WhatsApp: ఒకే నెంబర్‌తో ఒకేసారి రెండు స్మార్ట్ఫోన్లలో వాట్సాప్..!
ఒకే అకౌంట్‌ను రెండు స్మార్ట్ఫోన్లలో వాడే సదుపాయాన్ని వాట్సాప్ తీసుకొస్తున్నట్లు వాబీటాఇన్ఫో తన వెబ్సైట్లో వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ డివైజ్‌లలో వాట్సాప్‌ను ఉపయోగించుకునేలా ‘మల్టీడివైజ్ సపోర్ట్’ (multi-device support) ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్ సాయంతో యూజర్లు ప్రైమరీ అకౌంట్ కాకుండా ల్యాప్‌టాప్, ట్యాబ్, డెస్క్‌టాప్‌లలో లాగిన్ అయ్యే సదుపాయాన్ని కల్పించింది. అయితే, తాజాగా ఒకే వాట్సాప్ అకౌంట్‌ను రెండు స్మార్ట్ఫోన్లలో వాడే సదుపాయాన్ని కూడా తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని వాబీటాఇన్ఫో తన వెబ్సైట్లో వెల్లడించింది.
వాబీటాఇన్ఫో తెలిపిన వివరాల ప్రకారం.. వాట్సాప్ ‘మల్టీ డివైజ్ సపోర్టు’ సేవలను విస్తరించనుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌కు అదనపు హంగులు జోడించాలని వాట్సాప్ భావిస్తోంది. యూజర్లు ప్రైమరీ మొబైల్ల్లోనే కాకుండా మరో ఫోన్/ట్యాబ్‌లో వాట్సాప్ ఓపెన్ చేసే సదుపాయాన్ని త్వరలోనే తీసుకురానుంది. ఈ ఫీచర్ సాయంతో వాట్సాప్ అకౌంట్‌ను మరో ఫోన్‌కు లింక్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. వాట్సాప్ బీటా 2.22.10.13 వెర్షన్లలో ఈ ఫీచర్ పనిచేయనుందని సమాచారం. దీనికోసం వాట్సాప్ ప్రైమరీ అకౌంట్ ఉన్న మొబైల్ నుంచి లింక్ చేయాలనుకున్న స్మార్ట్‌ఫోన్‌లో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. సెకండరీ మొబైల్లో వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు ‘రిజిస్టర్ డివైజ్ యాజ్ కంపానియన్ ’(Register device as companion) అనే ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాలని వాబీటాఇన్ఫో పేర్కొంది. అయితే, ఈ ఫీచర్ ఇంకా ప్రయోగాత్మక దశలో ఉందని.. ఫైనల్ వెర్షన్ అందుబాటులోకి వచ్చే సమయానికి కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉందని వాబీటాఇన్ఫో వెల్లడించింది. కాగా.. ఒకేసారి రెండు స్మార్ట్ఫోన్లలో కనెక్ట్ అయినప్పుడు యూజర్ డేటాకు వాట్సాప్ ఎలాంటి భద్రత కల్పిస్తుందనే దానిపై స్పష్టత రాలేదు.
మల్టీ డివైజ్ ఫీచర్ ఎలా ఉపయోగించాలి?
వాట్సాప్ మల్టీ డివైజ్ ఫీచర్ ఉపయోగించాలంటే మందుగా మీ ఫోన్లో కుడివైపు మూడు చుక్కలపై క్లిక్ చేస్తే లింక్ డివైజ్ (ప్రస్తుతం బీటా యూజర్స్‌కి మాత్రమే అందుబాటులో ఉంది) అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఫింగర్ లేదా పాస్వర్డ్ అథెంటికేషన్ అడుగుతుంది. (ఈ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకుంటే) తర్వాత మీరు లాగిన్ అవ్వాలనుకుంటున్న డివైజ్‌లో వాట్సాప్ వెబ్ ఓపెన్ చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే మీ వాట్సాప్ ఖాతా అందులో కూడా ఓపెన్ అవుతుంది. అలా మీరు ఒకేసారి వాట్సాప్ ఖాతా ఉన్న ఫోన్ కాకుండా మరో నాలుగు డివైజ్‌లలో యాక్సిస్ చెయ్యొచ్చు. ఒకవేళ మీ ఫోన్ స్విచ్ఆఫ్ అయినా మీరు లాగిన్ అయిన నాలుగు డివైజ్‌ల నుంచి వాట్సాప్‌ను ఉపయోగించుకోవచ్చు. అలానే మీ కాంటాక్ట్ లిస్ట్, ఛాట్ హిస్టరీ అన్ని వేర్వేరుగా సదరు డివైజ్‌లకు కనెక్ట్ అవుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైన్ఇన్ లేకుండానే ఛాట్‌జీపీటీ
ఛాట్‌జీపీటీని వాడుకోవాలంటే ముందు సైన్ఇన్ కావాల్సి ఉంటుంది. పాస్‌వర్డ్‌ను మరచిపోవటం వంటి సందర్భాల్లో ఇది కష్టంగా అనిపిస్తుంటుంది. -
ఎక్స్‌లో కమ్యూనిటీ నోట్స్
ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న తరుణంలో ఎక్స్ (ట్విటర్) మనదేశంలో కమ్యూనిటీ నోట్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌కు కంట్రిబ్యూట్ చేయటానికి కొత్తవారికీ ఆహ్వానం పలికింది -
వైఫై పాస్వర్డ్ మరిచారా?
ఇంటికి వచ్చిన అతిథులో, పరిచయం ఉన్నవారో వైఫై పాస్వర్డ్ అడుగుతుంటారు. చాలాసార్లు అదేంటో గుర్తుకురాదు. మరెలా? చేతిలో ఫోన్ ఉంటే ఇట్టే తెలుసుకోవచ్చు. ఐఫోన్ వాడేవారైతే- సెటింగ్స్ ద్వారా వైఫై విభాగంలోకి వెళ్లాలి. -
సైబర్ నేరాలకు చక్షు కళ్లెం
మోసపూరిత కాల్స్, మెసేజ్‌ల వంటి సైబర్ నేరాలను అరికట్టటానికి టెలికం విభాగం కొత్త పోర్టల్‌ను పరిచయం చేసింది. సంచార్ సాథీ కార్యక్రమంలో భాగంగా తీసుకొచ్చిన దీని పేరు చక్షు. -
యాపిల్ పాడ్‌కాస్ట్‌లు అక్షరాల్లో..
పాడ్‌కాస్ట్‌లు ఎంత పాపులర్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకునే యాపిల్ సంస్థ పాడ్‌కాస్ట్‌లను మరింత విస్తృతంగా అందుబాటులోకి తేవటానికి, వాటిల్లోని అంశాలను, విషయాలను తేలికగా కనుక్కోవటానికి ఓ వినూత్న ఫీచర్‌ను ప్రవేశపెట్టింది -
ఫొటోతోనే వీడియో..
షేక్స్పియర్ స్వగతాన్ని మోనాలిసా పాట రూపంలో పాడితే? అదెలా సాధ్యమని ఆశ్చర్యపోకండి. కృత్రిమ మేధ(ఏఐ)తో ఇలాంటి అద్భుతాలు ఎన్నయినా చేయొచ్చు -
చిటికెలో వెబ్సైట్
కొద్ది నిమిషాల్లో వెబ్‌సైట్‌ను సృష్టించుకోవాలని అనుకుంటున్నారా? అయితే విక్స్ ఏఐ వెబ్సైట్ బిల్డర్ సాయం తీసుకోవచ్చు. ఇది ఏఐ ఛాట్‌బాట్ సాయంతో సెకండ్లలోనే వెబ్‌సైట్‌ను తయారుచేస్తుంది మరి. -
మన డ్రోన్ ఉపగ్రహం!
డ్రోన్ల గురించి తెలిసిందే. వేడుకల్లో వీడియోలు తీయటం దగ్గరి నుంచి పొలాల్లో మందులు చల్లటం వరకూ రకరకాల పనులకు ఉపయోగపడుతున్నాయి. మరి ఇవి ఉపగ్రహం మాదిరిగానూ పనిచేస్తే? అలా ఉపయోగపడగల మానవరహిత బుల్లి విమాన వాహనాన్ని (అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్- యూఏవీ) బెంగళూరులోని నేషనల్ ఏరోస్పేస్ ల్యాబోరేటరీస్ (ఎన్ఏఎల్) గతవారం విజయవంతంగా పరీక్షించింది. -
వాట్సప్‌లో ఫేవరెట్స్ ట్యాబ్
వాట్సప్ ఛాట్స్ జాబితాలో ఇష్టమైన కాంటాక్టులను కనుక్కోవటం కష్టంగా ఉందా? త్వరలోనే దీనికి పరిష్కారం లభించనుంది. కొత్తగా ఫేవరెట్స్ ట్యాబ్‌ను పరిచయం కానుంది. దీన్ని ప్రస్తుతం ఐఓఎస్, వెబ్ యూజర్ల కోసం పరీక్షిస్తున్నారు. -
ఎక్స్ క్యాచీ శుభ్రం
ఎక్స్ (ట్విటర్) మొబైల్ యాప్ ఫోన్లో, ట్యాబ్లెట్లో క్యాచ్డ్ ఫైళ్లను నిల్వ చేస్తుందని తెలుసా? ఒకవేళ ఫోన్లో స్టోరేజీ నిండుకుంటున్నట్టయితే ఎక్స్ వెబ్, మీడియా క్యాచీని తొలగించుకోవటం తేలికైన, సత్వర పరిష్కార మార్గంగా ఉపయోగపడుతుంది. -
టెక్ చిట్కాలు
ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఇకపై బయోలో ఐదు లింకుల వరకు యాడ్ చేసుకోవచ్చు. యాప్‌లో లాగిన్ అయ్యాక అకౌంట్ సెటింగ్స్‌ను ఓపెన్ చేయాలి. మన ఫొటో దిగువన ఉండే ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్లి యాడ్ లింకును క్లిక్ చేయాలి. షేర్ చేయాలనుకునే లింకు జత చేసుకుంటే సరి. -
ప్రైవసీ విధాన వివరాలు తేలికగా ..
వెబ్సైట్లకు ప్రైవసీ పాలసీలు ఉండటం తెలిసిందే. వీటిని చాలామంది పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ ఆయా విధానాలను చదవాలన్నా పెద్దగా ఉంటాయి. -
యూట్యూబ్ వీడియో ఆడియోగా మారితే
యూట్యూబ్ అంటే ఎప్పుడూ చూడటమేనా? రేడియో మాదిరిగా పాటలు, సంగీతాన్ని వినలేమా? కొన్నిసార్లు ఇలాగే అనిపిస్తుంటుంది. వీడియోలను ఆడియో ఫైళ్లుగా సేవ్ చేసుకుంటే ఇది సాధ్యమే -
సోషల్ ఖాతా హ్యాక్ అయితే?
ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్.. ఇలా ఎన్నెన్నో సామాజిక మాధ్యమాలు. అభిప్రాయాలు పంచుకోవటానికైనా.. చుట్టుపక్కల సమాచారాన్ని తెలుసుకోవటానికైనా ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి -
అనవసర జీమెయిళ్ల తొలగింపు తేలికగా
అనవసర ఈమెయిళ్లు చాలా చికాకు కలిగిస్తాయి. రోజురోజుకీ ఇన్‌బాక్స్‌లో నిండిపోతూ వస్తుంటాయి. కొన్నిసార్లు వీటిని డిలీట్ చేయటానికే సమయమంతా వెచ్చించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. -
మెయిల్‌కు జవాబు మరుస్తుంటే?
మెయిల్‌ను చదువుతాం. తర్వాత జవాబిద్దామని అనుకుంటాం. తీరా మరచిపోతాం. ఎప్పటికో గానీ గుర్తుకురాదు. చాలాసార్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూనే ఉంటాం కదా. -
ఫోన్ టైపింగ్ వేగంగా
స్మార్ట్‌ఫోన్‌లో వేగంగా టైప్ చేయాలనుకుంటున్నారా? అయితే టెక్స్ట్ రిప్లేస్మెంట్ సాయం తీసుకోండి. దీంతో పెద్ద పదబంధాలకు షార్ట్‌కట్స్‌ను సెట్ చేసుకుంటే చాలా సమయం ఆదా అవుతుంది. -
స్నాప్‌చాట్ లైవ్ లొకేషన్‌తో భద్రం
మీ పిల్లలు స్నాప్‌ఛాట్ వాడుతున్నారా? కాస్త జాగ్రత్త. దీనిలోని లైవ్ లొకేషన్ ఫీచర్‌ను కొందరు దుర్వినియోగం చేయొచ్చు. పిల్లలు ఎక్కడున్నారో గుర్తించొచ్చు. -
మన మెయిల్ మనకే!
కొత్త సంవత్సరంలో లక్ష్యాలు నిర్దేశించుకున్నారా? వాటిని ఎంతవరకు సాధించారో ఎప్పటికప్పుడు సమీక్షించుకోవటం ఎంతైనా మేలు చేస్తుంది. ఇంకా చేయాల్సిందేంటి? ఎలా చేయాలి? అనేవి నిర్ణయించుకోవటానికి వీలవుతుంది -
ఛాట్‌జీపీటీకి సమాచారమా?
ఛాట్‌జీపీటీ వాడుతున్నారా? దీనికి వ్యక్తిగత వివరాలూ ఇస్తున్నారా? అయితే జాగ్రత్త పడాల్సిందే. ఛాట్‌జీపీటీకి మనం ఇచ్చే సమాచారమంతా భవిష్యత్ ఏఐ నమూనాలకు తర్ఫీదు ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. మున్ముందు ఇదెక్కడికి దారితీస్తుందో ఎవరికీ తెలియదు. -
డూప్లికేట్ ఫొటోలు పోయేలా..
కంప్యూటర్, ల్యాప్‌టాప్, ఫోన్లలో డూప్లికేట్ ఫొటోలు, ఫైళ్లు చాలా స్థలాన్ని ఆక్రమిస్తాయి. ఇవి అచ్చం నిజమైన ఫైళ్ల మాదిరిగానే కాకుండా వాటిని దాదాపు పోలినట్టుగానూ ఉండొచ్చు. వీటిని తొలగించటానికి ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లలో డిఫాల్ట్‌గా సదుపాయాలుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ప్రాజెక్ట్ వదులుకున్నా.. దీపిక నాకు థ్యాంక్స్ చెప్పాలి: కరీనాకపూర్
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్‌కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
-
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్