల్లించటానికి, బయట దుకాణాల్లో కొంటున్నప్పుడు వస్తువుల గురించి తెలుసుకోవటానికి వర్చువల్‌ ప్రపంచంలో రిటైల్‌ దుకాణాలను సందర్శించినట్టు 42% మంది వెల్లడించారు. మరో 54% మంది వచ్చే సంవత్సరంలో ఇలాంటి పనులు చేయాలని భావిస్తున్నారు. తమ జీవితాలు, జీవనోపాధులు రోజురోజుకీ డిజిటల్‌ ప్రపంచంలోకి వెళ్లిపోతున్నాయని సుమారు 55% మంది అభిప్రాయపడటం రానున్న మార్పులకు సంకేతం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని