Instagram: యువతను మెప్పించేలా ఇన్‌స్టా కొత్త ఫీచర్లు.. ఓ లుక్కేయండి మరి!
ఫొటో/వీడియో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్ ఏడు కొత్త మెసేజింగ్ ఫీచర్లను తీసుకొచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: పాత చింతకాయ పచ్చడిలా రోటీన్‌గా ఉంటే ఈ కాలం యూత్‌కు అంతగా నచ్చదు. మసాలా దట్టిస్తేనే భలేగా ఉందంటూ మళ్లీ కావాలంటారు. అలాంటి పంథానే అవలంభిస్తోంది ఇన్స్టాగ్రామ్ (Instagram). తాజాగా యూత్‌ను మెప్పించేలా ఆకర్షణీయమైన కొత్త ఫీచర్లను (Instagram new features) ప్రవేశపెట్టింది. అవేంటో ఓ సారి చూద్దాం!
బ్రౌజ్ చేస్తూనే రిప్లై (Reply While You Browse)
ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఎవరైనా మెసేజ్ చేస్తే ఏం చేస్తాం? ప్రత్యేకంగా ఇన్‌బాక్స్‌లోకి వెళ్లి మెస్జ్ను చదివి రిప్లై ఇస్తాం. అయితే ఇన్‌బాక్స్‌కు వెళ్లకుండా డైరెక్ట్‌గా మెసేజ్ ఓపెన్ చేసి రిప్లయి ఇచ్చేలా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో యూజర్లు సులువుగా మరింత సౌకర్యవంతంగా చాట్ చేసే వీలు ఉంటుంది.
మరింత వేగంగా.. (Quickly Send To Friends)
ఇన్‌స్టాగ్రామ్‌లోని ఆసక్తికరమైన కంటెంట్‌ను ఫ్రెండ్స్‌తో వేగంగా షేర్ చేయడం కోసం మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. షేర్ బటన్ నొక్కి పట్టుకోవడం ద్వారా మన దగ్గరి వ్యక్తులకు/స్నేహితులకు (క్లోజ్ ఫ్రెండ్స్‌లో ఎంచుకున్నవారికి) కంటెంట్‌ను వేగంగా షేర్ చేయవచ్చు.
ఆన్లైన్లో ఎవరున్నారు? (See Who's Online)
ఇన్స్టాగ్రామ్ ఆన్లైన్లో ఉన్న వారిని సులువుగా గుర్తించేలా ఓ ఫీచర్ తీసుకొస్తున్నారు. యాప్ ఓపెన్ చేసినప్పుడు ఎంతమంది, ఏయే స్నేహితులు ఆన్లైన్లో ఉన్నారనే వివరాలను ఇన్‌బాక్స్‌లో పైన చూపిస్తుంది.
చాట్లోనూ సాంగ్స్ షేర్.. (Play, pause and re-play)
ఇన్‌స్టాగ్రామ్‌లో యాపిల్ మ్యూజిక్, అమెజాన్ మ్యూజిక్, స్పాటిఫై వంటి మ్యూజిక్ స్ట్రీమింగ్ సౌకర్యాలను ఎనేబుల్ చేసుకునేలా మరో ఫీచర్ తీసుకురానుంది. దీంతో చాట్‌లో 30 సెకన్ల నిడివితో ఉన్న సాంగ్స్‌ను ఇతరులతో షేర్ చేసుకోవచ్చు.
చాటింగ్ మరింత గోప్యంగా.. (Keep it on ye lo-fi)
ఇన్‌స్టాలో వ్యక్తిగత చాటింగ్‌ను గోప్యంగా ఉంచుకునేలా కొత్తగా లో-ఫై (lo-fi) అనే చాట్ థీమ్‌ను పరిచయం చేయనుంది. ఇదెలా పని చేస్తుందనే విషయంలో స్పష్టత లేదు.
సైలెంట్ మెసేజ్ (Send silent Messages)
ఇన్‌స్టాలో పంపిన మెసేజ్ నోటిఫికేషన్లో తెలుస్తుంది. అయితే ఈ మెసేజ్ నోటిఫికేషన్ వల్ల అవతలి వారికి ఇబ్బంది కలగవచ్చు. అలా ఇబ్బంది లేకుండా ఇన్స్టాగ్రామ్ సైలెంట్ మెసేజ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. పంపే మెసేజ్‌కు ముందు @Silent అని టైప్ చేస్తే మెసేజ్ నోటిఫికేషన్ సైలెంట్‌గా అవతలి వ్యక్తికి చేరుతుంది.
క్రియేట్ పోల్.. (Create a Poll with your squad)
టెలీగ్రామ్, ఫేస్బుక్ మెసెంజర్లో ఉన్నట్లుగానే ఇన్స్టాగ్రామ్ కూడా గ్రూప్ పోల్ ఫీచర్‌ను తీసుకురానుంది. దీంతో పోల్‌ను క్రియేట్ చేసి స్నేహితులతో పంచుకోవచ్చు. గ్రూప్ పోల్‌ను క్రియేట్ చేయడానికి ఒక ప్రశ్నను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత, యూజర్లు ఓటు వేయడానికి కొన్ని సమాధానాలను జోడించాల్సి ఉంటుంది.
గమనిక: ఇందులో కొన్ని ఆప్షన్లు ప్రయోగాత్మకంగా కొందరికి అందుబాటులో ఉన్నాయి. త్వరలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాపిల్ పాడ్‌కాస్ట్‌లు అక్షరాల్లో..
పాడ్‌కాస్ట్‌లు ఎంత పాపులర్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకునే యాపిల్ సంస్థ పాడ్‌కాస్ట్‌లను మరింత విస్తృతంగా అందుబాటులోకి తేవటానికి, వాటిల్లోని అంశాలను, విషయాలను తేలికగా కనుక్కోవటానికి ఓ వినూత్న ఫీచర్‌ను ప్రవేశపెట్టింది -
ఫొటోతోనే వీడియో..
షేక్స్పియర్ స్వగతాన్ని మోనాలిసా పాట రూపంలో పాడితే? అదెలా సాధ్యమని ఆశ్చర్యపోకండి. కృత్రిమ మేధ(ఏఐ)తో ఇలాంటి అద్భుతాలు ఎన్నయినా చేయొచ్చు -
చిటికెలో వెబ్సైట్
కొద్ది నిమిషాల్లో వెబ్‌సైట్‌ను సృష్టించుకోవాలని అనుకుంటున్నారా? అయితే విక్స్ ఏఐ వెబ్సైట్ బిల్డర్ సాయం తీసుకోవచ్చు. ఇది ఏఐ ఛాట్‌బాట్ సాయంతో సెకండ్లలోనే వెబ్‌సైట్‌ను తయారుచేస్తుంది మరి. -
మన డ్రోన్ ఉపగ్రహం!
డ్రోన్ల గురించి తెలిసిందే. వేడుకల్లో వీడియోలు తీయటం దగ్గరి నుంచి పొలాల్లో మందులు చల్లటం వరకూ రకరకాల పనులకు ఉపయోగపడుతున్నాయి. మరి ఇవి ఉపగ్రహం మాదిరిగానూ పనిచేస్తే? అలా ఉపయోగపడగల మానవరహిత బుల్లి విమాన వాహనాన్ని (అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్- యూఏవీ) బెంగళూరులోని నేషనల్ ఏరోస్పేస్ ల్యాబోరేటరీస్ (ఎన్ఏఎల్) గతవారం విజయవంతంగా పరీక్షించింది. -
వాట్సప్‌లో ఫేవరెట్స్ ట్యాబ్
వాట్సప్ ఛాట్స్ జాబితాలో ఇష్టమైన కాంటాక్టులను కనుక్కోవటం కష్టంగా ఉందా? త్వరలోనే దీనికి పరిష్కారం లభించనుంది. కొత్తగా ఫేవరెట్స్ ట్యాబ్‌ను పరిచయం కానుంది. దీన్ని ప్రస్తుతం ఐఓఎస్, వెబ్ యూజర్ల కోసం పరీక్షిస్తున్నారు. -
ఎక్స్ క్యాచీ శుభ్రం
ఎక్స్ (ట్విటర్) మొబైల్ యాప్ ఫోన్లో, ట్యాబ్లెట్లో క్యాచ్డ్ ఫైళ్లను నిల్వ చేస్తుందని తెలుసా? ఒకవేళ ఫోన్లో స్టోరేజీ నిండుకుంటున్నట్టయితే ఎక్స్ వెబ్, మీడియా క్యాచీని తొలగించుకోవటం తేలికైన, సత్వర పరిష్కార మార్గంగా ఉపయోగపడుతుంది. -
టెక్ చిట్కాలు
ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఇకపై బయోలో ఐదు లింకుల వరకు యాడ్ చేసుకోవచ్చు. యాప్‌లో లాగిన్ అయ్యాక అకౌంట్ సెటింగ్స్‌ను ఓపెన్ చేయాలి. మన ఫొటో దిగువన ఉండే ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్లి యాడ్ లింకును క్లిక్ చేయాలి. షేర్ చేయాలనుకునే లింకు జత చేసుకుంటే సరి. -
ప్రైవసీ విధాన వివరాలు తేలికగా ..
వెబ్సైట్లకు ప్రైవసీ పాలసీలు ఉండటం తెలిసిందే. వీటిని చాలామంది పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ ఆయా విధానాలను చదవాలన్నా పెద్దగా ఉంటాయి. -
యూట్యూబ్ వీడియో ఆడియోగా మారితే
యూట్యూబ్ అంటే ఎప్పుడూ చూడటమేనా? రేడియో మాదిరిగా పాటలు, సంగీతాన్ని వినలేమా? కొన్నిసార్లు ఇలాగే అనిపిస్తుంటుంది. వీడియోలను ఆడియో ఫైళ్లుగా సేవ్ చేసుకుంటే ఇది సాధ్యమే -
సోషల్ ఖాతా హ్యాక్ అయితే?
ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్.. ఇలా ఎన్నెన్నో సామాజిక మాధ్యమాలు. అభిప్రాయాలు పంచుకోవటానికైనా.. చుట్టుపక్కల సమాచారాన్ని తెలుసుకోవటానికైనా ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి -
అనవసర జీమెయిళ్ల తొలగింపు తేలికగా
అనవసర ఈమెయిళ్లు చాలా చికాకు కలిగిస్తాయి. రోజురోజుకీ ఇన్‌బాక్స్‌లో నిండిపోతూ వస్తుంటాయి. కొన్నిసార్లు వీటిని డిలీట్ చేయటానికే సమయమంతా వెచ్చించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. -
మెయిల్‌కు జవాబు మరుస్తుంటే?
మెయిల్‌ను చదువుతాం. తర్వాత జవాబిద్దామని అనుకుంటాం. తీరా మరచిపోతాం. ఎప్పటికో గానీ గుర్తుకురాదు. చాలాసార్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూనే ఉంటాం కదా. -
ఫోన్ టైపింగ్ వేగంగా
స్మార్ట్‌ఫోన్‌లో వేగంగా టైప్ చేయాలనుకుంటున్నారా? అయితే టెక్స్ట్ రిప్లేస్మెంట్ సాయం తీసుకోండి. దీంతో పెద్ద పదబంధాలకు షార్ట్‌కట్స్‌ను సెట్ చేసుకుంటే చాలా సమయం ఆదా అవుతుంది. -
స్నాప్‌చాట్ లైవ్ లొకేషన్‌తో భద్రం
మీ పిల్లలు స్నాప్‌ఛాట్ వాడుతున్నారా? కాస్త జాగ్రత్త. దీనిలోని లైవ్ లొకేషన్ ఫీచర్‌ను కొందరు దుర్వినియోగం చేయొచ్చు. పిల్లలు ఎక్కడున్నారో గుర్తించొచ్చు. -
మన మెయిల్ మనకే!
కొత్త సంవత్సరంలో లక్ష్యాలు నిర్దేశించుకున్నారా? వాటిని ఎంతవరకు సాధించారో ఎప్పటికప్పుడు సమీక్షించుకోవటం ఎంతైనా మేలు చేస్తుంది. ఇంకా చేయాల్సిందేంటి? ఎలా చేయాలి? అనేవి నిర్ణయించుకోవటానికి వీలవుతుంది -
ఛాట్‌జీపీటీకి సమాచారమా?
ఛాట్‌జీపీటీ వాడుతున్నారా? దీనికి వ్యక్తిగత వివరాలూ ఇస్తున్నారా? అయితే జాగ్రత్త పడాల్సిందే. ఛాట్‌జీపీటీకి మనం ఇచ్చే సమాచారమంతా భవిష్యత్ ఏఐ నమూనాలకు తర్ఫీదు ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. మున్ముందు ఇదెక్కడికి దారితీస్తుందో ఎవరికీ తెలియదు. -
డూప్లికేట్ ఫొటోలు పోయేలా..
కంప్యూటర్, ల్యాప్‌టాప్, ఫోన్లలో డూప్లికేట్ ఫొటోలు, ఫైళ్లు చాలా స్థలాన్ని ఆక్రమిస్తాయి. ఇవి అచ్చం నిజమైన ఫైళ్ల మాదిరిగానే కాకుండా వాటిని దాదాపు పోలినట్టుగానూ ఉండొచ్చు. వీటిని తొలగించటానికి ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లలో డిఫాల్ట్‌గా సదుపాయాలుంటాయి. -
నవ ఫీచర్ల వాట్సప్
నిత్య నూతన ఫీచర్లతో ఆకట్టుకునే వాట్సప్ ఈ సంవత్సరమూ అంతే దూకుడును ప్రదర్శిస్తోంది. మొబైల్, వెబ్ వర్షన్లలో యూజర్ ఇంటరాక్షన్‌ను మెరుగు పరచటానికి బోలెడన్ని కొత్త ఫీచర్లను సిద్ధం చేస్తోంది. కొత్త సైడ్‌బార్‌తో పాటు డార్క్‌మోడ్‌ను తీర్చిదిద్దటం, వెబ్ క్లయింట్ నుంచి నేరుగా యూజర్‌నేమ్‌ను సృష్టించటం వంటి వాటికి అవకాశం కల్పించనుంది. -
తాత్కాలిక మెయిల్ కోసం
ఖాళీ సమయంలో గిగ్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తుండొచ్చు. మరేదైనా అవసరం కోసమో ఈమెయిల్ ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తొచ్చు. అయితే అదంత ముఖ్యమైన వ్యవహారం కాకపోవచ్చు. -
ఈ స్మార్ట్ఫోన్లు వాడుతున్నారా?
ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ఫోన్లే. ఇవి రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. నివాస ప్రాంతం, బ్యాంకు వివరాల వంటి బోలెడంత వ్యక్తిగత సమాచారం వీటిల్లో నిక్షిప్తమవుతోంది. దీన్ని మోసగాళ్లకు చిక్కకుండా కాపాడుకోవటం తప్పనిసరైంది. అందుకే భద్రతను మెరుగుపరచటంలో భాగంగా ప్రభుత్వం అప్పుడప్పుడు హెచ్చరికలూ జారిచేస్తుంటుంది. -
వీడియో కాల్ చేస్తున్నా సంగీతం వినొచ్చు
ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అలరించే వాట్సప్ మరో వినూత్న సదుపాయాన్ని తీసుకొస్తోంది. ఇది వీడియో కాల్ చేస్తున్నప్పుడు ఎవరైనా స్క్రీన్ షేర్ చేస్తే పాటల వంటివి వినటానికీ వీలు కల్పిస్తుంది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ రెండు పరికరాల కోసమూ దీన్ని రూపొందిస్తున్నారు. దేని గురించైనా చర్చిస్తున్నప్పుడు వినోదం కోసం సంగీతం వినటం వంటి మల్టీమీడియా సదుపాయాల విషయంలో ఇది కొత్త దారులు తెరవగలదని భావిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నిన్న అమెరికా నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
-
నటుడు విజయ్ కుమారుడు కొత్త సినిమా.. హీరోగా కాదు!