Instagram Stories: ఇకపై రైలు బోగీల్లా కనిపించవు.. త్వరలో కొత్త ‘లేఅవుట్‌’!

ఇన్‌స్టాలో స్టోరీలకు సంబంధించి త్వరలో కొత్త లేఅవుట్‌ రాబోతోంది. దీని ద్వారా స్టోరీలకు ఇన్‌స్టా పరిమితి విధించనుంది. 

Updated : 20 May 2022 15:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) అంటేనే ఫొటోలు, వీడియోలు.. తక్కువ నిడివి గల వీడియోలతో రోజూ వీలైన‌న్ని ఎక్కువ స్టోరీలను ఇన్‌స్టాలో షేర్‌ చేయడం సర్వసాధారమే. అయితే, ఈ స్టోరీలకు పరిమితి విధించే పనిలో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త లేఅవుట్‌ (Stories new layout)ను తీసుకురాబోతోంది. ఇప్పటికే బ్రెజిల్‌లోని బీటా వినియోగదారులకు స్టోరీలకు సంబంధించి కొత్త లేఅవుట్‌ను కంపెనీ పరిచయం చేసినట్లు సమాచారం.

ఏంటీ కొత్త లేఅవుట్‌..?

సామాజిక మాధ్యమాలు, ఫోన్‌ కెమెరాలు అందుబాటులోకి వచ్చాక జీవితంలో ముఖ్యమైన ప్రతి సందర్భాన్ని యువత ఇతరులతో పంచుకుంటోంది. ఇన్‌స్టాలో ఇది కొద్దిగా ఎక్కువే. వాట్సాప్‌లో స్టేటస్‌ల మాదిరి ఒక్కో వినియోగదారుడు రోజూ పదుల సంఖ్యలో ఇన్‌స్టాలో స్టోరీస్‌ షేర్‌ చేస్తున్నారు. తద్వారా వారిని ఫాలో అయ్యే యూజర్లకు.. రైలు బోగీల మాదిరిగా ఉంటే ఈ స్టోరీలను చూడటం కొంత సమస్యగా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్టోరీస్‌ ఫీచర్‌లో కొత్త లేఅవుట్‌ను తీసుకొస్తోంది ఇన్‌స్టా. ఈ కొత్త లేఅవుట్‌లో కేవలం 3 స్టోరీలు మాత్రమే ఫాలోవర్లకు కనిపిస్తాయి. మిగిలిన స్టోరీలనూ చూడాలంటే ఫాలోవర్లు ‘షో ఆల్‌ (Show All)’ అనే బటన్‌ క్లిక్‌ చేయాల్సి ఉంటుంది.

అయితే, ఈ కొత్త ఇన్‌స్టాగ్రామ్‌ లేఅవుట్‌ ఫీచర్‌ విస్తృత స్థాయిలో ఎప్పటికి అందుబాటులోకి వస్తుందన్నది స్పష్టత లేదు. ఈ ఫీచర్‌ అందరికీ అందుబాటులోకి వస్తే ఇన్‌స్టా స్టోరీల్లో స్పామ్‌ కంటెంట్‌ తగ్గడమే కాకుండా యూజర్లు క్రియేటివ్‌గా ఉన్న మూడింటిని మాత్రమే ఆలోచించి షేర్‌ చేసుకోగలరు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని