Facebook: ఫేస్బుక్ ఖాతా హ్యాక్ అయిందా..? ఇలా రికవరీ చేయండి!
ఫేస్బుక్ ఖాతా హ్యాకయితే ఏం చేయాలి? తిరిగి ఖాతాను ఎలా పునరుద్ధరించుకోవాలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్‌డెస్క్: వ్యక్తిగత ఆలోచనలతో పాటు, సమకాలీన అంశాలపై అభిప్రాయాలను వ్యక్తపరిచేందుకు సామాజిక మాధ్యమాలు చక్కనైన వేదికలు. అంతేకాదు, పరిచయం లేని వ్యక్తుల గురించి ప్రాథమిక వివరాలు తెలుసుకునేందుకు కూడా వీటిని ఉపయోగిస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమ ఖాతాల్లోని వివరాలు బహిర్గతం కావడం యూజర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోంది. ఇటీవలి కాలంలో తమ ఫేస్బుక్ ఖాతాలు హ్యాక్ అయినట్లు పెడుతున్న మెసేజ్‌లు చూస్తూనే ఉన్నాం. దీంతో అందులోని ఫొటోలు, మెసేజ్‌లు వంటి సమాచారం సైబర్ నేరగాళ్లకు చేరిపోతుందని ఆందోళన చెందుతుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో హ్యాకైన ఖాతాను తిరిగి ఎలా దాన్ని పునరుద్ధరించుకోవాలో తెలుసుకుందాం.
యూజర్ అనుమతి లేకుండా ఫేస్బుక్ ఖాతాలోకి లాగిన్ కావాలంటే.. ఒకటి యూజర్ నేమ్, పాస్వర్డ్ తెలిసి ఉండాలి. రెండోది హ్యాకింగ్ చేయాలి. ఒకవేళ ఫేస్బుక్ ప్రొఫైల్‌లో ఈ-మెయిల్, పాస్వర్డ్, పుట్టిన తేదీ, పేరు వంటి వివరాలు యూజర్ ప్రమేయం లేకుండా మారితే ఫేస్బుక్ యూజర్‌కు అలర్ట్ మెసేజ్ పంపుతుంది. అలానే అపరిచిత వ్యక్తులకు ఫ్రెండ్ రిక్వెస్ట్, మెసేజ్‌లు పంపినా, యూజర్‌కు తెలియకుండా ఫేస్బుక్ వాల్‌పై పోస్టులు చేసినా సదరు ఖాతా హ్యాక్‌కు గురైనట్లేనని ఫేస్బుక్ చెబుతోంది.
* ఒకవేళ ఖాతా హ్యాకైనట్లు అనుమానం కలిగితే వెంటనే లాగిన్ పాస్వర్డ్ మార్చుకోమని ఫేస్బుక్ సూచిస్తోంది. ఇందుకోసం ఫేస్బుక్లో సెట్టింగ్స్ అండ్ ప్రైవసీలోకి వెళ్లి పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీలో ఛేంజ్ పాస్వర్డ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మార్చుకోవచ్చు.
* అలానే సెట్టింగ్స్ అండ్ ప్రైవసీలో మీ ఖాతా ఏయే డివైజ్‌లలో లాగిన్ అయిందనేది కూడా తెలుసుకోవచ్చు. వాటిలో మీ అనుమతిలేని డివైజ్ ఉంటే దాని నుంచి వెంటనే మీ ఖాతాను తొలగించడం మేలు.
* ఒకవేళ ఖాతా పునరుద్ధరించడం సాధ్యం కాకపోతే.. Facebook.com/hacked లోకి వెళితే మీ ఖాతాకు లింక్ అయిన ఫోన్ నంబర్ ఎంటర్ చేయమని సూచిస్తుంది. మీరు ఎంటర్ చేసిన ఫోన్ నంబర్, ఖాతాలోని నంబర్‌తో సరిపోలితే, మీ ఖాతాను పునరుద్ధరించేందుకు ఫేస్బుక్ మీకు సాయం చేస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైన్ఇన్ లేకుండానే ఛాట్‌జీపీటీ
ఛాట్‌జీపీటీని వాడుకోవాలంటే ముందు సైన్ఇన్ కావాల్సి ఉంటుంది. పాస్‌వర్డ్‌ను మరచిపోవటం వంటి సందర్భాల్లో ఇది కష్టంగా అనిపిస్తుంటుంది. -
ఎక్స్‌లో కమ్యూనిటీ నోట్స్
ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న తరుణంలో ఎక్స్ (ట్విటర్) మనదేశంలో కమ్యూనిటీ నోట్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌కు కంట్రిబ్యూట్ చేయటానికి కొత్తవారికీ ఆహ్వానం పలికింది -
వైఫై పాస్వర్డ్ మరిచారా?
ఇంటికి వచ్చిన అతిథులో, పరిచయం ఉన్నవారో వైఫై పాస్వర్డ్ అడుగుతుంటారు. చాలాసార్లు అదేంటో గుర్తుకురాదు. మరెలా? చేతిలో ఫోన్ ఉంటే ఇట్టే తెలుసుకోవచ్చు. ఐఫోన్ వాడేవారైతే- సెటింగ్స్ ద్వారా వైఫై విభాగంలోకి వెళ్లాలి. -
సైబర్ నేరాలకు చక్షు కళ్లెం
మోసపూరిత కాల్స్, మెసేజ్‌ల వంటి సైబర్ నేరాలను అరికట్టటానికి టెలికం విభాగం కొత్త పోర్టల్‌ను పరిచయం చేసింది. సంచార్ సాథీ కార్యక్రమంలో భాగంగా తీసుకొచ్చిన దీని పేరు చక్షు. -
యాపిల్ పాడ్‌కాస్ట్‌లు అక్షరాల్లో..
పాడ్‌కాస్ట్‌లు ఎంత పాపులర్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకునే యాపిల్ సంస్థ పాడ్‌కాస్ట్‌లను మరింత విస్తృతంగా అందుబాటులోకి తేవటానికి, వాటిల్లోని అంశాలను, విషయాలను తేలికగా కనుక్కోవటానికి ఓ వినూత్న ఫీచర్‌ను ప్రవేశపెట్టింది -
ఫొటోతోనే వీడియో..
షేక్స్పియర్ స్వగతాన్ని మోనాలిసా పాట రూపంలో పాడితే? అదెలా సాధ్యమని ఆశ్చర్యపోకండి. కృత్రిమ మేధ(ఏఐ)తో ఇలాంటి అద్భుతాలు ఎన్నయినా చేయొచ్చు -
చిటికెలో వెబ్సైట్
కొద్ది నిమిషాల్లో వెబ్‌సైట్‌ను సృష్టించుకోవాలని అనుకుంటున్నారా? అయితే విక్స్ ఏఐ వెబ్సైట్ బిల్డర్ సాయం తీసుకోవచ్చు. ఇది ఏఐ ఛాట్‌బాట్ సాయంతో సెకండ్లలోనే వెబ్‌సైట్‌ను తయారుచేస్తుంది మరి. -
మన డ్రోన్ ఉపగ్రహం!
డ్రోన్ల గురించి తెలిసిందే. వేడుకల్లో వీడియోలు తీయటం దగ్గరి నుంచి పొలాల్లో మందులు చల్లటం వరకూ రకరకాల పనులకు ఉపయోగపడుతున్నాయి. మరి ఇవి ఉపగ్రహం మాదిరిగానూ పనిచేస్తే? అలా ఉపయోగపడగల మానవరహిత బుల్లి విమాన వాహనాన్ని (అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్- యూఏవీ) బెంగళూరులోని నేషనల్ ఏరోస్పేస్ ల్యాబోరేటరీస్ (ఎన్ఏఎల్) గతవారం విజయవంతంగా పరీక్షించింది. -
వాట్సప్‌లో ఫేవరెట్స్ ట్యాబ్
వాట్సప్ ఛాట్స్ జాబితాలో ఇష్టమైన కాంటాక్టులను కనుక్కోవటం కష్టంగా ఉందా? త్వరలోనే దీనికి పరిష్కారం లభించనుంది. కొత్తగా ఫేవరెట్స్ ట్యాబ్‌ను పరిచయం కానుంది. దీన్ని ప్రస్తుతం ఐఓఎస్, వెబ్ యూజర్ల కోసం పరీక్షిస్తున్నారు. -
ఎక్స్ క్యాచీ శుభ్రం
ఎక్స్ (ట్విటర్) మొబైల్ యాప్ ఫోన్లో, ట్యాబ్లెట్లో క్యాచ్డ్ ఫైళ్లను నిల్వ చేస్తుందని తెలుసా? ఒకవేళ ఫోన్లో స్టోరేజీ నిండుకుంటున్నట్టయితే ఎక్స్ వెబ్, మీడియా క్యాచీని తొలగించుకోవటం తేలికైన, సత్వర పరిష్కార మార్గంగా ఉపయోగపడుతుంది. -
టెక్ చిట్కాలు
ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఇకపై బయోలో ఐదు లింకుల వరకు యాడ్ చేసుకోవచ్చు. యాప్‌లో లాగిన్ అయ్యాక అకౌంట్ సెటింగ్స్‌ను ఓపెన్ చేయాలి. మన ఫొటో దిగువన ఉండే ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్లి యాడ్ లింకును క్లిక్ చేయాలి. షేర్ చేయాలనుకునే లింకు జత చేసుకుంటే సరి. -
ప్రైవసీ విధాన వివరాలు తేలికగా ..
వెబ్సైట్లకు ప్రైవసీ పాలసీలు ఉండటం తెలిసిందే. వీటిని చాలామంది పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ ఆయా విధానాలను చదవాలన్నా పెద్దగా ఉంటాయి. -
యూట్యూబ్ వీడియో ఆడియోగా మారితే
యూట్యూబ్ అంటే ఎప్పుడూ చూడటమేనా? రేడియో మాదిరిగా పాటలు, సంగీతాన్ని వినలేమా? కొన్నిసార్లు ఇలాగే అనిపిస్తుంటుంది. వీడియోలను ఆడియో ఫైళ్లుగా సేవ్ చేసుకుంటే ఇది సాధ్యమే -
సోషల్ ఖాతా హ్యాక్ అయితే?
ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్.. ఇలా ఎన్నెన్నో సామాజిక మాధ్యమాలు. అభిప్రాయాలు పంచుకోవటానికైనా.. చుట్టుపక్కల సమాచారాన్ని తెలుసుకోవటానికైనా ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి -
అనవసర జీమెయిళ్ల తొలగింపు తేలికగా
అనవసర ఈమెయిళ్లు చాలా చికాకు కలిగిస్తాయి. రోజురోజుకీ ఇన్‌బాక్స్‌లో నిండిపోతూ వస్తుంటాయి. కొన్నిసార్లు వీటిని డిలీట్ చేయటానికే సమయమంతా వెచ్చించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. -
మెయిల్‌కు జవాబు మరుస్తుంటే?
మెయిల్‌ను చదువుతాం. తర్వాత జవాబిద్దామని అనుకుంటాం. తీరా మరచిపోతాం. ఎప్పటికో గానీ గుర్తుకురాదు. చాలాసార్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూనే ఉంటాం కదా. -
ఫోన్ టైపింగ్ వేగంగా
స్మార్ట్‌ఫోన్‌లో వేగంగా టైప్ చేయాలనుకుంటున్నారా? అయితే టెక్స్ట్ రిప్లేస్మెంట్ సాయం తీసుకోండి. దీంతో పెద్ద పదబంధాలకు షార్ట్‌కట్స్‌ను సెట్ చేసుకుంటే చాలా సమయం ఆదా అవుతుంది. -
స్నాప్‌చాట్ లైవ్ లొకేషన్‌తో భద్రం
మీ పిల్లలు స్నాప్‌ఛాట్ వాడుతున్నారా? కాస్త జాగ్రత్త. దీనిలోని లైవ్ లొకేషన్ ఫీచర్‌ను కొందరు దుర్వినియోగం చేయొచ్చు. పిల్లలు ఎక్కడున్నారో గుర్తించొచ్చు. -
మన మెయిల్ మనకే!
కొత్త సంవత్సరంలో లక్ష్యాలు నిర్దేశించుకున్నారా? వాటిని ఎంతవరకు సాధించారో ఎప్పటికప్పుడు సమీక్షించుకోవటం ఎంతైనా మేలు చేస్తుంది. ఇంకా చేయాల్సిందేంటి? ఎలా చేయాలి? అనేవి నిర్ణయించుకోవటానికి వీలవుతుంది -
ఛాట్‌జీపీటీకి సమాచారమా?
ఛాట్‌జీపీటీ వాడుతున్నారా? దీనికి వ్యక్తిగత వివరాలూ ఇస్తున్నారా? అయితే జాగ్రత్త పడాల్సిందే. ఛాట్‌జీపీటీకి మనం ఇచ్చే సమాచారమంతా భవిష్యత్ ఏఐ నమూనాలకు తర్ఫీదు ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. మున్ముందు ఇదెక్కడికి దారితీస్తుందో ఎవరికీ తెలియదు. -
డూప్లికేట్ ఫొటోలు పోయేలా..
కంప్యూటర్, ల్యాప్‌టాప్, ఫోన్లలో డూప్లికేట్ ఫొటోలు, ఫైళ్లు చాలా స్థలాన్ని ఆక్రమిస్తాయి. ఇవి అచ్చం నిజమైన ఫైళ్ల మాదిరిగానే కాకుండా వాటిని దాదాపు పోలినట్టుగానూ ఉండొచ్చు. వీటిని తొలగించటానికి ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లలో డిఫాల్ట్‌గా సదుపాయాలుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
-
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
-
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
-
‘మా చిత్రాన్ని మరో ‘అన్బే శివం’ చేయొద్దు’: విజయ్ ఆంటోనీ వైరల్ పోస్ట్