WhatsApp: చడీచప్పుడు లేకుండా వాట్సాప్‌ గ్రూపుల్లోంచి జారుకోవచ్చు..! త్వరలో కొత్త ఫీచర్‌

వాట్సాప్‌ గ్రూపుల్లో నుంచి ఇకపై చడీచప్పుడు లేకుండా జారుకోవచ్చు. ఇతర సభ్యులకు తెలియకుండానే గ్రూపుల నుంచి నిష్క్రమించవచ్చు. అదెలా అంటారా..?

Updated : 18 May 2022 16:09 IST

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ గ్రూపుల్లో నుంచి ఇకపై చడీచప్పుడు లేకుండా జారుకోవచ్చు. ఇతర సభ్యులకు తెలియకుండానే గ్రూపుల నుంచి నిష్క్రమించవచ్చు. అదెలా అంటారా..?ఎప్పుటికప్పుడు సరికొత్త అప్‌డేట్‌లతో ముందుండే వాట్సాప్‌.. మరో కొత్త ఫీచర్‌పై దృష్టి పెట్టింది. ఏదైనా కారణం చేత గ్రూపు కమ్యూనిటీ నుంచి వైదొలగాలనుకుంటే ఇతర సభ్యులను నొప్పించకుండా సులభమైన ఆప్షన్‌ తీసుకురానుంది. తద్వారా మనం గ్రూపు నుంచి ఎగ్జిట్‌ అయ్యే సంగతి.. అడ్మిన్‌ మినహా ఇతర సభ్యులకు తెలియకుండా ఉంటుంది.

ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్‌ను అతి త్వరలోనే బీటా వినియోగదారులకు పరిచయం చేయనున్నట్లు వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్ వాబీటా ఇన్ఫో పేర్కొంది. ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌తో పాటు డెస్క్‌టాప్‌ వినియోగదారులకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. అయితే, ఇది ఎప్పుడు విస్తృతంగా అందుబాటులోకి వస్తుందనేది మాత్రం వెల్లడించలేదు. మరోవైపు వాట్సాప్ ఒకే గ్రూప్‌లో 512 మంది సభ్యులను యాడ్‌ చేసేలా ఇకపై అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గ్రూప్‌ పరిమితి 256 మంది సభ్యులకే ఉన్న సంగతి తెలిసిందే. అలాగే గ్రూప్ అడ్మిన్‌లు తమ గ్రూప్‌లన్నింటినీ మెరుగ్గా హ్యాండిల్ చేయడానికి కమ్యూనిటీస్ ట్యాబ్‌ను వాట్సాప్‌ ప్రవేశపెట్టింది. ఇది త్వరలోనే వినియోగదారులకు చేరువయ్యే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని