WhatsApp: వాట్సాప్‌ ‘ఆన్‌లైన్‌ స్టేటస్‌’ దాచేయండిలా!

వాట్సాప్‌లో మన ప్రొఫైల్ స్టేటస్‌లో ఆన్‌లైన్‌ అని ఇతరులకు కనిపించకుండా ఆఫ్‌లైన్‌లో ఉంచుకునేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం. 

Published : 26 Dec 2021 17:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వాట్సాప్‌లో ఎన్నో రకాల ఫీచర్లున్నాయి. వాటిలో కొన్ని యూజర్స్‌ వ్యక్తిగత గోప్యతకు సంబంధించినవి కాగా.. మరికొన్ని యూజర్‌కు విసుగుపుట్టించే మెసేజ్‌ల నుంచి ఉపశమనం కల్పించేవి. అందుకే వాట్సాప్‌కు సంబంధించి కొత్తగా వచ్చే ఫీచర్లు, టిప్స్‌ అండ్‌ ట్రిక్స్‌ గురించి తెలుసుకునేందుకు యూజర్స్‌ ఆసక్తి కనబరుస్తారు. అయితే, మీరు వాట్సాప్‌లో ఆన్‌లైన్‌లో ఉన్నట్లుగా తెలిపే ఆన్‌లైన్‌ స్టేటస్‌ను ఎలా హైడ్ చేసుకోవచ్చనేది ఇప్పుడు తెలుసుకుందాం.

* ముందుగా స్మార్ట్‌ఫోన్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి నోటిఫికేషన్‌ సెక్షన్ ఓపెన్ చేయాలి. అందులో వాట్సాప్ నోటిఫికేషన్స్‌ ఎనేబుల్‌ చేసుండాలి.

* తర్వాత సెట్టింగ్స్‌లో యాప్స్‌లోకి వెళ్లి వాట్సాప్‌ యాప్‌పై క్లిక్ చేయాలి. అందులో నోటిఫికేషన్స్‌ ఫీచర్స్‌లోకి వెళ్లి దాన్ని ఎనేబుల్ చేయాలి. 

* తర్వాత ఎప్పుడైనా మీకు వాట్సాప్ మెసేజ్ వస్తే నోటిఫికేషన్ ప్యానెల్‌లో కనిపిస్తుంది. దానిపై టచ్‌ చేస్తే మీకు రిప్లై ఆప్షన్‌ కనిపిస్తుంది. అక్కడ్నుంచే మీరు వాట్సాప్‌ ఓపెన్‌ చేయకుండానే రిప్లై ఇవ్వొచ్చు. 

* ఇలా చేయడం వల్ల మీరు ఆన్‌లైన్‌లో ఉన్నట్లు అవతలి వారికి తెలియదు. అలానే మీకు వచ్చిన వాట్సాప్‌ మెసేజ్‌ చూసేందుకు వాట్సాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. మీ వాట్సాప్‌ స్టేటస్‌ కూడా ఆఫ్‌లైన్‌ అని అవతలి వారికి కనిపిస్తుంది. 

Read latest Gadgets & Technology News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని